Latest Updates
-
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.?
ఒక్క చుక్క మందు తాగకపోయినా లివర్ డ్యామేజ్.. ఈ 5 తప్పులే కారణం!
కాలేయం (లివర్) పాడైపోయిందంటే..అతను బాగా మద్యం తాగుతాడేమో అని వెంటనే ఒక అంచనాకు వచ్చేయడం మనకు అలవాటు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఒక్క చుక్క ఆల్కహాల్ ముట్టుకోని వారిలో కూడా ఈ రోజుల్లో కాలేయ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం మనకు తెలియకుండానే మనం రోజూ వాడే కొన్ని సాధారణ వస్తువులు, ఇష్టంగా తినే ఆహారాలే. ఇవే మన కాలేయానికి నిశ్శబ్ద శత్రువులుగా మారుతున్నాయి. ఆల్కహాల్ కాకుండా 5 పదార్థాలు మీ కాలేయాన్ని ఎంతలా నాశనం చేయగలవో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇక్కడ చూడండి.

ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్
పిజ్జాలు, బర్గర్లు, నూనెలో వేయించిన స్నాక్స్ నోటికి ఎంతో రుచిగా ఉండొచ్చు. కానీ ఇవి కాలేయానికి మాత్రం శాపంగా మారుతాయి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు కాలేయంపై విపరీతమైన భారాన్ని మోపుతాయి. ఈ చెడు కొవ్వులను కరిగించలేక కాలేయం అలసిపోతుంది. ఫలితంగా కాలేయంలో వాపు రావడం, కొవ్వు విపరీతంగా పేరుకుపోవడం జరుగుతుంది.
చిన్న నొప్పికే మింగుతున్న పెయిన్ కిల్లర్స్
చిన్న తలనొప్పి వచ్చినా, ఒళ్లు నొప్పులు అనిపించినా వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. కానీ డాక్టర్ సలహా లేకుండా వీటిని ఇష్టానుసారంగా వాడితే కాలేయంపై తీవ్రమైన విషప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విపరీతమైన అలసట, వాంతులు, చివరికి కామెర్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
నకిలీ సప్లిమెంట్లు, నాటు మందులు
నేచురల్ లేదా ఆయుర్వేదం అనగానే అది నూటికి నూరు శాతం సురక్షితం అనుకోవడం పెద్ద పొరపాటు. కండలు పెంచడానికి యువకులు వాడే ధృవీకరించని బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు, ఎక్స్ ట్రా పవర్ కోసం వాడే స్టెరాయిడ్స్, ఎలాంటి శాస్త్రీయ గుర్తింపు లేని నాటు మందులు కాలేయానికి పూడ్చలేని నష్టం చేస్తాయి. వీటిలోని రసాయనాలు నేరుగా కాలేయ కణాలను విచ్ఛిన్నం చేస్తాయి.

సైలెంట్ కిల్లర్స్.. హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు
చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్లను, జ్వరాలను లైట్ తీసుకుంటారు. కానీ హెపటైటిస్-B, హెపటైటిస్-C లాంటి వైరస్ లు కాలేయానికి ఎంతో ప్రమాదకరం. వీటిని ప్రారంభంలోనే గుర్తించి ట్రీట్మెంట్ చేయకపోతే, సైలెంట్ గా కాలేయాన్ని తినేసి శాశ్వత నష్టాన్ని లేదా లివర్ క్యాన్సర్ ను కలుగజేస్తాయి. సరైన వ్యాక్సిన్లు వేయించుకోవడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం, ఇంజెక్షన్ల విషయంలో జాగ్రత్త వహించడం ద్వారా ఈ ముప్పును నివారించవచ్చు.
తీయని విషం..అధిక చక్కెర, ఫ్రక్టోజ్
చక్కెర కేవలం బరువునో, షుగర్ వ్యాధినో మాత్రమే పెంచుతుందనుకుంటే పొరపాటే. కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్ లు, స్వీట్లు, కేకుల్లో వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కాలేయానికి అతిపెద్ద శత్రువు. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)కి దారితీస్తుంది. మందు తాగని వారిలో కూడా ఈ చక్కెరల వల్ల కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయి, చివరికి లివర్ సిర్రోసిస్ అనే ప్రమాదకరమైన, ప్రాణాంతక స్థితికి చేరుకుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications