Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పానీపూరి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయా.. తెలుసుకుంటే జన్మలో పానీపూరీని వదలరు!
పానీపూరి చాలామందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బయట ఎక్కడ కనిపించినా దీనిని తినకుండా వదిలిపెట్టరు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో పోసి పానీలో మసాలాలు వేయడంతో పాటు పూరి చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. అందుకే దీనిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే స్వచ్ఛమైన పానీపూరి రుచికరంగా మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పానీపూరి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పానీపూరి వల్ల కలిగే ప్రధాన లాభాలు:
జీర్ణ వ్యవస్థకు మేలు
పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మేలు జరుగుతుంది. పానీపూరీలో పుదీనా, జీలకర్ర వంటివి వినియోగిస్తుంటారు. ఇవి జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి తిన్న ఆహరం సరిగ్గా జీర్ణమైపోతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు తొలిగిపోతాయి.

శరీరానికి శక్తి
తక్షణమే శక్తి కావాలని అనుకునే వ్యక్తులు పానీపూరి తినడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. పానీపూరీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే చాలా ఉత్తేజంగా పనులను పూర్తి చేసుకోగలుగుతారు.
విటమిన్లు మరియు ఖనిజాలు
పానీపూరీలో కేవలం కార్బోహైడ్రేడ్లు మాత్రమే కాదు.. విటమిన్స్ కూడా ఉంటాయి. పానీపూరీలో బంగాళాదుంపలు, శనగలు వంటివి కూడా వినియోగిస్తారు. ఇందులో పుష్కలంగా విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన విటమిన్స్‌ను అందిస్తాయి. అలాగే ఉత్తేజంగా ఉండేందుకు సహాయపడతాయి.
నోటి పూతలకు సరైన ఔషధం
చాలా మందికి నోటి పూత వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాంటి వ్యక్తులు పానీపూరి తినడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. పానీపూరీలో నోటిపూతను తగ్గించే కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే పానీపూరి తింటే నోటిపూత నుంచి ఉపశమనం లభిస్తుంది.
మనస్సు ఉత్తేజంగా ఉంటుంది
పానీపూరీలో ఉండే పుదీనా, జీలకర్ర వంటివి మనసును రెఫ్రెషింగ్‌గా చేస్తుంది. దీని వల్ల మనస్సు ఉత్తేజంగా మారుతుంది. ఏ పనినైనా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. మంచి ప్రొడక్టివిటీని అందించగలుగుతారు.
అయితే, పానీపూరిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:
స్వచ్ఛమైన పరిసరాలలో తయారు చేయబడిన పానీపూరిని మాత్రమే తినాలి. పానీపూరిలో ఉపయోగించే నీరు శుభ్రంగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఎట్టి పరిస్థితుల్లో అధికంగా తినకూడదు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులు పానీపూరి తినేముందు వైద్యులను సంప్రదించడం ముఖ్యం. పానీపూరి తయారీ కొన్ని ప్రదేశాల్లో అంత శుభ్రంగా ఉండదు. అందుకే తినేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తినడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
