Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఇంట్లో చెప్పులు వేసుకోవచ్చా?,శాస్త్రవేత్తలు పండితులు ఏం చెప్పారంటే?
నమ్మకమో ఆచారమో తెలియదు కానీ, చాలా మంది ఇంట్లోకి చెప్పులు తీసుకెళ్లరు. బయటి నుంచి వచ్చిన తరువాత గుమ్మం ముందు లేదా పక్కన చెప్పులను వదిలేసి కాళ్ళను కడుక్కొని ఇంట్లోకి వెళ్తుంటారు. కానీ కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు ఆచారాలు కూడా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్పులను ఇంట్లో కూడా వేసుకొని తిరుగుతున్నారు. ఇంట్లో వాడుకునేందుకు ప్రత్యేకంగా చెప్పులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంట్లో చెప్పులు వేసుకోవడం మంచిదేనా? అసలు వేసుకోవచ్చా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. వాటి గురించి మేము ఈరోజు వివరించాము. ఈ స్టోరీలో చదివేయండి..
ఇంట్లో చెప్పులు ఎందుకు వేసుకోరు..
ఇంట్లోకి చెప్పులు వేసుకోకపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. ఆ చెప్పులతోనే ఇంట్లోకి వెళ్లడం వల్ల ఇంట్లోకి ప్రమాదకర బ్యాక్టీరియాలు ప్రవేశిస్తాయని, అందులో ఇంట్లోకి చెప్పులు వేసుకెళ్లరని చెబుతుంటారు. ఆ బ్యాక్టీరియాల కారణంగా ఇంట్లోకి వ్యక్తులు రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని అందుకే వేసుకెళ్ళరని పేర్కొంటుంటారు.

దీంతోపాటు ఇంట్లో దేవతలందరూ కొలువై ఉంటారని, వారి పటాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి వారు ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకొని వెళ్లడం పాపమని, అందుకే ఇంట్లోకి చెప్పులు లేకుండా వెళ్తారని కూడా చెబుతుంటారు. వారి ముందు నుంచి చెప్పులు వేసుకొని వెళ్లడం వల్ల వాళ్ళను తొక్కినట్లే అని పేర్కొంటుంటారు. అందుకే ఇంట్లోకి చెప్పులు వేసుకెళ్లరు.
ఇంట్లోకి చెప్పులు వేసుకెళ్లొచ్చా?
ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగొచ్చా అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. కానీ సైన్స్ మాత్రం ఇంట్లోకి చెప్పులు వేసుకొని వెళ్లొచ్చని చెబుతుంది. కాకపోతే బయట వాడిన చెప్పులను ఇంట్లోకి అస్సలు వేసుకెళ్లకూడదని, వాటిని వేసుకెళ్ళడం వల్ల ప్రమాదకర బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఇంట్లోకి చొరబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు.
అందుకు బదులుగా ఇంట్లోనే ఉండే చెప్పులను వేసుకోవాలని, వాటిని ఇంట్లో మాత్రమే వినియోగించాలని చెబుతున్నారు. వాటిని వినియోగించడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. కానీ ఇంట్లోకి చెప్పులు వేసుకెళ్ళడం వేసుకెళ్లకపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే... బయటి చెప్పులను ఇంట్లోకి మాత్రం అస్సలు వేసుకెళ్లకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
