పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్‌ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.?

సరైన పోషణ లేకపోయినా, వేడి కారణంగా జుట్టు మెరుపు కోల్పోతుంది. అంతేకాకుండా కురులు బలహీనపడి ఊడిపోతుంటాయి. ఇలాంటప్పుడు జుట్టు ఆరోగ్యం కోసం హెయిర్‌ కండిషనర్స్‌ ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఎక్కువగా వీటిని బయట కొనుగోలు చేస్తాం. కానీ ఇంట్లోనే ఎలాంటి రసాయనాలు లేని హెయిర్‌ కండిషనర్‌ను తయారుచేసుకోవచ్చు.

natural hair conditioner making at home with these healthy ingredients

ఇంట్లో వంటగదిలోనే లభించే పదార్థాలతోనే జుట్టుకి ఆరోగ్యకరమైన హెయిర్‌ కండిషనర్‌ను తయారుచేసుకోవచ్చని బ్యూటీషిషయన్‌ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీని ద్వారా జుట్టుకి లోతైన పోషణ అందడమే కాకుండా తేమను అందిస్తుంది. కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. జుట్టు చిక్కులను తొలగించి, చివర్లు విడిపోకుండా కాపాడుతుంది. కురులు మెరిసేలా, మృదువులా కనిపించేందుకు దోహదపడుతుంది. కెమికల్స్ లేని కారణంగా తల చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. డీప్‌ హెయిర్‌ కండిషనింగ్‌ ప్యాక్‌ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

ఇంట్లో తయారుచేసుకునే ఈ రసాయన రహిత హెయిర్ కండీషనర్‌ను మీ వంటగదిలో సాధారణంగా దొరికే పదార్థాలతో తయారు చేసుకోవచ్చు, మరియు కలబంద కూడా మీ ఇంటి తోటలో సులభంగా లభిస్తుంది. అందువల్ల, ఈ ప్యాక్‌ను తయారుచేయడం చాలా చవకైనది. కాబట్టి, ఈ హెయిర్ కండీషనింగ్ ప్యాక్ తయారీ విధానాన్ని దశలవారీగా నేర్చుకుందాం.

న్యాచరల్‌ డీప్‌ కండిషనింగ్‌ హెయిర్‌ ప్యాక్‌ తయారీలో మెంతులు, వండిన అన్నం, పెరుగు లేదా క్రీమ్‌, అవిసె గింజల జెల్‌, కలబంద జెల్‌ ఉపయోగించి చాలా సులభంగా పేస్ట్‌ తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా 3 టేబుల్‌ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టాలి.

ముందుగా 3 టేబుల్‌ స్పూన్ల అవిసె గింజల జెల్‌ను కొద్దిగా నీటితో కలిపి స్టవ్‌ పైన పెట్టాలి. జెల్‌లాగా అయ్యేవరకు ఉడకబెట్టాలి. ఇప్పుడు ఇందులో గింజలను వేరు చేయడానికి జల్లెడ పట్టి వడకట్టుకోవాలి. గింజలను తీసి పడేయాలి. ఇప్పుడు నానబెట్టిన మెంతులు, వండిన అన్నం, పెరుగు లేదా క్రీమ్‌ వేసి మెత్తగా పేస్ట్‌లా అయ్యేవరకు మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్‌కి అవిసె గింజల జెల్, కలబంద జెల్ కలిపి మరోసారి మెత్తగా చేసుకోవాలి. అంతే న్యాచురల్‌ హెయిర్‌ కండిషనింగ్‌ ప్యాక్‌ రెడీ..

ఎలా అప్లై చేసుకోవాలి

శుభ్రమైన, పొడి జుట్టుపై ఈ హెయిర్‌ ప్యాక్‌ను మృదువుగా కురుల మొదళ్ల నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్‌ ప్యాక్‌ను కనీసం 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా హెయిర్‌ ప్యాక్‌ను అప్లై చేసుకోవడం ద్వారా ఫలితం ఉంటుంది.

natural hair conditioner making at home with these healthy ingredients

ఈ హెయిర్‌ ప్యాక్‌లో కలబంద వాడటం ద్వారా చుండ్రు సమస్య తగ్గి జుట్టును ఆరోగ్యకరంగా మారుస్తుంది. కురులను మృదువుగా మార్చడమే కాకుండా ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది. అవిసె గింజలు, మెంతుల్లో ప్రొటీన్‌, సహజ జెల్‌ కారణంగా జుట్టు చిక్కులు లేకుండా చేసి కొత్త మెరుపును అందిస్తుంది. పెరుగులో ఉండే ప్రొబయాటిక్స్‌ కారణంగా జుట్టు ఆరోగ్యంగా ఉండి పెరుగుదలకు దోహదపడుతుంది. వండిన అన్నంలోని ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా జుట్టుకి రక్తప్రసరణ మెరుగవుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, June 19, 2026, 15:41 [IST]
Desktop Bottom Promotion