Latest Updates
-
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు!
అబ్బాయిల కోసం వర్షాకాలం ఫ్యాషన్ టిప్స్.. ఈ దుస్తులతో స్మార్ట్ లుక్‌తో పాటు సౌకర్యం మీ సొంతం.!
వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించినా.. ఫ్యాషన్‌పరంగా యువతీయువకులను అనేక సవాళ్లను తీసుకువస్తుంది. తరచుగా వర్షాలు, తేమ, బురద కారణంగా రోజంతా స్టైలిష్‌గా కనిపించడం సాధ్యం కాదు. అంతేకాదు సౌకర్యవంతంగా ఉండటమూ కష్టమే. ముఖ్యంగా పురుషులకీ ఇది కొంచెం ఛాలెంజ్ లాంటిదే. ఈ క్రమంలో జెంట్స్ రెయినీ సీజన్‌లో ఎలాంటి ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి, రంగు, పాదరక్షలు సౌకర్యవంతంగా ఉంటాయి. బ్యూటీ నిపుణుల సలహాలు ఇక్కడ చూద్దాం..

కాలేజ్ అయినా ఆఫీసు అయినా.. లేదా వర్షాకాలంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లినా కాలానికి అనుగుణంగా సరైన దుస్తులు ఎంచుకోవడం ముఖ్యం. ఈ కాలంలో ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు అసౌకర్యం నుంచి కాపాడే ఫ్యాబ్రిక్, రంగులు, యాక్సెసరీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన స్టైలింగ్ మెయింటైన్ చేస్తే ఈ కాలంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఫ్యాషన్‌గా కనిపించవచ్చు. అబ్బాయిల కోసం స్మార్ట్ లుక్ అందించే స్టైలింగ్ వివరాలు..
వర్షాకాలంలో ఫ్యాషన్ పోకడలు మాత్రమే కాకుండా వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. తేలికైన, త్వరగా ఆరిపోయే, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం మేలు చేస్తుంది. ప్యూర్ కాటన్ కంటే కాటన్-బ్లెండ్ లేదా డ్రై-ఫిట్ టీ-షర్టులు ఈ సీజన్‌కి సరిపోతాయి. ఎందుకంటే ఈ బట్టలు వర్షంలో తడిచినా, ఉతికినా త్వరగా ఆరిపోతాయి. అంతేకాకుండా చెమట తక్కువగా పట్టడంతో పాటు ఎక్కువ కాలం సౌకర్యవంతంగా ఉంటాయి. కాటన్ బ్లెండ్, డ్రై ఫిట్ టీ- షర్టుల్లో ఆలివ్ గ్రీన్, నేవీ బ్లూ, బొగ్గు బూడిద రంగు, నలుపు, ఆవాల కలర్స్ ఫ్యాషన్ లుక్‌ను అందిస్తాయి. లినెన్ మిక్స్‌డ్ లేదా తేలికపాటి ఫ్యాబ్రిక్‌తో చేసిన సగం చేతుల లేదా పూర్తి చేతుల చొక్కాలు కూడా ఈ కాలంలో కంఫర్ట్‌నిస్తాయి. జీన్స్, చినోస్‌తో స్టైలింగ్ చేస్తే మీ లుక్ స్మార్ట్‌గా ఉంటుంది.
షార్ట్స్, చినో ప్యాంటులు
వర్షాకాలంలో మందపాటి డెనిమ్ క్లాత్ ప్యాంటులు వేసుకోవడం ద్వారా తడిసినప్పుడు త్వరగా ఆరిపోదు. దీంతో ఇబ్బందిగా, చిరాకుగా ఉంటుంది. అందుకే చినోస్, టేపర్ ఫిట్ ట్రౌజర్స్, షార్ట్స్ ఎంచుకోవడం ద్వారా ఎక్కువగా తడిసే అవకాశం ఉండదు.

పాదరక్షలు ఎలాంటివి ఎంచుకోవాలి..
వర్షంలో బయటకు వెళ్లినప్పుడు కాన్వాస్, తోలు బూట్లు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. వాటికి ప్రత్యామ్నాయం వాటర్ రెసిస్టెన్స్ స్నీకర్లు బెస్ట్ ఆప్షన్. రబ్బర్ చెప్పులు, ఫ్లోటర్స్ నీటిని ఎక్కువగా పీల్చుకోవడం ద్వారా కంఫర్టబుల్‌గా ఉంటాయి. జారిపోయే చెప్పులను ధరించకూడదు. లేదంటే జారే ప్రమాదం ఉంటుంది.
జాకెట్స్
వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు తేలికపాటి జాకెట్ లేదా విండ్‌చీటర్‌ను తప్పనిసరిగా బయటకు తీసుకెళ్లాలి. వీటితో పాటు బలంగా ఉండే కాంపాక్ట్ గొడుగు తప్పనిసరి. తడి నుంచి కాపాడుకునే బ్యాక్‌ప్యాక్, గడియారం ద్వారా రిపేర్ అవ్వకుండా ఉంటుంది. క్యాప్ అలవాటు ఉన్నవారు బ్యాగ్‌లో రెడీగా పెట్టుకోవడం స్టైల్‌తో పాటు కంఫర్ట్ ఇస్తుంది.

వర్షాకాలంలో హెవీ డెనిమ్, మందంగా ఉండే ఉన్ని దుస్తులు, తడిని పీల్చుకుని ఎక్కువ సేపు ఉండే బట్టలు ధరించడం ద్వారా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సీజన్‌లో తెల్లటి బూట్లు త్వరగా మురికి అయి కాళ్లకు అంద వికారంగా కనిపిస్తుంది. నీటిని పీల్చుకుని వదులు దుస్తులను ఈ సీజన్‌లో దూరంగా ఉంచాలి. ఆలివ్ గ్రీన్, నేవీ బ్లూ, ముదురు గోధుమ రంగు, గ్రే, నలుపు దుస్తులు మంచి లుక్‌తో సౌకర్యవంతంగా ఉంటాయి.
ఈ సీజన్‌లో తేలికపాటి అలంకరణ ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. దీనివల్ల వర్షంలో తడిసినప్పుడు ముఖం చిరాగ్గా ఉండకుండా ఉంటుంది. శుభ్రమైన పొడి పాదరక్షలు ధరించడం ఉత్తమం. దుస్తులు ఎక్కువ పొరలు లేకుండా చూసుకోవాలి. బట్టలు కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications