కత్రినా కైఫ్ ఫిట్‌ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?

నా పెళ్లాం కత్రినా కైఫ్ లా ఉండాలి..నా డ్రీమ్ గర్ల్ కత్రినాలా ఉండాలి,అందం అంటే కత్రినా కైఫే అని ఒకప్పుడు కుర్రాళ్ల మాట్లాడుకునేవాళ్లు. అయితే వయస్సు పెరుగుతున్నా,గర్భవతి అయినప్పుడు, డెలివరీ తర్వాత ఏ మహిళకు అయినా ముఖంలో, శరీరాకృతిలో మార్పులు రావడం చాలా సహజం. అయితే దీనిని అర్థం చేసుకోలేని కొందరు..క్రతినా కైఫ్ లేటెస్ట్ లుక్స్ గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలోని తన ఇంట్లొ వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇతర ప్రముఖలతో పాటు కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆలివ్ రంగు సల్వార్ కమీజ్.. నుదుటిన నిండుగా ఎర్రటి బొట్టు, చెరగని చిరునవ్వుతో కనువిందు చేసినప్పటికీ కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో విమర్శకుల నుంచి తీవ్రమైన, బాధాకరమైన కామెంట్లను ఎదుర్కోవలసి వచ్చింది. దీనికి కారణం.. ప్రసవం తర్వాత ఆమె శరీరంలో వచ్చిన మార్పులు, పెరిగిన బరువు.

Katrina Kaif Body Shamed at Ambani Ganesh Puja Unveiling Her Strict Fitness Diet Secrets

వాస్తవానికి ప్రసవానంతర కాలంలో ఏ మహిళ శరీరంలోనైనా కొవ్వు శాతం పెరగడం ప్రకృతి సహజం. హార్మోన్ల ప్రభావం, వివిధ శారీరక మార్పుల కారణంగా అమాంతం పెరిగిన బరువును వెంటనే తగ్గించుకోవడం, నియంత్రించడం ఏమాత్రం సులభమైన విషయం కాదు. పైగా కొత్త తల్లులు వెంటనే కఠినమైన వ్యాయామాలు చేసే శారీరక సామర్థ్యాన్ని కలిగి ఉండరు. ప్రస్తుతం కత్రినా కూడా సరిగ్గా ఇలాంటి సహజమైన దశనే దాటుతోంది. అయినప్పటికీ, నెటిజన్లు ఆమెపై వేస్తున్న వ్యంగ్యాస్త్రాలకు, బాడీ షేమింగ్ కామెంట్లకు అంతు లేకుండా పోయింది.

ఈ క్రమంలో చాలామంది ప్రముఖలు కూడా కత్రినాకు సపోర్ట్ చేయడం, చివరికి కత్రినా కూడా దీనిపై స్పందించడం జరిగిపోయింది. అందం అంటే ఆరోగ్యంగా ఉండటమేనని, మనికి మనం ఉన్నతంగా కనిపించడమేనని కత్రినా కైఫ్ తనను ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. పైకి కనబడేది అందం కాదని.. మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామనేది ముఖ్యమన ట్రోలర్స్ కి సమాధానమిచ్చారు.

కానీ కత్రినా కైఫ్ తన శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తుందో, ఎంత భక్తిశ్రద్ధలతో కాపాడుకుంటుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తాత్కాలిక బరువును చూసి విమర్శించే వారికి 2019లో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూనే సరైన సమాధానం. ఒక నిర్దిష్టమైన, కఠినమైన ఆహార నియమాలను పాటిస్తూ, తీవ్రమైన శారీరక శ్రమ చేస్తూ తన ఫిట్‌ నెస్‌ ను కాపాడుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఆమె పాటించే ఆహార నియమాల గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

కత్రినా దాదాపు 95 శాతం సమయం కేవలం మూడు ప్రధానమైన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. అవేమిటంటే.. గ్లూటెన్, ప్రాసెస్ చేసిన చక్కెర (రిఫైన్డ్ షుగర్), పాల ఉత్పత్తులు. ఈ మూడింటిని పక్కన పెట్టి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆమె తీసుకుంటుంది. అయితే చాలామంది డైటింగ్ చేసే వారిలాగా ఆమె కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయాలని నమ్మదు. కార్బోహైడ్రేట్లను ఆమె తన శరీరానికి శత్రువుగా ఏమాత్రం భావించదు. శక్తి కోసం వాటిని తీసుకుంటూనే, జంక్ ఫుడ్‌ ను తొలగించడం ద్వారా ఎంతో క్రమశిక్షణతో కూడిన మితాహారాన్ని తీసుకుంటుంది.

ఇక వ్యాయామం విషయానికి వస్తే.. బాలీవుడ్‌ లో కత్రినా కైఫ్ పేరు ఒక బ్రాండ్. ఎంతోమంది తోటి బాలీవుడ్ తారలు సైతం ఆమె ఫిట్‌ నెస్ చూసి ఆశ్చర్యపోతూ, అనేక సందర్భాల్లో ఆమెను ప్రశంసించారు. వారానికి ఆరు రోజుల పాటు, కనీసం 45 నిమిషాల సమయాన్ని వ్యాయామం కోసం కచ్చితంగా కేటాయించడానికి ఆమె శ్రమిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion