Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు?
వానాకాలంలో వర్షాలతో పాటు జ్వరాలు కూడా విజృంభిస్తాయి. ప్రస్తుతం డెంగ్యూ, ఫ్లూ, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఎంతో మందిని పట్టిపీడిస్తున్నాయి. జ్వరం వస్తే శరీరం నీరసించిపోవడమే కాదు, ఏమీ తినాలనిపించదు, నోరు చేదుగా మారుతుంది.
అయితే త్వరగా కోలుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జ్వరంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏం చేయకూడదో.వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

తేలికగా జీర్ణమయ్యే బియ్యం గంజి
జ్వరం వల్ల తీవ్రమైన అలసటతో ఉండి, కనీసం నమలడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉంటే 'అన్నం గంజి' బెస్ట్ ఆప్షన్. ఇది కడుపుకు హాయినివ్వడమే కాకుండా, చాలా సులభంగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
ద్రవాహారం ఎంతో అవసరం
జ్వరంలో ఉన్నప్పుడు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం చాలా ముఖ్యం. జ్వరం వల్ల శరీరం సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. కాబట్టి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండే ద్రవాలు, స్వచ్ఛమైన నీరు తాగడం వల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది. కళ్లు తిరగడం తగ్గుతుంది.
పెరుగు, మజ్జిగ తినొచ్చా?
జ్వరంలో పెరుగు తినకూడదనేది అపోహ మాత్రమే. వాపులు ఉన్నవారు మినహా మిగతావారు నిరభ్యంతరంగా పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియా కడుపులో ఉన్నప్పుడు, పెరుగులోని ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) ఆ చెడు బ్యాక్టీరియాతో పోరాడి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వేడివేడి సూప్ లు
పసుపు, మిరియాలతో చేసిన వేడివేడి సూప్ లు తాగడం ఎంతో మేలు. వెజ్, చికెన్, మటన్ లేదా మష్రూమ్ సూప్ ఏదైనా సరే.. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, గొంతునొప్పి నుండి అద్భుతమైన ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు శరీరానికి కొల్లాజెన్, శక్తిని అందిస్తాయి.
ప్లేట్ లెట్స్ పెంచే కివీ, బొప్పాయి
ప్రస్తుతం డెంగ్యూ జ్వరం భయపెడుతోంది. డెంగ్యూ బారిన పడి రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోతున్నవారికి బొప్పాయి ఆకు రసం, కివీ పండ్లు సంజీవనిలా పనిచేస్తాయి. ఇవి ప్లేట్ లెట్స్ సంఖ్యను వేగంగా పెంచుతాయని ఎన్నో అధ్యయనాల్లో నిరూపితమైంది.
చేయకూడని తప్పులు ఇవే
నోటికి రుచిగా లేదని సోడాలు, కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. ఇవి కడుపులో అల్సర్లు, ఎసిడిటీని పెంచి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. అలాగే చాలా ముఖ్యమైన విషయం.. పిల్లలకు జలుబు చేసినప్పుడు కొబ్బరినూనెలో కర్పూరం కలిపి వేడిచేసి వారి ముక్కులో వేస్తుంటారు. దయచేసి ఈ తప్పు అస్సలు చేయకండి. దీనివల్ల పిల్లలకు మూర్ఛ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
