Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
ఈజీగా కొవ్వు కరిగించే సత్తా పుట్టుగొడుగులదే
పుట్టగొడుగులు ప్రయోజనాల పుట్ట. వీటిని తినడానికి చాలామంది ఇష్టపడతారు. మరికొందరు చీ అంటూ చిరాకు పడతారు. ఇష్టంలేకపోతే.. ఇకపై తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే.. పుట్టగొడుగుల్లో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శాకాహారమైన ఈ పుట్టగొడుగుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి.
మాంసంహారం తినని వాళ్లు పుట్టగొడుగులను తప్పనిసరిగా తమ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటి ద్వారా మాంసాహారం ద్వారా పొందే ప్రయోజనాలన్నీ ఈజీగా పొందవచ్చు. శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు పుట్టగొడుగుల ద్వారా శరీరానికి లభిస్తాయి. అంతేకాదు పుట్టగొడుగుల్లో పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే సత్తా కూడా దాగుంది. ఇంతకీ అవేంటో ఓసారి చూద్దాం..

ఎముకలు
మష్రూమ్స్ లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ బి నరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఎర్రరక్త కణాలు
పుట్టగొడుగుల్లో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇవి శరీరానికి ఆక్సిజన్ అందిస్తాయి. ఇందులో కాపర్ కూడా పుష్కలంగా లభిస్తుంది.

జీర్ణక్రియకు
పుట్టగొడుగుల్లో ఉండే పీచు పదార్థం, ఎంజైమ్స్ శరీరంలో కొలెస్ర్టాల్ స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచడానికి పుట్టగొడుకులు సహాయపడతాయి.

అనీమియా
అనీమియాతో బాధపడే వారికి రక్తంలో ఐరన్ తక్కువగా ఉంటుంది. ఫలితంగా తలనొప్పి, ఆయాసం, నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థలో సమస్యలు ఎదురవుతాయి. ఈ వ్యాధితో బాధపడే వాళ్లు ఐరన్ ఎక్కువగా ఉండే మష్రూమ్స్ తీసుకోవడం మంచిది.

బరువు తగ్గడానికి
బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు మంచి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల కొవ్వులు కరిగి ప్రొటీన్లు జీర్ణమవడానికి సహాయపడుతుంది. ఇలా ఈజీగా బరువు తగ్గవచ్చు.

క్యాలరీలు
మష్రూమ్స్ లో 80 నుంచి 90 శాతం వరకు నీటి శాతం ఉంటుంది. శరీరానికి నీటి శాతం ఎంత ఎక్కువగా అందితే అంత మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో కేవలం 9 క్యాలరీలే ఉంటాయి. అలాగే ఉడికించిన వాటిలో 21 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.

బ్రెస్ట్ క్యాన్సర్
మష్రూమ్స్ లో బీటా గ్లూకాన్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ వంటి వాటి వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అరికడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్
మష్రూమ్స్ లో ఎర్గోథియోన్ వంటి శక్తివంతమైన ఎమినో యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. అలాగే ప్రీరాడికల్స్ నుంచి రక్షణనిస్తుంది. దాంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

డయాబెటిస్
డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి ఇది ఆహారం. కొలెస్ర్టాల్, కార్బొహైడ్రేట్స్ తక్కువగా, ప్రొటీన్స్, శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. నీళ్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.ఇందులో ఉండే కొన్ని ఎంజైమ్స్ చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

చర్మానికి
పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్, రైబో ఫ్లేవిన్, నియాసిస్ లు శరీరానికి చాలా అవసరం. రైబో ఫ్లేవిన్ ఎర్రరక్తకణాలు అభివృద్ధి చేస్తే.. నియాసిస్ చర్మాన్ని సురక్షితంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

రక్తపోటు
అధిక రక్తపోటుని నియంత్రించడంలో తోడ్పడే పొటాషియం మష్రూమ్స్ లో లభిస్తుంది. అలాగే శరీరంలో కండరాలను ఉత్తేజితం చేస్తుంది.



Click it and Unblock the Notifications
