Latest Updates
-
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.!
Weight loss tips : నెలలోనే 5 కేజీల బరువు తగ్గాలా? శిల్పా అరోరా చెప్పిన సింపుల్ చిట్కాలు ఇవే
చిన్న వయస్సు నుంచే చాలామంది ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపుడుతున్నారు. ఒక వ్యక్తి ఎత్తుకు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండటాన్ని అధిక బరువు అంటారు. అధిక కేలరీలు, కొవ్వులు, చక్కెరలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి,నిద్రలేమి,అనారోగ్యకరమైన జీవనశైలి, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కూడా అధికంగా బరువు పెరిగిపోతుంటారు. అధిక బరువు కారణంగా షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అధిక బరువు కారణంగా కొంతమంది నలుగురిలోకి వెళ్లి ఉండాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
ప్రస్తుతం చాలామంది ఫుడ్ తీసుకోవడం తగ్గిస్తే లేదా రాత్రి పూట తినడం మానేస్తే బరువు తగ్గొచ్చు అని రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. వాస్తవానికి ఇవన్నీ కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ తినడం మానేస్తే శరీరంలో నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారాల వల్ల బరువు పెరిగినట్లు..ఆరోగ్యకరమైన ఆహారాలు తిని బరువు తగ్గించుకోవచ్చు. అయితే ప్రముఖ డైటీషియన్ శిల్పా అరోరా.. 1 నెలలో 5 కిలోలు బరువు ఎలా సింపుల్ గా తగ్గచ్చో తెలిపారు. ఈ మేరకు ఆమె తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

డైటీషియన్ శిల్పా అరోరా ప్రకారం.. పొద్దున్నే ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు తాగాలి.. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు చెంచా మెంతులను నీటిలో నానబెట్టుకోవాలి. వాటిని పొద్దునే తాగాలని చెప్నారు. దీనివల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారని చెప్పారు. నానబెట్టిన మెంతులను నమిలి కూడా తినవచ్చు అని..మెంతులు జీవక్రియను పెంచి ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయని చెప్పారు. ఇది బ్లడ్ లో షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుందని తెలిపారు. పదే పదే తినాలని కూడా అనిపించదని చెప్పారు.
బ్రేక్ ఫాస్ట్ లోకి తినాల్సిన ఆహారం గురించి శిల్పా అరోరా ఏం చెప్పారంటే..ఓ గిన్నెలో నాలుగు వాల్ నట్స్, 1 టీస్పూన్ అవిసె గింజల పొడి, కొద్దిగా పెరుగు, గుడ్డు రెక్కలు వేసి కలిపి దీనిని తినాలన్నారు. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్,ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుందని.. ఇది టేస్ట్ తో పాటు బరువు తగ్గడానికి సాయపడుతుందని చెప్పారు.
బ్రేక్ ఫాస్ట్,లంచ్ చేసే మధ్యలో పసుపు,ఆమ్లా వాటర్ తాగాలని తెలిపారు. ఇది జీవక్రియను పెంచుతుందని, ఉబ్బరం తగ్గించి, పోషకాలను బ్యాలెన్స చేయడం ద్వారా కేలరీను బర్న్ చేస్తుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ఇది సాయపడుతుందని చెప్పారు. అయితే తినే 20 నిమిషాల ముందుగానీ లేదా తిన్నాక 20 నిమిషాల దాక గానీ నీళ్లు తాగకూడదని శిల్పా అరోరా తెలిపారు.
మధ్యాహ్నాం భోజనంలో భాగంగా..కొద్దిగా అన్నం, శెనగపిండి కూర, ఒక గిన్నె పెరుగు, నిమ్మరసం కలిపిన సలాడ్ తినాలని శిల్పా అరోరా చెప్పారు. ఇవి బ్లడ్ లో షుగర్ ని కంట్రోల్ చేసి బరువు పెరగడకుండా అడ్డుకుంటుందని తెలిపారు.
సాయంత్రం పూట చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుందని..అయితే ఇందులో చక్కెర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదని శిల్పా అరోరా చెప్పారు. కావాలనుకుంటే మాంక్ ఫ్రూట్ షుగర్ లేదా తీపినిచ్చే మొక్క స్టీవియా(మధుపత్రి)వేసుకోవాలని ఆమె సూచంచారు.
రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల్లోపే తినేసేయాలని..డిన్నర్ లోని రెండు గుడ్డులోని తెల్లసొనతో చేసిన భుర్జీ లేదా ఆమ్లెట్ తినమని సిఫార్సు చేస్తారు. మీరు దానికి ఉల్లిపాయలు, టమోటాలు,పుట్టగొడుగులను యాడ్ చేసుకోవచ్చని శిల్పా అరోరా సూచించారు. నెల రోజులు ఇలా చేశారంటే 5 కిలోలు ఈజీగా తగ్గొచ్చని శిల్పా అరోరా చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications