Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
మీ పురుషాంగం చిన్నగా ఉందా? పెద్దగా అవ్వాలంటే ఏం చేయాలి? అంగస్తంభన సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఈ రోజుల్లో ప్రజలు తమ శారీరక రూపాన్ని మెరుగుపరచుకోవడానికి కాస్మెటిక్ సర్జరీల వైపు మొగ్గు చూపడం కామన్ అయిపోయింది. సెలబ్రిటీలు, సామాన్యులు ఇలా చాలామంది తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి వివిధ రకాల సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ కోవలోనే ఇప్పుడు మనదేశంలో పురుషులు కూడా తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి పెనిస్ ఎన్ లార్జ్ మెంట్ సర్జరీల వైపు ఆసక్తి చూపుతున్నారు. వినడానికి కొత్తగా అనిపించినా,ఇది వైద్యపరంగా సాధ్యమయ్యే ప్రక్రియ. ఇంతకీ ఈ సర్జరీ సురక్షితమేనా? దీని ద్వారా శాశ్వత ఫలితాలు సాధ్యమా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.
పురుషాంగం పరిమాణాన్ని పెంచడం ఎలా సాధ్యం?
పురుషాంగం పరిమాణం పెంచే ఆపరేషన్స్ ఇప్పుడు సర్వసాధారణం అవుతున్నాయి. ఈ ప్రక్రియలో డాక్టర్లు పురుషాంగం సస్పెన్సరీ లిగమెంట్ (స్నాయువు)ను విడుదల చేస్తారు. దీనివల్ల పురుషాంగం పొడవు సహజంగా 2- 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. అయితే ఈ ఫలితం వ్యక్తి శారీరక తత్వాన్ని బట్టి మారుతుంది. కేవలం పొడవే కాదు.. పురుషాంగం చుట్టుకొలత (మందం) పెంచడానికి శరీరంలోని ఇతర భాగాల నుండి తీసిన కొవ్వును ఇంజెక్షన్ల ద్వారా ఎక్కిస్తారు. ప్రస్తుతం 30- 35 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు ఈ సర్జరీపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా పుట్టుకతో వచ్చే మైక్రోపెనిస్ (చాలా చిన్న పురుషాంగం) సమస్య ఉన్నవారికి కూడా ఇది ఒక వరంలాంటిది.

అంగస్తంభన సమస్యలకు పరిష్కారం ఉందా?
చాలామంది అంగస్తంభన సమస్యలతో బాధపడుతుంటారు. వారికి కూడా సర్జరీ ద్వారా పరిష్కారం లభిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారికి పురుషాంగంలోకి ఒక ఇంప్లాంట్ ను అమర్చుతారు. ఈ సర్జరీ పురుషాంగం పరిమాణాన్ని పెంచదు కానీ అంగస్తంభన సమస్యను పూర్తిగా పరిష్కరించి, సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. ఈ ఇంప్లాంట్ తో పాటు, వాక్యూమ్ పంప్ వంటి ఇతర ట్రీట్మెంట్ పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ సర్జరీలు సురక్షితమేనా?
ఈ రకమైన సర్జరీల గురించి చాలామందిలో అనేక అపోహలు ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరం, ఇన్ఫెక్షన్లు వస్తాయి అని భయపడుతుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదని డాక్టర్లు చెబుతున్నారు. అర్హత కలిగిన, నిపుణులైన డాక్టర్ చేత, ఆధునిక సౌకర్యాలున్న మంచి హాస్పిటల్ లో ఈ సర్జరీ చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు, ఇన్ఫెక్షన్ ప్రమాదం దాదాపుగా ఉండదు. సర్జరీకి ముందు రోగికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు.
ముఖ్య గమనిక
ఆన్ లైన్ లో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ ధరల ఆఫర్లను చూసి మోసపోవద్దు. ఇది చాలా సున్నితమైన ఆపరేషన్. సరైన అవగాహన లేకుండా, అర్హత లేని వారి దగ్గరకు వెళితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీకు ఇలాంటి అవసరం ఉందని భావిస్తే, ముందుగా ఒక నిపుణుడైన కాస్మెటిక్ సర్జన్ లేదా యూరాలజిస్ట్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
