ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయ వ్యాధి) అనేది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం విపరీతంగా మందు తాగేవాళ్లలో ఈ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం..షుగర్, హై బీపీ, అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యల వల్ల మద్యం ముట్టని వారిలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ముప్పు తీవ్రమవుతోంది.

దీనిలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఇది ఒక సైలెంట్ కిల్లర్. ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు చూపకుండానే లోపల కాలేయాన్ని దెబ్బతీస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే కాలేయం వాపు రావడం, మచ్చలు పడటం, సిర్రోసిస్, చివరకు కాలేయ క్యాన్సర్‌ కు కూడా దారితీయవచ్చు. అయితే అదృష్టవశాత్తూ, మీ కాలేయం ప్రమాదంలో ఉందనే విషయాన్ని మీ ముఖం ముందుగానే పసిగట్టి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి సులభంగా బయటపడవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.

Look in the Mirror 4 Shocking Ways Your Face Reveals Liver Damage

ముఖం ఉబ్బినట్లుగా ఉండటం

కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు శరీరానికి అవసరమైన ప్రోటీన్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల రక్తప్రసరణ, ద్రవాల సమతుల్యత దెబ్బతిని ముఖం వాపుకు గురవుతుంది. ఎలాంటి కారణం లేకుండా ముఖ్యంగా మీ కళ్ళు, చెంపల చుట్టూ ఉబ్బినట్లు అనిపిస్తే.. అది కాలేయం పంపుతున్న ముందస్తు హెచ్చరికగా భావించాలి.

కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్?కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్?

మెడ చుట్టూ నల్లబడటం

చాలామంది మెడ చుట్టూ నల్లగా మారితే.. అది ఎండ వల్ల లేదా మురికి అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఇది ఇన్సులిన్ నిరోధకత వల్ల వచ్చే ఫ్యాటీ లివర్‌కు ముఖ్యమైన సంకేతం. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగినప్పుడు, చర్మంలో పిగ్మెంటేషన్ పెరిగి ముందుగా మెడ భాగం నల్లగా మారుతుంది. మీ మెడ అకస్మాత్తుగా నల్లబడుతుంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి.

ముఖం ఎర్రబడటం, దద్దుర్లు

కాలేయ సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ముఖం ఎర్రగా మారడం, చిన్నచిన్న గడ్డలు లేదా దద్దుర్లు ఏర్పడతాయి. అలాగే లివర్ ఫంక్షన్ దెబ్బతినడం వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే శక్తి తగ్గి, జింక్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల నోటి చుట్టూ చికాకు, దద్దుర్లు వస్తుంటాయి.

ఇతర ముఖ్యమైన సంకేతాలు

ఫ్యాటీ లివర్ వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ రక్తంలో బిలిరుబిన్ శాతం పెరిగి కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారి కామెర్లు వస్తాయి. అలాగే రక్తంలో బైల్ (పైత్య) లవణాలు పేరుకుపోవడం వల్ల ముఖంపై తీవ్రమైన దురద కలుగుతుంది.

మీ ముఖంలో లేదా మెడ భాగంలో ఈ మార్పులు ఎలాంటి కారణం లేకుండా పదే పదే కనిపిస్తుంటే, వాటిని తేలికగా తీసుకోకండి. వెంటనే తగిన పరీక్షలు (లివర్ ఫంక్షన్ టెస్ట్, స్కానింగ్) చేయించుకోండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 16, 2026, 11:34 [IST]
Desktop Bottom Promotion