Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం.. లైట్ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు.!
పీరియడ్స్ సమయంలో మహిళలు అధిక రక్తస్రావం, తీవ్రమైన కడుపు నొప్పి, నీరసం వంటి సమస్యలతో సతమవుతుంటారు. అయితే నెలలో ఆ మూడు రోజులు ఇది సాధారణమైన సమస్యగా భావించి రోజువారీ పనుల్లో నిమగ్నమవుతుంటారు. కానీ ఇది లైట్ తీసుకోవాల్సిన విషయం కాదని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. దీనిపై అవగాహన లోపమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే అధిక రక్తస్రావం సమస్య అంతర్లీనంగా అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఈ సమస్యను సాధారణంగా పరిగణించవద్దని వెల్లడించారు. హై బ్లీడింగ్.. కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనతను సూచించవచ్చని పేర్కొన్నారు.
దీర్ఘకాలం పాటు ఉందా.?
చాలా మంది మహిళల్లో నెలసరి మూడు రోజులు ఉంటుంది. కానీ కొందరిలో వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగుతుంది. దీంతో ప్రతి గంటకోసారి ప్యాడ్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ అసాధారణమైన ప్రక్రియ శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తల తిరగడం, ఆయాసం, శరీరం డీలా పడిపోవడం, హార్ట్‌బీట్‌లో వేగం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అధిక రక్తస్రావం కారణంగా శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గి రక్తహీనతకి దారితీస్తుంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాల ప్రకారం.. ఇలా అధిక రక్తస్రావం కొనసాగుతున్నట్లయితే తప్పనిసరిగా సంబంధిత వైద్యులతో చర్చించాలని చెబుతోంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తోంది.

ఫైబ్రాయిడ్స్
ప్రాథమికంగా గర్భాశయంలో కణితులను ఫైబ్రాయిడ్స్ అంటారు. అయితే ఇది క్యాన్సర్ కాదు. కానీ దీని కారణంగా కటి ప్రాంతంలో ఒత్తిడి, తరచుగా మూత్రానికి వెళ్లడం, నడుము నొప్పి, గర్భం ధరించడంలో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గర్భాశయంలోని ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్‌ను మహిళలు తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ కారణంగా పీరియడ్స్ టైంలో నొప్పి, అధిక రక్తస్రావం, దంపతుల కలయిక సమయంలో నొప్పి, ఇంకా సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయని గైనకాలజిస్ట్ నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్ల అసమతుల్యత పీరియడ్స్ సైకిల్‌పై సైతం ప్రభావం చూపిస్తుంది. పాలీఎండ్రోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PMOS), థైరాయిడ్ సమస్య, ఊబకాయం, ఒత్తిడి, అండోత్పత్తిలో అంతరాయం వంటి పరిస్థితులు కూడా అధిక రక్తస్రావానికి దారితీస్తాయి.
ఈ క్రమంలో అధిక రక్తస్రావం సమస్యతో దీర్ఘకాలికంగా బాధపుడుతున్న మహిళలు వైద్య చికిత్సలో ఆలస్యం చేయొద్దని గైనకాలజిస్ట్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో వాళ్లతో ఈ సమస్య గురించి ప్రస్తావించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. వారి సహాయం తీసుకోవాలని.. అభద్రతా భావంతో ఉండవద్దని హెచ్చరిస్తున్నారు.
ఆలస్యం చేయొద్దు
గైనకాలజిస్టును సంప్రదించడం ద్వారా సమస్యకి సరైన కారణాలు తెలుసుకోవచ్చు. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ చరిత్ర ఇంకా పలు టెస్టుల ద్వారా వ్యాధి నిర్ధారణ అవుతుందని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. తద్వారా మందుల ద్వారా హార్మోన్ల చికిత్స, ల్యాప్రోస్కోపీ వంటి తక్కువ కోత గలిగిన అధునాతన శస్త్ర చికిత్సలతో అధిక రక్తస్రావం, కడుపు నొప్పి, నీరసం వంటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం పొందవచ్చని వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
