Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.!
కండ్లకలక వచ్చిన వారి కళ్లను చూస్తే మనకూ కండ్లకలక వస్తుందా? ఇందులో నిజమెంతా?
దేశవ్యాప్తంగా కండ్లకలక కేసులు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కండ్లకలక విజృంభిస్తోంది. వర్షాకాలంలో సాధారణంగానే కండ్లకలక వస్తుంది. అయితే ఈ సంవత్సరం కండ్లకలక కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఉన్నట్టుండి కళ్లలో మంట, నీరు కారడం, కళ్లు ఎర్రబడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రాత్రి పడుకుని ఉదయం లేచే సరికి కళ్లు ఎర్రగా వాచిపోయి నీరు కారుతూ ఇబ్బంది పెడుతున్నాయి.

కండ్లకలక వచ్చిన వారి కళ్లను చూస్తే మనకూ కండ్లకలక వస్తుందని చాలా మంది అంటారు. ఎర్రబడ్డ కళ్లను, నీళ్లు కారుతున్న కళ్లను చూస్తే కూడా కండ్లకలక వస్తుందని చాలా మంది అనుకుంటారు. నిజంగానే కండ్లకలక వచ్చిన వారి కళ్లను చూస్తే మనకూ కండ్లకలక వస్తుందా.. అందులో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కండ్లకలక వ్యాప్తి గాలి ద్వారా జరగదని చెబుతున్నారు వైద్యులు. అలాగే కండ్లకలక వచ్చిన వారి కళ్లను చూస్తే కండ్లకలక వస్తుందన్నది పూర్తిగా అవాస్తవమని అంటున్నారు వైద్య నిపుణులు. అందులో ఏమాత్రం నిజం లేదని సూచిస్తున్నారు. కండ్లకలక వచ్చిన వారి కన్నీళ్ల ద్వారా మాత్రమే కండ్లకలక వ్యాపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. కళ్లలోకి చూసినంత మాత్రానా కండ్లకలక రాదని అంటున్నారు.
కండ్లకలక అనేది తేలికపాటి కళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్. ఏ చికిత్స అవసరం లేకుండానే మన రోగ నిరోధక శక్తిని ఈ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. కొన్ని రోజుల్లో దానికదే తగ్గిపోతుంది. ఎక్కువగా కన్నీళ్లు కారడం, కళ్లలో మంట, తీవ్ర అసౌకర్యం ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు.
శరీరంలో కళ్లు అత్యంత సున్నితమైన అవయవం. చిన్న పాటి ధూళి కంట్లో పడ్డా విలవిల్లాడిపోతాం. అందుకే కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. కండ్లకలక వచ్చినప్పుడు ఇష్టమొచ్చిన ఐ డ్రాప్స్, హోం రెమిడీస్ లాంటివి ప్రయత్నించకుండా.. వైద్యుల వద్దకు వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
