Latest Updates
-
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు?
వర్షాకాలం పచ్చదనాన్ని, చల్లని వాతావరణాన్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలను కూడా తనవెంటే తీసుకువస్తుంది. భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా నీరు నిలిచిపోవడం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో భూమి అడుగున ఉండే పాముల బొరియల్లోకి నీరు చేరడంతో, అవి ప్రాణరక్షణ కోసం సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాలను లేదా నేరుగా మన ఇళ్లను ఆశ్రయిస్తుంటాయి.
ఈ కారణంగానే వర్షాకాలంలో పాముకాటు సంఘటనలు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనకు ఉండే సరైన అవగాహనే ఒకరి ప్రాణాలను నిలబెడుతుంది. పాము కరిచినప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ చూడండి.

రోగిని ప్రశాంతంగా ఉంచడమే..
పాము కరిచిందని తెలియగానే ఎవరైనా తీవ్రమైన భయాందోళనలకు గురవడం సహజం. కానీ, ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రోగిని మానసికంగా పూర్తి ప్రశాంతంగా ఉంచాలి. వారికి ధైర్యం చెప్పాలి. ఎందుకంటే మనిషి భయపడినప్పుడు గుండె స్పందన రేటు అమాంతం పెరుగుతుంది. గుండె ఎంత వేగంగా కొట్టుకుంటే, రక్తప్రసరణ అంత వేగవంతం అవుతుంది. దీనివల్ల పాము విషం క్షణాల్లోనే శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది.
కదలికలు వద్దు..
పాముకాటుకు గురైన చేతిని లేదా కాలును అస్సలు కదపనివ్వకూడదు. విరిగిన ఎముకకు కట్టు కట్టినట్లుగా ఆ భాగాన్ని పూర్తిగా నిశ్చలంగా ఉంచాలి. అలాగే గాయపడిన అవయవాన్ని ఎప్పుడూ గుండె స్థాయి కంటే కిందనే ఉంచేలా జాగ్రత్తపడాలి. పొరపాటున కూడా చేయి లేదా కాలును పైకి ఎత్తకూడదు. ఇలా చేయడం వల్ల విషం గుండెకు చేరే వేగం తగ్గుతుంది.
సినిమాలు చూసి ఈ తప్పులు చేయకండి
పాము కరవగానే గాయం దగ్గర కత్తితో కోయడం, లేదా నోటితో రక్తాన్ని పీల్చి ఉమ్మివేయడం లాంటివి మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజజీవితంలో ఇవి ప్రాణాంతకం. పాముకాటు వేసిన ప్రదేశాన్ని కోయడం గానీ, చీల్చడం గానీ చేయకండి. గాయం పైన తాడుతో అత్యంత గట్టిగా కట్టకూడదు. ఇలా కట్టడం వల్ల రక్తప్రసరణ ఆగిపోయి ఆ అవయవం పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. నాటు వైద్యాల కోసం సమయం వృథా చేయవద్దు.
విష విరుగుడు మందే సంజీవని
పాముకాటుకు ఏకైక ట్రీట్మెంట్ యాంటీ స్నేక్ వెనమ్. సమయం వృథా చేయకుండా, వెంటనే రోగిని పాముకాటుకు ట్రీట్మెంట్ అందించే హాస్పిటల్ కు తరలించాలి. ఎంత త్వరగా విష విరుగుడు మందును ఇస్తే, ప్రాణాలు దక్కే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
శ్వాసపై నిరంతర నిఘా
చాలావరకు ప్రమాదకరమైన పాముల విషం నేరుగా మనిషి నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనివల్ల కండరాలు పక్షవాతానికి గురవుతాయి. ముఖ్యంగా శ్వాస ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి హాస్పిటల్ కి వెళ్లే మార్గంలో రోగి శ్వాసక్రియ సరిగ్గా ఆడుతుందా లేదా అనే విషయాన్ని నిశితంగా గమనిస్తూ ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
