Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!
ఎంత కష్టపడినా బరువు తగ్గడం లేదా? జిమ్ ల చుట్టూ తిరగకుండా, కఠినమైన డైట్ లు చేయకుండా ఈజీగా సన్నబడాలని కోరుకుంటున్నారా? అయితే ముందుగా మీ శరీర జీవక్రియను వేగవంతం చేయాలి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మీ రూపాన్ని పాడుచేయడమే కాకుండా.. మధుమేహం, గుండె జబ్బుల వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.
రాత్రికి రాత్రే బరువు తగ్గడం అసాధ్యమే అయినప్పటికీ.. మన వంటింట్లో దొరికే అద్భుతమైన దినుసులతో తయారు చేసిన డ్రింక్స్ తాగడం ద్వారా ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు మన్‌ప్రీత్ కల్రా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పొట్టను కరిగించే ఒక అద్భుతమైన మ్యాజిక్ డ్రింక్ ను షేర్ చేశారు.

కొవ్వును కరిగించే అద్భుత పదార్థాలు ఇవే
మెంతులు: మెంతుల్లో ఉండే అధిక ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని కొవ్వు కణాలను కరిగించడంలో ఇది ఆయుధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

సోంపు: జీర్ణక్రియను మెరుగుపరచడంలో సోంపు రారాజు. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచి, ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో మీరు అధికంగా ఆహారం తీసుకోకుండా ఉంటారు.
శొంఠి (అల్లం): యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే శొంఠి పొట్ట కొవ్వును కరిగించడానికి దివ్యౌషధం. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
వీటితో పాటు ఈ పానీయంలో ఉపయోగించే దాల్చిన చెక్క, రాక్ సాల్ట్ శరీర రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఈ డ్రింక్ వల్ల కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుద్ధి అవుతుంది.
తయారీ విధానం
మెంతుల పొడి 2 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి - 2 టేబుల్ స్పూన్లు,శొంఠి పొడి 2 టీస్పూన్లు, దాల్చిన చెక్క 2 ముక్కలు,రాక్ సాల్ట్ అర టీస్పూన్ మిక్సీలో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి.
రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని అర టేబుల్ స్పూన్ వేసి బాగా కలపాలి. చివరగా రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, కావాలనుకుంటే కాస్త తేనె కలుపుకోవచ్చు.
ఎప్పుడు తాగాలి?
మన్‌ప్రీత్ కల్రా సూచన ప్రకారం.. ఈ డ్రింక్ ని రోజూ మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు తాగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి.
అయితే.. కేవలం ఈ డ్రింక్ తాగేసి బిర్యానీలు, స్వీట్లు తింటే బరువు తగ్గరు. ఈ డ్రింక్ కి తోడుగా రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం, సరైన పోషకాహారం, ఒత్తిడి లేని జీవనశైలిని పాటిస్తే మీ పొట్ట మాయమవడం ఖాయం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
