Latest Updates
-
డేటింగ్ యాప్లో పరిచయం.. వీడియో కాల్తో బ్లాక్మెయిల్! మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే జాగ్రత్త -
ఢిల్లీలో సీఏ కిడ్నాప్… వెనుక ఉన్నది ఆర్మీ జవాన్ అని తెలిసి షాక్! అసలేం జరిగింది? -
ప్రతిసారీ బిర్యానీనేనా? ఈ వీకెండ్ కొత్తగా, రుచిగా చికెన్ తహారీ రుచి చూడండి! -
గ్రహాల అనుకూలతతో ఈరోజు ఈ రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..అదృష్టం మీ వెంటే! -
ఆయుష్మాన్ సర్వార్థ సిద్ధి యోగం: ఈరోజు ఈ రాశుల వారికి తిరుగులేదు.. అదృష్టం మీ తలుపు తడుతోంది! -
రాత్రి అన్నం మిగిలిందా? పారేయకండి, ఇలా కరకరలాడే వడియాలు చేయండి! -
ఈరోజు అశ్విని నక్షత్రం ప్రభావం ఎలా ఉంది? కొత్త పనులు మొదలుపెట్టే ముందు ఈ ముహూర్తాలు చూశారా? -
వృషభ సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు.. అదృష్టం మీదే! -
వృషభం, తుల, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 15 మే 2026 -
బట్టతల నాన్న,తాత వల్ల వస్తుందా? అమ్మ వల్లా? అసలు విషయం తెలిస్తే అవునా,నిజమా అనాల్సిందే!
తక్షణం ఎనర్జీని అందించే బ్లూ కలర్ ఫుడ్
వాతావరణంలో మార్పుల బట్టి, మన శరీరాన్ని, చర్మాన్ని, కేశాలను కాపాడు కోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఆయా సీజన్స్ లో దొరికే ఆహారాలను తీసుకోవడం వల్ల రోగనిధోకశక్తిని పెంపొందించుకొని, ఆయా సీజన్లో వచ్చే జబ్బులను ఎదుర్కోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అలా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో బ్లూ ఫుడ్స్ (నీలం కలర్లో ఉండే ఆహారపదార్థాలు)కూడా చాలా గొప్పగా సహాయపడుతాయి. సీజన్ బట్టి మనకు అందుబాటులో ఉండే ఇలాంటి బ్లూ కలర్ ఫుడ్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. బ్లూ ఫుడ్స్ తిన్న వెంటనే మీకు అత్యంత ఎక్కువ ఎనర్జీని పొందినంత భావన మీలో కలుగుతుంది.
ఈ బ్లూ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గుండెకు రక్తప్రసరణ మరింత బెటర్ గా ఉంటుంది. మరియు అది మీ హార్ట్ ను మరింత హెల్తీగా మరియు యాక్టివ్ గా ఉంచుతుంది. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఫుడ్స్ లో బ్లూ బెర్రీస్, వంకాయ లేదా క్యాబేజ్ మరియు ఇంకా మల్బరీస్ వంటివి ఆరోగ్యానికి మంచిది.
ఇలాంటి బ్లూ కలర్ ఫుడ్స్ ప్రాణాంతక వ్యాధులను దూరం చేస్తాయి. ఈఫుడ్స్ లో ఉండే ఔషధగుణగణాలు శరీరం మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో టన్స్ లో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ , యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంను శుద్ది చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.
హార్ట్ మరియు మొత్తం శరీర ఆరోగ్యానికి ఏలాంటి బ్లూ కలర్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవాలో...వాటి వల్ల ఆరోగ్యానికి ఏవిధంగా మేలు చేస్తాయో చూద్దాం..

బ్లూ బెర్రీస్:
ఇది ఒక హెల్తీ ఫ్రూట్. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిన పొందాలంటే ఇలాంటి బ్లూ బెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ బ్లూ బెర్రిస్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఎదుర్కొంటుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది.

వంకాయ:
మరో ఆరోగ్యకరమైన వెజిటేబుల్ వంకాయ. ఇలాంటి బ్లూ కలర్ ఆహారాల్లో ఐరన్ మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది. వంకాయను బాగా ఫ్రై చేసి లేదా బేక్ చేసి తీసుకోవాలి. ఇది హార్ట్ కు మంచిది. మరియు ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

పర్ఫుల్ క్యాబేజ్:
కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే ఈ క్యాబేజ్ అందుబాటులో ఉంటుంది . ఇలాంటి క్యాబేజ్ సీజన్ బట్టి మార్కెట్లో మనకు అందుబాటులో లభ్యం అవుతుంది. ఇందులో ఉండే విటిమన్స్, మినిరల్స్ మరియు ఇతర పోషకాలు వల్ల శరీరంలో వ్యాధినిరోధకత శక్తి పెరుగుతుంది.

బ్లాక్ బెర్రీస్:
బ్లాక్ బెర్రీస్ ను ఉదయం తింటే ఇది ఎక్కువ ఎనర్జీ అందించడంలో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇలాంటి ఎనర్జీ ఫుడ్స్ ను వర్కౌట్స్(వ్యాయామాలు )చేసేవారు తీసుకుంటే తక్షణ ఎనర్జీని అందిస్తుంది. మరింత బెటర్ గా వర్కౌట్స్ చేయవచ్చు.

ఫిగ్:
ఆరోగ్యానికి మేలు చేసే మరో బ్లూ కలర్ ఫుడ్ ఫిగ్స్ . ఫిగ్స్ ను పాలలో వేసి త్రాగడం వల్ల మిమ్మల్ని చాలా శక్తివంతులుగా చేస్తుంది. ఆరోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.

ప్లమ్:
అన్ని రకాల పండ్లు బ్లూ కలర్ లో ఉండవు . వీటిలో చాలా వరకూ రెడ్డిష్ కలర్ లో ఉంటాయి . కొన్ని రకాలు బ్లూ కలర్లో ఉంటాయి. వీటిలో హై మినిరల్స్ మరియు మంచి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి వ్యాధుల నుండి మీ శరీరానికి రక్షణ కల్పించడంలో సహాయపడుతుంది.

డ్రై గ్రేప్
ఎండు ద్రాక్ష మరో బ్లూ ఫుడ్ గా భావిస్తారు , ఇవి హార్ట్ కు చాలా మంచిది మరియు క్యాన్సర్, డయాబెటిస్ ను నిరోధిస్తాయి. మరియు వీటిలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల బోన్ హెల్త్ ను ప్రోత్సహిస్తాయి .

ప్రూనే:
ప్రూనేలు కూడా ఎండిన ఫ్లమ్ ఫ్రూట్. వీటి వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది . ఈ బ్లూ ఫుడ్స్ లో పొటాషియం, ఎనర్జీ, బోరాన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఫిట్ గా ఉంచేలా చేస్తాయి. జీర్ణసమస్యల నుండి రక్షిస్తుంది మరియు హార్ట్ మంచిది.

బ్లాక్ జామున్(నేరేడు పండ్లు):
మధుమేహగ్రస్తులు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచడానికి ప్రతి రోజూ నల్లటి నేరేడు పండ్లను తీసుకోవచ్చు. తెల్లని నేరేడు పండ్లలో కూడ ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు.

బ్లూ లేదా బ్లాక్ గ్రేప్
ఫైబర్ అధికంగా ఉన్న సమ్మర్ ఫ్రూట్స్ లో నల్ల ద్రాక్ష ఒకటి. ఇవి కొన్ని నలుపు నీలం కలర్ కలగలిసి ఉండటం వల్ల శరీరంలో అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడే వాటిలో ద్రాక్ష కూడా ఎక్కువగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications