Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్‌మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.!
సోషల్ మీడియాలో 'లుక్స్‌మాక్సింగ్’ ట్రెండింగ్ వైరల్ అవుతోంది. లుక్స్‌మాక్సింగ్ అంటే యువకుల ఫిట్‌నెస్, ఫిజికల్ లుక్ విషయంలో తాము చూపుతున్న వ్యామోహం. అయితే ఇది యువకులపై ఇది ప్రభావం చూపుతుందని సైకాలజిస్ట్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ లియా జెస్సీ అంటున్నారు. లుక్స్‌పై వారి వ్యామోహం.. అనారోగ్యంతో పాటు కొన్నిసార్లు తీవ్ర స్థాయి ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకు కారణాలేంటంటే..

యువకులు తమ శారీరక రూపాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ లుక్స్‌మాక్సింగ్. అయితే పదేళ్ల క్రితం దీనిని మ్యానోస్ఫియర్‌గా పిలిచేవారు. ఇప్పుడు లుక్స్‌మాక్సింగ్‌గా వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఇంకా లైక్స్, షేర్స్ కోసం కొందరు యువ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆరాటపడటం చూస్తుంటాం. ఈ క్రమంలో యువకులు తమ ఫొటోలను ఎలా పోస్ట్ చేస్తే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆన్‌లైన్‌లోనే సలహాల కోసం చూస్తుంటారు.
ఇదిలా ఉండగా.. లుక్స్‌మాక్సింగ్‌లో పలు రకాలు ఉన్నాయి. మొదటిది "సాఫ్ట్‌మాక్సింగ్".. సాధారణ, ఆరోగ్యకరమైన జీవనశైలికి అనుగుణంగా ఉంటుంది. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం, స్కిన్ కేర్ ఇలాంటివి సాఫ్ట్‌మాక్సింగ్ పరిధిలోకి వస్తాయి. రెండోది "హార్డ్‌మాక్సింగ్".. ఇందుకు పేరుకు తగ్గట్లుగానే వివిధ మార్పులను కలిగి ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ, కెమికల్స్ వాడకం వంటివి ఎక్కువ అవుతుంటాయి. ఉదాహరణకు బోన్ స్మాషింగ్, మ్యూయింగ్ వంటివి.
లుక్స్‌మాక్సింగ్‌కి ఎందుకు అట్రాక్ట్ అవుతారు
సాధారణంగా కౌమారదశలోకి రాగానే అప్పటివరకూ తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన అబ్బాయిలు.. బయటకు వచ్చి ఉన్నత విద్య, కెరీర్ పరంగా అడుగులు ముందుకు వేస్తుంటారు. ఈ క్రమంలో ఒంటరి ప్రపంచంలో తన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడం మొదలుపెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో లుక్స్, స్టైల్ పరంగా వారితో సమానంగా ఉండాలని.. ఫ్రెండ్స్, ఉద్యోగులతో కలిసిపోయే ఉద్దేశంతో లుక్స్‌మాక్సింగ్ వైపు మొగ్గు చూపుతుంటారు.
ఈ క్రమంలోనే కొందరు తమ ఫిజికల్ ఫిట్‌నెస్, ముఖంపై భాగాలు, కండరాల పరిమాణం ఏ మాత్రం తీసిపోకుండా ఉండాలని భావిస్తారు. పదేపదే సోషల్ మీడియాలో వీటిని ఫాలో అవ్వడం ద్వారా వారిలో డోపమైన్ ప్రేరేపితమై ఎలాగైనా సరే శారీరకంగా ఆకట్టుకునేలా ఉండాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అదే మగాడి లక్షణం అనుకుంటారు.
అయితే యువకులు అందంగా, ఫిట్‌గా కనిపించాలని అనుకోవడంలో తప్పు లేదు. ఆరోగ్యకరంగా ఫిట్‌నెస్‌తో ఉంటే తప్పు లేదని.. కానీ అందుకోసం స్టెరాయిడ్స్, ఇతర కెమికల్స్, పద్ధతులను ఆశ్రయించడం మున్ముందు తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని లియా హెచ్చరిస్తున్నారు. యువతులను ఆకర్షించేందుకు లుక్స్‌మాక్సింగ్ ప్రయత్నాలు యువకులపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

అయితే లుక్స్‌మాక్సింగ్ ప్రయత్నాలు తీవ్రంగా ఉంటే దానిని డిజార్డర్‌గా పరిగణించాలని లియా పేర్కొన్నారు. శారీరక రూపానికి సంబంధించి అదే పనిగా సమయం వెచ్చించడం, ఆహారపు అలవాట్లలో ఒక్కసారిగా ఊహించని మార్పులు, వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఎక్కువ సేపు గడపడం, ఫ్రెండ్స్‌కి దూరం కావడం, వారితో కలవకపోవడం వంటివి ఈ డిజార్డర్‌కి సంకేతాలుగా భావించాలి. యువకులకి సంబంధించి బ్యూటీ ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్‌కి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి.
తల్లిదండ్రులు అలర్ట్
మీ పిల్లల్లో ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండాలని లియా సూచిస్తున్నారు. వారి ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే అడిగి తెలుసుకోవాలి. లుక్స్‌మాక్సింగ్ కోసం వారి చేసే కఠిన ప్రయత్నాలు సరైనవి కావని నెమ్మదిగా చెప్పాలి. కేవలం శారీరక అందమే కాకుండా మానసికంగా ఎంత ఆరోగ్యకరంగా, సంతోషంగా ఉండాలో వారికి తెలియజెప్పాలి. అవసరమైతే కౌన్సిలింగ్ ద్వారా వారిలో ఆరోగ్యకరమైన అలవాట్లు తీసుకురావాలని సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
