Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఉదయం లేవగానే లాగించేస్తున్నారా.. జాగ్రత్త! ఖాళీ కడుపుతో ఈ నాలుగు పదార్థాలు అస్సలే తినొద్దు!
చాలా మందికి ఉదయం లేవగానే టీ, కాఫీలతో పాటు పాలల్లో బూస్టు, హార్లిక్స్ వేసుకొని తాగడం అలవాటు. టీ, కాఫీలు మంచివి కావని చాలా మంది చెబుతుండగా.. మరికొందరు నిద్ర లేవగానే తేనె, నిమ్మరసం కలుపుకొని తాగుతున్నారు.
కానీ ఇది ఆరోగ్యానికి మంచి చేయడం కంటే ఎక్కువగా హాని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఈ నాలుగు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తనికూడదని సూచిస్తున్నారు. అయితే ఆ పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిమ్మరంలో తేనె కలిపి తాగడం మంచిది!
చాలా మంది బరువు తగ్గేందుకు ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగుతారు. కానీ ఇది అస్సలే మంచిది కాదట. చెక్కరతో పోలిస్తే తేనెలో అధికంగా గ్లైసెమిక్ ఇండెక్స్, క్యాలరీలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో దొరికే అధిక శాతం తేనె అంత స్వచ్ఛమైనది కాదని.. దాన్ని షుగర్ సిరప్ తో తయారు చేస్తున్నారని నిపుణులు వివరిస్తున్నారు. ఇలాంటి తేనెను పరగడుపును తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగడం వల్ల రోజూ సాధారణం కంటే అధికంగా ఆహారం తీసుకోవడానికి దారి తీస్తుందని వివరిస్తున్నారు.
2. టీ, కాఫీలు తాగితే రిఫ్రెష్‌గా ఉంటుంది!
భారత దేశంలో చాలా మంది ఉదయం లేని ఫ్రెష్ అయిన వెంటనే చేసే మొదటి పని టీ లేదా కాఫీ తాగడం. ఇది ఎంత లేటు అయినా సరే ఇవి తాగనిదే రోజు ప్రారంభం కాదు. వీటిని సేవించడం వల్ల ఏదో శక్తి వచ్చినట్లు అనిపించినా అవి మన కడుపులోని ఆమ్లాలను ప్రేరేపిస్తాయని వివరించారు. పరిగడుపునే తాగడం వల్ల కొన్ని జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
3. ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది!
ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక గిన్నెడు తాజా పండ్లను తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని మనలో చాలా మంది అనుకుంారు. కానీ ఇది సరైనది కాదని.. ఇలాంటి అలవాటు ఉంటే మానుకుంటే ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. మిగతా ఆల్పాహారాలతో పోలిస్తే పండ్లు తొందరగా జీర్ణం అవుతాయని అందువల్ల గంట తిరక్కుండానే మళ్లీ ఆకలి అవుతుందని అందువల్ల గంట తిరగక ముందే ఆకలి అవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఖాళీ కడుపుతో కొన్ని సిట్రస్ జాతి పండ్లు తినడం వల్ల ఎసిడిటీ వస్తుందని అన్నారు.
4. ఖాళీ కడుపుతో తీపి అల్పాహారం తింటే ఏం కాదు!
చాలా మంది తమ అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ వంటి తీపి పదార్థాలను తీసుకుంటారు. వీటి వల్ల అంత పెద్ద సమస్యలు లేకపోయినా.. ఇవి తీసుకోవడం వల్ల మాత్రం చిక్కుల్లో పడతారని తెలుపుతున్నారు. తీపి అల్పాహారాన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర వెంటనే పెరిగి అదే స్థాయిలో తగ్గుతుంది. కార్బోహైడ్రేట్ పదార్థాలు తినాలనే కోరిక కూడా పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే రుచికరమైన ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు వివరిస్తున్నారు. రుచికరమైన ఆహారం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయన్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
