Latest Updates
-
బ్రహ్మ యోగం ముగింపు.. ఇంద్ర యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.! -
వర్షాకాలంలో విహారయాత్ర.. మీ లగేజ్ బ్యాగ్‌లో ఈ ఐదు స్మార్ట్ గ్యాడ్జెట్స్ తప్పనిసరి.! -
కర్ణాటక ఫేమస్ తట్టే ఇడ్లీ..ఒక్కసారైనా తిని తీరాల్సిందే -
మకర రాశిలో చంద్రుడి సంచారం: ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం, ధన లాభం ఖాయం! -
దేవాలయాల్లో గోపురాలపై విగ్రహాలు ఎందుకు చెక్కబడ్డాయి? -
జూన్ 30 చంద్ర సంచారం: మకర రాశిలో చంద్రుడి రాకతో ఈ రాశుల వారికి కెరీర్ లో తిరుగులేదు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి కుజ గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - మంగళవారం, 30 జూన్ 2026 -
చిన్న గొడవలకే భార్యాభర్తల మధ్య అహం.. ఈ ఏడు మంత్రాలతో అన్యోన్య బంధం.! -
ఖరీదైన సీరమ్‌లు వద్దు.. ఈ ఒక్క కూరగాయతో మెరిసే ముఖం మీ సొంతం.!
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!
మనలో చాలామందికి ఎదురయ్యే ఒక సాధారణ సంఘటన.. ఎవరైనా అకస్మాత్తుగా మూర్ఛ లేదా ఫిట్స్ వచ్చి కింద పడిపోతే, వెంటనే కంగారుగా వారి చేతిలో ఇనుప తాళం చెవులు లేదా ఏదైనా ఇనుప వస్తువు పెట్టడం మనం తరచుగా చూస్తుంటాం. ఇలా ఇనుము చేతిలో పెడితే మూర్ఛ వెంటనే ఆగిపోతుందని ఎప్పటినుంచో ఒక నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది.

కానీ వైద్య శాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా అపోహ మాత్రమే. చేతిలో తాళాలు పెట్టడం వల్ల మూర్ఛ వ్యాధి ఏమాత్రం ఆగిపోదని డాక్టర్ పూజా శ్రీ లేమాన్ డాక్టర్ అనే పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ లో ఓ వీడియోలో తెలిపారు. ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు వారి ప్రాణాలను కాపాడేందుకు 4 ముఖ్యమైన దశలను తప్పక పాటించాలని ఆమె సూచించారు.
కంగారు పడకండి - పరిస్థితిని గమనించండి
ఎవరైనా కింద పడిపోగానే చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనలకు గురవడం సహజం. కానీ మీరు ముందుగా ప్రశాంతంగా ఉండటం అత్యంత ముఖ్యం. ఆ వ్యక్తి పరిస్థితిని జాగ్రత్తగా గమనించండి. వారి శ్వాస ఎలా ఉందో చూడండి. ఆందోళన చెందకుండా వారికి సహాయం చేయడంపై దృష్టి పెట్టండి.
ఎడమ వైపునకు తిప్పండి (రికవరీ పొజిషన్)
కిందపడిపోయిన వ్యక్తిని వీలైనంత త్వరగా ఎడమ వైపునకు తిప్పి పడుకోబెట్టాలి (దీనినే రికవరీ పొజిషన్ అంటారు). ఇలా చేయడం వల్ల వారి నోటి నుండి వచ్చే లాలాజలం లేదా నురగ సులభంగా బయటకు వెళ్లిపోతుంది. ఇది శ్వాసనాళంలోకి వెళ్లి ఉక్కిరిబిక్కిరి కాకుండా కాపాడుతుంది.
ప్రమాదకరమైన వస్తువులను తొలగించండి
ఫిట్స్ వచ్చినప్పుడు వ్యక్తి శరీరంలో తీవ్రమైన కుదుపులు వస్తాయి. ఆ సమయంలో వారికి గాయాలు కాకుండా చూసుకోవాలి. వారి చుట్టుపక్కల ఉన్న పదునైన వస్తువులు, రాళ్లు, గాజు పెంకులు, ఫర్నిచర్ అంచులు వంటి వాటిని వెంటనే తొలగించండి. తల కింద ఏదైనా మెత్తటి వస్త్రం లేదా దిండు ఉంచితే తల నేలకేసి బాదుకున్నప్పుడు గాయాలు కాకుండా ఉంటాయి.
టైం రికార్డ్ చేయండి
మూర్ఛ ఎంత సమయం పాటు వచ్చిందో గడియారంలో చూసి కచ్చితంగా నోట్ చేసుకోండి. ఒకవేళ సాధ్యమైతే ఆ ఎపిసోడ్ ను స్మార్ట్ ఫోన్ లో వీడియో తీయండి. ఆ వ్యక్తిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు, ఆ వీడియో, సమయం వారికి వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవడానికి, సరైన ట్రీట్మెంట్ అందించడానికి ఎంతో సహాయపడతాయి.
ఫిట్స్ వచ్చినప్పుడు అస్సలు చేయకూడని పనులు
ఫిట్స్ వచ్చిన వ్యక్తి నోట్లో నీళ్లు పోయడం, మందులు వేయడం లేదా చెంచా లాంటి వస్తువులు పెట్టడం అస్సలు చేయకూడదు. దీనివల్ల పళ్లు విరిగిపోవడం లేదా శ్వాసనాళం బ్లాక్ అయ్యి ప్రాణాపాయం కలగవచ్చు. వారి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకుని కుదుపులను ఆపే ప్రయత్నం చేయకండి. దీనివల్ల వారి ఎముకలు చిట్లే ప్రమాదం ఉంది.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం
ఎక్కువ శాతం మూర్ఛలు కేవలం ఒకటి లేదా రెండు నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత వారు స్పృహలోకి వచ్చేంతవరకు వారి పక్కనే ఉండి ధైర్యం చెప్పండి. ఒకవేళ ఐదు నిమిషాల కంటే ఎక్కువగా ఫిట్స్ వస్తుంటే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అంబులెన్స్ కు కాల్ చేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications