Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
ఆఫీసు కుర్చీలతో ఆరోగ్య సమస్యలు.. గుండెతో పాటు వీటికి ఎనలేని రిస్క్.!
ఆఫీసులో, ఇంట్లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా.. బరువు పెరగడమే కాదు, ఇంకా ఆరోగ్యానికి చేటు చేసే చాలా దుష్ప్రభావాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలేంటి.. వాటి నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. వైద్య నిపుణుల సలహాలు ఇక్కడ చూద్దాం..

ఈ రోజుల్లో డెస్క్ వర్క్ వల్ల తీవ్రంగా ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. పనిలో పడి గంటల తరబడి కూర్చోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులతో సహా అనేక రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని పలు అధ్యయనాలు సైతం హెచ్చరిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి కారణంగా శారీరక శ్రమను గణనీయంగా తగ్గి.. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. రోజుకి 8 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూర్చునే ఉండటం వల్ల శారీరక కార్యకలాపాలు లోపించి అకాల మరణానికి దారితీస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
డెస్క్ జాబ్‌లో ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం కామన్. అయితే దీని వల్ల మీకు తెలియకుండానే బరువు పెరుగుతుంటారు. రక్త ప్రసరణ, జీవక్రియ నెమ్మదిస్తుంది. ఈ క్రమంలో ఇన్సులిన్ సున్నితత్వం కూడా దెబ్బతిని డయాబెటిస్, హై బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యల బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. అయితే ఈ దుష్ప్రభావాలను తగ్గించేందుకు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు.
జీవక్రియపై ప్రభావం
కుర్చీలో ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం ఎనర్జీ వినియోగం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. దీంతో కేలరీలు తక్కువగా ఖర్చయి.. శరీరంలోని అదనపు శక్తి కొవ్వు రూపంలో పొట్ట చుట్టూ పేరుకుపోతుందని చెబుతున్నారు. అదే పనిగా కూర్చుని పనిచేయడం వల్ల కండరాల పనితీరు తగ్గి ఇన్సులిన్ ప్రభావం నెమ్దిస్తుంది. దీంతో బరువు పెరగడంతో పాటు పొట్ట చుట్టూ క్రమంగా కొవ్వు పేరుకుపోతుంది.

గుండెకి ప్రమాదం
ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం ద్వారా రక్త ప్రసరణ నెమ్మదించి, రక్తనాళాల పనితీరు దెబ్బతింటుంది. దీంతో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు రక్తంలో చక్కెర స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ప్రమాదానికి దారితీస్తుంది. దీంతో గుండె జబ్బులతో పాటు పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ధూమపానం కారణంగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
డెస్క్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల మెడ, భుజాలు, నడుము భాగాలపై అదనపు ఒత్తిడి పడి బిగుసుకుపోవడంతో పాటు డిస్క్ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. కాలి కండరాలు బలహీనపడి కాళ్లలో వాపు ఏర్పడటం, బరువుగా అనిపించడం, తిమ్మిర్లు సంభవించి దీర్ఘకాలిక నొప్పులకి దారితీస్తుంది.
అదొక్కటే సరిపోదు..
ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు వీలేనంతగా శారీరక శ్రమ అవసరం. కానీ దాని కోసమని రోజులో కేవలం కొన్ని గంటలు వ్యాయామం చేస్తే సరిపోదని నిపుణులు అంటున్నారు. పని వేళల్లో 7 నుంచి 8 గంటల పాటు కూర్చోవడం సరికాదని.. ప్రతి గంటకోసారి లేచి అటు ఇటూ నడవడం, స్ట్రెచింగ్ చేయడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఆఫీసులో లిఫ్ట్‌కి బదులుగా మెట్లు ఉపయోగించడం, వీలైనంతగా నడవడం ద్వారా కొవ్వు ప్రభావం లేకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా వీలైనంతగా తాజా, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
