Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.!
అమ్మాయిలు జుట్టును ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. ఇంకా ఇంట్లోనే చిట్కాలు కూడా పాటిస్తుంటారు. కర్లీ, సిల్కీ హెయిర్ ఏదైనా సరే వారి అభిరుచులకు అనుగుణంగా స్టైలింగ్ చేసుకుంటారు. ఈ క్రమంలో హెయిర్ స్ట్రెయిటెనింగ్, స్మూతింగ్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ రెండింటి మధ్య తేడాలేంటో చాలా మందికి తెలియదు.

జుట్టుకి సంబంధించి సౌందర్య చికిత్సల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్, స్మూతింగ్ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే కెమికల్స్, పరిమాణాల సంఖ్య కూడా వేర్వేరుగా ఉంటుంది. అందుకే వీటి ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ రెండు ట్రీట్‌మెంట్స్‌తో జుట్టు మెరిసేలా కనిపించినప్పటికీ తేడాను గుర్తించలేరు. ఆ తేడాలు తెలుసుకుని మీ కురులకి సరైన విధానాన్ని ఎంచుకోవచ్చు.
హెయిర్ స్ట్రెయిటెనింగ్
హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకోవడం ద్వారా మీ జుట్టు ఆకృతి పూర్తిగా మారుతుంది. మీ కురులు వంకరంగా ఉంటే నిటారుగా చేస్తుంది. ఈ క్రమంలో ఉంగరాల జుట్టు కూడా ఈ చికిత్స ద్వారా స్ట్రెయిట్‌గా మారుతుంది. దీని వల్ల మీ జుట్టు ముందు కంటే పొడవుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
హెయిర్ స్ట్రెయిటెనింగ్‌లో కర్లీ హెయిర్‌ను మొత్తం నిటారుగా నునుపుగా మారుస్తుంది. ఇందులో అధిక గాఢత కెమికల్స్‌ను వాడటం ద్వారా మీ జుట్టు నిర్మాణం, స్ట్రక్చర్ పూర్తిగా మారిపోయి కొత్తగా కనిపిస్తుంది.
ఈ ట్రీట్‌మెంట్‌తో దాదాపు 6 నుంచి 12 నెలల వరకు జుట్టు అదే స్టైల్‌లో ఉంటుంది. కొత్త జుట్టు వచ్చాక ఆకృతి మారుతుంది. అయితే ఇందులో గాఢత ఎక్కువ ఉన్న రసాయనాలు, అధిక వేడిని ఉపయోగించడం ద్వారా జుట్టు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
హెయిర్ స్మూతింగ్
ఇక, స్మూతింగ్ చికిత్సలో ప్రొటీన్ ఫార్ములాను ఉపయోగిస్తారు. స్మూతింగ్ చేసుకోవడం ద్వారా జుట్టు నిర్మాణం కొద్దిగా మారి మరింత మెరుస్తుంది. ఈ ప్రక్రియలో తేలికపాటి కెరాటిన్ ఆధారిత ప్రోటీన్ ఫార్ములాను ఉపయోగించడం ద్వారా కురులు మెరుస్తూ కనిపిస్తాయి. కర్లీ హెయిర్ ఉన్న వారికి కెరాటిన్ ప్రొటీన్ అప్లై చేయడం ద్వారా కురులు నునుపుగా మారతాయి. అనంతరం జుట్టును ఐరన్ చేసి, షాంపూ తర్వాత కండిషనర్‌తో శుభ్రపరుస్తారు. దీంతో జుట్టు ఆకర్షణీయంగా, మెరుస్తూ కనిపిస్తుంది.

స్మూతింగ్ ద్వారా జుట్టు చిక్కులు పడటం తగ్గుతుంది. మెరుస్తూ ఉండటమే కాకుండా ఒత్తుగా కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో ప్రొటీన్ ఉండటం వల్ల కొన్ని రోజులపాటు కురులు స్మూత్‌గా ఉంటాయి. దాదాపు 3 నుంచి 6 నెలల పాటు మీ జుట్టుపై స్మూతింగ్ ప్రభావం ఉంటుంది. తర్వాత మళ్లీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా జుట్టుకి నష్టం కలిగే అవకాశాలు తక్కువ.
ఏది బెస్ట్
మీ జుట్టు స్వభావం, మీ డైలీ రొటీన్ బట్టి హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ప్రతి రోజూ స్టైలింగ్ చేసుకోవడం కుదరని వాళ్లు స్ట్రెయిటెనింగ్ చేసుకోవచ్చు. అయితే కెమికల్స్ ఎఫెక్ట్‌ను తట్టుకునేంత శక్తి మీ జుట్టుకి ఉండాలి. లేదా మీ జుట్టు తేలికగా, సహజంగా మెరిసేలా, చిక్కులు పడకుండా ఉండాలంటే స్మూతింగ్ చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
