Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
హోటల్స్, రెస్టారెంట్స్ లో ఎక్కువగా కల్తీ జరుగుతున్న ఆహార పదార్థం ఇదే..నకిలీ పన్నీరుని ఎలా గుర్తించాలి?
మనలో చాలామంది పన్నీరు అంటే తెగ ఇష్టపడతారు. పన్నీరుతో తయారుచేసిన వంటకాలు,ఇతర ఆహారపదార్థాలు ఎగబడి మరీ తింటారు కొందరు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రజలు ఎక్కువగా తీసుకునే ఆహారాల్లో పన్నీరు టాప్ ప్లేస్ లో ఉంటుంది. పన్నీరు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్, కాల్షియం,విటమిన్లు పన్నీరులో ఉంటాయి. గుండె,ఎముకలు, రోగనిరోధక శక్తి,బరువును నియంత్రించడంలో పన్నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే పన్నీరు తినేవాళ్లు షాక్ కు గురయ్యే ఓ రిపోర్ట్ తాజాగా బయటికొచ్చింది.
మనదేశంలో అత్యధికంగా కల్తీ అవుతున్న ఆహారాల్లో పన్నీరు ఒకటని తాజాగా ఓ రిపోర్ట్ లో తేలింది. మార్కెట్లలో, రెస్టారెంట్లలో, ఫుడ్ జాయింట్స్ లో అమ్ముతున్న పన్నీరులో చాలావరకు కల్తీ జరుగుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీలు గుర్తించాయి. దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, పన్నీరు కల్తీ కారణంగా ప్రజలు ఆరోగ్యపరంగా ప్రభావితం కాకుండా తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటూ
కేంద్ర ఆహార,వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి..ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాని కోరారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో అనేక హోటల్స్, రెసారెంట్లు, ఫుడ్ జాయింట్స్ పై ఫుడ్ సేప్టీ అధికారులు రైడ్స్,తనీఖీలు చేశారు. ఆ తర్వాత మొత్తం 702 ఫుడ్ ఐటమ్స్ శాంపిల్స్ తీసుకొని టెస్టులు చేశారు. అయితే వీటిలో ఇతర ఫుడ్ ఐటమ్స్ కన్నా పన్నీరు ఎక్కువగా కల్తీ అవుతున్నట్లు కనిపెట్టారు. మొత్తం టెస్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ లో 83శాతం వాటిలొ నాణ్యత ప్రమాణాలు లేవని గుర్తించారు. అయితే మీరు మార్కెట్ లో లేదా షాపులో కొన్న పన్నీరు ఒరిజనలా లేదా కల్తీదా అని ఇంట్లో ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.
నకిలీ పన్నీరుని ఇలా కనిపెట్టవచ్చు
-పన్నీరుని చేతులతో నలిపితే అది పిండిలాగా అయిపోతే అది కల్తీ పన్నీర్ అని అర్థం చేసుకోవాలి. నకిలీ పన్నీరులో ఉండే స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేదు.
-పన్నీరును నీళ్లలో వేసి కాసేపు మరిగించి చల్లారాక దానిలో కందిపప్పు పొడి కలిపితే అది ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ పన్నీర్ అని అర్థం చేసుకోవాలి.
-నిజమైన పన్నీరు మృదువైన లేదా మెత్తగా ఉండి పాల వాసన కలిగి ఉంటుంది. అయితే నకిలీ పన్నీరు రసాయనాలు లేదా పుల్లటి వాసన కలిగి గట్టిగా, ప్లాస్టిక్ లా గట్టిగా ఉంటుంది.
-నిజమైన పనీర్ తెల్లగా ఉంటుంది. నకిలీ పనీర్ రంగు మారవచ్చు.
-ఒక కప్పులో కొంచెం పనీర్ వేసి వేడి నీటిలో ఉంచండి. అది నకిలీ పన్నీరు అయితే వేడి నీటిలో వేసిన తర్వాత రబ్బరులా మారిపోయితుంది,ఆయిల్ రిలీజ్ అవుతుంది..దానిపై వింత పొరలా ఏర్పడుతుంది. నిజమైన పనీర్ నీటిలో చిన్న ముక్కలుగా విడిపోతుంది.
-పన్నీరుని తడిపి చల్లారిన తర్వాత అయోడిన్ టింక్చర్ రాయండి. పన్నీర్ నీలం రంగులోకి లేదా నలుపుగా మారితే అది నకిలీ పన్నీరే. నిజమైన పన్నీర్ రంగు మారదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
