Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
కుంకుమపువ్వు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీలు, పాయసం, లేదా గర్భిణీలు తాగే పాలు. సువాసన, రంగునిచ్చే ఒక ఖరీదైన సుగంధ ద్రవ్యంగానే కుంకుమపువ్వును మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఆయుర్వేదం ప్రకారం కుంకుమపువ్వు కేవలం వంటకాలకే పరిమితం కాదు, అదొక అద్భుతమైన దివ్యౌషధం.
ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగడం వల్ల మన శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయి. కేవలం కొన్ని వారాల పాటు ఈ నీటిని తాగడం అలవాటు చేసుకుంటే, మీ ఆరోగ్యమే మారిపోతుంది. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కుంకుమపువ్వు నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూడండి.

బరువు తగ్గింపులో అద్భుతం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం. కుంకుమపువ్వు నీరు ఈ కడుపు సమస్యలన్నింటికీ చెక్ పెడుతుంది. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడి, జీర్ణక్రియ సులభతరం అవుతుంది. అంతేకాకుండా పోషకాలు పుష్కలంగా ఉండే ఈ నీరు మీ శరీరంలోని జీవక్రియ రేటును అమాంతం పెంచుతుంది. ఇది శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించి, మీరు ఆరోగ్యంగా బరువు తగ్గే ప్రయాణాన్ని చాలా సులభతరం చేస్తుంది.
కొలెస్ట్రాల్ కు చెక్
గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కుంకుమపువ్వు నీరు ఒక వరం లాంటిది. ఇందులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు రక్తనాళాలను శుభ్రపరిచి, రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చూస్తాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కరిగించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. బీపీ హెచ్చుతగ్గులు ఉన్నవారు ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే, బీపీ అదుపులో ఉంటుంది.
మానసిక ప్రశాంతత
తరచుగా కోపం రావడం, నిరాశగా అనిపించడం, లేదా చిన్నచిన్న విషయాలకే మూడ్ స్వింగ్స్ రావడం జరుగుతోందా? అయితే కుంకుమపువ్వు నీరు మీకు బెస్ట్ థెరపీ. ఇది మెదడులోని నరాలను ప్రశాంతపరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. డిప్రెషన్, ఆందోళన వంటి వాటిని దూరం చేసి మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎముకల బలం,చర్మ సౌందర్యం
కుంకుమపువ్వు నీరు ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా మారడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ నీరు శరీరాన్ని లోపలి నుండి డిటాక్స్ చేయడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చర్మం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది.
రోగనిరోధక శక్తికి బ్రహ్మాస్త్రం
వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారంటే మీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. కుంకుమపువ్వు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఒక రక్షణ కవచంలా మారి రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడతాయి.
ఎలా తయారు చేసుకోవాలి?
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 3 లేదా 4 కుంకుమపువ్వు రేకులను వేసి నాననివ్వండి. ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసుకుని, ఆ నీటిని పరగడుపున తాగేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
