Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
రోడ్డు పక్కన కనబడే ఈ ఆకు సాధారమైనది కాదు..షుగర్ వ్యాధి,గుండె జబ్బులకు దివ్యౌషధం!..100 ఏళ్లు ఆరోగ్యంగా..
మన ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు అందించే ఆకుకూరల్లో గంగవల్లి ఆకు ముందువరుసలో ఉంటుంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని గోలి కూర లేదా గంగ వాయిల ఆకు అని కూడా పిలుస్తుంటారు. పల్లెటూర్లలో రోడ్ల పక్కన కనబడే గంగవల్లి ఆకును చాలామంది కలుపు మొక్కగా భావించి పీకేస్తుంటారు. వాస్తవానికి కలుపు మొక్కగా భావించే గంగవల్ల ఆకు ఆరోగ్యానికి సంజీవని అని చాలిమందికి తెలియదు. చిన్నగా కనబడే గంగవల్లి ఆకులో ఐరన్,మినరల్స్,విటమిన్లు,ఫైబర్ వంటివి ఫుష్కలంగా ఉంటాయి.
మన పురాతన గ్రంధాల్లో కూడా ఈ ఆకు ప్రస్తావన ఉంది. చరక సంహితలో దీనిని కూరగాయల జాబితాలో చేర్చారు. సుశ్రుత సంహితలో ఉపయోగకరమైన కూరగాయగా కూడా గంగవల్లి ఆకు గురించి వర్ణించబడింది. శరీరానికి అత్యంత ప్రయోజనకరంగా పరిగణించే 12 ముఖ్య ఆహారాల్లో గంగవల్లి ఆకు ఒకటి. శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు అనేక వ్యాధులతో పోరాడడంలో కూడా సహాయపడుతుందని పురాతన బుషులు గుర్తించారు. దీని ఆకులు చిన్నగా, మందంగా, అండాకారంగా ఉంటాయి. కొంచెం పుల్లని రుచిని కలిగి ఉంటుంది.

అనేక పరిశోధనలు కూడా గంగవల్లి ఆకులో కాల్షియం,ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయని వెల్లడించాయి. ఇవి ఎముకలు,దంతాలను బలోపేతం చేస్తాయి. ఈ ఆకు ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీ కంటి చూపు క్షీణిస్తుంటే లేదా కంటిశుక్లం భయం ఉంటే గంగవల్లి ఆకు మీకు సంజీవని అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్ A, బీటా-కెరోటిన్ వంటివి ఉంటాయి..ఇవి కంటిశుక్లం,మాక్యులర్ డీజెనరేషన్ వంటి కంటి సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి.
చర్మం, జుట్టుకు కూడా బోలెడు మేలు
శరీరానికే కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా గంగవల్లి ఆకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి.. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని భావిస్తారు. శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం, డయాబెటిస్ కు కూడా
మనదేశంలో ప్రస్తుతం గుండె జబ్బులు, డయాబెటిస్ తో భాధపడేవాళ్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇటువంటి వాళ్లకు ఈ ఆకు ఓ వరంగా ఉంటుంది. గంగవల్లి ఆకు రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది..కాబట్టి ఇది షుగర్ పేషెంట్స్ కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది సాధారణంగా చేపల వంటి మాంసాహార వనరులలో ఎక్కువగా కనిపించే అదే ఒమేగా-3ని శాఖాహార పద్ధతిలో పొందడానికి ఈ ఆకు గొప్ప మార్గం.
బలమైన రోగనిరోధక వ్యవస్థ
మీరు తరచుగా అనారోగ్యానికి గురైతే గంగవల్లి ఆకు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి.
ఎలా తినాలి?
మీరు దానిని బాగా శుభ్రం చేసి పచ్చిగా నమలవచ్చు. దీంతో సూప్ తయారు చేసుకోవచ్చు లేదా పప్పుగా లేదా ఇతర కూరగాయలతో కలిపి ఉడికించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications