Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
జీర్ణక్రియను మెరుగుపరిచే 10 బెస్ట్ న్యూట్రీషియన్ ఫుడ్స్
మన మొత్తం ఆరోగ్యంలో జీర్ణవ్యవస్థ అత్యంత ముఖ్యమైరన ప్రక్రియ. మనం ఆరోగ్యంగా జీవించాలంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా మనం తీసుకొనే ఆహారాలు వల్ల మన మొత్తం శరీరం యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉన్నది. ఒక బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నప్పుడు అంది మనస్సు మరియు శరీరం మీద ప్రభావం చూపుతుంది. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు సరిగా జీర్ణం అయ్యినప్పుడే అందులో ఉండే న్యూట్రీషియన్స్ మన శరీరంలోని రక్తం మరియు బాడీ సెల్స్ లోనికి ప్రవేశిస్తాయి.
మనం తీసుకొనే ఆహారాలు జీర్ణమయ్యి, శోషణ చెంది, రక్తం మరియు బాడీ సెల్స్ లోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.
ఒక వేళ మనం తీసుకొన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వనప్పుడు, అది రక్తంలోకి షోశింపబడి, మాల్ న్యూట్రీషియన్ గా మార్పుచెందుతుంది. మరీ ముఖ్యంగా అజీర్తి వల్ల చాల అసౌకర్యంగా ఉండటం మాత్రమే కాదు, పొట్ట నిండుగా ఉన్నట్లు, వికారం మరియు వాంతులకు దారి తీస్తుంది. ప్రస్తుత రోజుల్లో అజీర్తి చాలా సాధారణ సమస్యగా మారుతున్నది ఈ సమస్యను నివారించుకోవడానికి ఏదో ఒక హోం రెమెడీని వెతుకుతూనే ఉంటారు. అయితే అజీర్తిని నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి.
ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా అజీర్తి సమస్యలను నివారించుకోవచ్చు. మరి జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ....

రెడ్ బీట్స్
మీరు నేచురల్ పద్దతిలో జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లైతే, రెడ్ బీట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఎందుకంటే ఇది మలబద్దకం నివారిస్తుంది మరియు స్టొమక్ అప్ సెట్ ను నయం చేస్తుంది . వీటిలో ఫైబర్, పొటాషియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బీట్ గ్రీన్స్ :
బీట్ రూట్ లోని గ్రీన్ టాప్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు, ఇందులో ఉండే బీటాకెరోటీన్, క్యాల్షియం, ఐరన్ తిన్న ఆహారం మెరుగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

ఆపిల్స్:
భోజనం చేసిన తర్వాత ఒక ఆపిల్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆపిల్స్ లో ఉండే ఫొల్లెట్, విటమిన్ సి, మరియు విటమిన్ ఎ అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఇందులో పొటాసియం, మెగ్నీషియం వంటి మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాదు ఇందులో ఉండే పెక్టిన్ అనే అంశం ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసి జీర్ణక్రియ మెరుగ అవ్వడానికి సహాయపడుతుంది.

అరటి పండ్లు
జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి అరటిపండు కూడా ఒక అద్భుతమైన ఆహారం. ఇది డయేరియా మరియు రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు చికిత్సనందిస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటోను తొక్కతోపాటు అలాగే తినడం వల్ల జీర్ణక్రియను ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాదు, ఇది పొట్ట మరియు ప్రేగు సంబంధిత అల్సర్ ను నివారిస్తుంది. మరియు ఇది ఆకలి మరియు ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అవొకాడోస్
అవొకాడోలో ఫైబర్ మరియు ఇతర విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మొత్తం జీర్ణక్రియ యొక్క ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది. ఇంకా గాల్ బ్లాడర్ మరియు పాంక్రియాసిస్ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది.

ఓట్స్
ఓట్స్ లో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో వివిధ రకాల మినిరల్స్ మరియు విటమిన్స్ ఇ పుష్కలంగా ఉంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఓట్స్ చాలా మంచిది. అంతే కాదు పొట్ట ఆరోగ్యం మరియు మలబద్దకాన్ని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కాడ్ లివర్ ఆయిల్
కాడ్ లివర్ ఆయిల్ ను సాఫ్ట్ క్యాప్స్యూల్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ మరియుడి పుష్కలంగా ఉండి జీర్ణక్రియను హెల్తీగా మార్చుతుంది. కోడ్ లివర్ ఆియల్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు అన్ని రకాల జీర్ణసంబంధిత సమస్యలను మెరుగుపరుస్తుంది. అజీర్తిని అరికట్టుటలో ఇది ఒక నేచురల్ హోం రెమెడీ.

బ్లూబెర్రీస్:
బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు జీర్ణవాహికను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అజీర్తి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది . జీర్ణం కానీ ఆహారాలను జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది మరియు క్యాన్సర్ తో కూడా పోరాడుతుంది.

పీచేస్
పీచెస్ లో పొటాషియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి మరియు ఫైబర్ లు అధికంగా ఉన్నాయి. ఇవి హార్ట్ హెల్త్ ను గ్రేట్ గా మెరుగుపరుస్తాయి . తరచూ జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లైతే పీచెస్ ను తింటే సమస్యను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
