Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
వర్షాకాలం ఇన్‌ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
వర్షాకాలం వేడి తాపం నుంచి ఉపశమనం కలిగించినా.. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు మాత్రం ప్రతి ఏటా కామన్‌గా భయపెట్టేస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ ఎక్కువ కావడం, వర్షంలో తడవడం, నీళ్లలో ఎక్కువ సేపు ఉండటం కారణంగా చేతులు, పాదాలపై చర్మం పొడిబారుతుంది. కొన్ని రోజులకి చర్మం పొట్టులా ఊడిపోతుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి.. నిపుణుల సలహాలు చూద్దాం..

వర్షాకాలంలో చర్మం పొడిబారడం ఫలితంగా చేతులు, పాదాలపై పొరలు పొట్టులా ఊడిపోవడం జరుగుతుంది. అయితే ఇలా ఊడిపోవడం సాధారణంగా ఉంటే ఫర్వాలేదు. కానీ దీనితో పాటు దురద, మంట, ఎరుపెక్కడం, నొప్పి లాంటి సమస్యలు ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదని డెర్మటాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు. డైలీ రొటీన్ సక్రమంగా పాటించడం, కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు,.
సమస్యకి కారణాలు..
ఈ కాలంలో చేతులు, పాదాల చర్మం ఊడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. నీళ్లలో ఎక్కువ సేపు ఉండటం, తేమ కారణంగా త్వరగా ఆరకపోవడం, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సమస్యలు, డీహైడ్రేషన్, ఎక్కువగా పొడిబారిన చర్మం ఉన్నవారిలో ఈ చేతులు, పాదాలపై చర్మం పొడిబారుతుంది. ఇంకా విటమిన్ బి, సి, ఇ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ కాలంలో పదే పదే చేతులు కడుక్కోవడానికి సబ్బు, రసాయన ఉత్పత్తులు, హ్యాండ్‌వాష్ ఎక్కువగా ఉపయోగించడం, తడి షూస్, సాక్సులు ఎక్కువసేపు ధరిచండం ద్వారా చర్మం పొడిబారుతుంది.
నివారణ చిట్కాలు
వర్షాకాలంలో చర్మం పొడిబారకుండా, ఊడిపోకుండా ఉండాలంటే శరీరాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. వర్షంలో తడిచాక చేతులు, పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. పొడి, మెత్తటి టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. స్నానం చేశాక చర్మానికి తేలికైన మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. పొడిగా ఉన్న సాక్సులు, బూట్లను ధరించాలి. పుష్కలంగా నీరు తాగుతూ హైడ్రేడెట్‌గా ఉండాలి. శరీరానికి నీరు సరిపోకపోతే చర్మం పొడిబారుతుంది.

సమతుల్య ఆహారం
ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి, బి- కాంప్లెక్స్, జింక్, ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని మీ భోజనంలో ఉండేలా చూసుకోవాలి. చర్మం పొడిబారినప్పుడు కొబ్బరి నూనెతో తేలికగా మర్దన చేసుకోవాలి. అలోవెరా జెల్ రాసుకోవడం ఎక్కువ సేపు చర్మం తేమగా ఉంచుతుంది.
ఫేస్ ప్యాక్
ఈ కాలంలో తేనె, పెరుగుతో చేసిన ప్యాక్‌ను 15 నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసుకుంటే శరిరానికి చలువ చేస్తుంది. చేతులు, పాదాలను అప్పుడప్పుడూ కాసేపు గోరువెచ్చని నీటిలో మర్దన చేయండి. వేప నీటితో కడుక్కోవడం ద్వారా స్కిన్‌పై ఇన్‌ఫెక్షన్లను తొలగిస్తుంది. పగుళ్లను నివారిస్తుంది.
డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి
అయితే చర్మం పొడిబారడంతో పాటు పొట్టు రాలిపోవడం జరిగి వివిధ రకాల సమస్యలు తలెత్తితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. తీవ్రమైన దురద, మంట లేదా నొప్పి రావడం, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించడం, గాయం త్వరగా మానకపోవడం వంటి సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
