Latest Updates
-
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.!
ఆరోగ్యానికి హాని చేసే వ్యసనాలు ముఖ్యంగా ధూమపానం నుంచి చాలా మంది బయటపడలేకపోతున్నారు. ఎంత మానేయాలని ప్రయత్నించినా జిహ్వ చాపల్యాన్ని ఆపుకోలేక.. రోజురోజుకీ మరింతగా అడిక్ట్ అయిపోతున్నారు. అయితే పొగాకు వ్యసనం నుంచి బయటపడటానికి యోగా అద్భుతమైన చికిత్సగా పనిచేస్తుందని న్యూఢిల్లీ ఎయిమ్స్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

పొగాకు వ్యసనానికి నికోటిన్ మాత్రమే కాదు, జీవితంలో వారు ఎదుర్కొనే ఒత్తిడి, మానసిక బలహీనత కూడా కారణవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నికోటిన్ వ్యసనాన్ని అధిగమించిన మాత్రాన పొగాకుకి దూరం కాలేరని.. ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటేనే ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడగలరని ఎయిమ్ అధ్యయనం చెబుతోంది. ఇందుకోసం యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధకులు సూచిస్తున్నారు.
పొగాకు వ్యసనానికి కారణమయ్యే శారీరక, మానసిక కారణాలను యోగా సాధన ద్వారా పరిష్కరించుకోవచ్చు. 'జర్నల్ ఆఫ్ నికోటిన్ అండ్ టొబాకో రీసెర్చ్'లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. పరిశోధకులు ఇందుకు సంబంధించి ఏడు పరీక్షలు నిర్వహించారు. పొగాకు వ్యసనం ఉన్న 629 మందిపై పరిశోధన చేయగా.. క్రమం తప్పకుండా యోగా సాధన చేసేవారిలో పొగాకు మానేసే కేపబిలిటీ 50 శాతం కంటే ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఈ అలవాటు నుంచి బయటపడగలుగుతున్నారు.
ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం, ధ్యానం సాధన చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని తగ్గించడంతో పాటు వారు మానసికంగా మరింత బలంగా మారడానికి దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. శరీరం, మనసుపై సానుకూల ప్రభావం చూపే యోగాసనాలు.. బరువును సరిగా నిర్వహించడంతో పాటు, భావోద్వేగాలను అదుపులో ఉంచేలా చేస్తుంది. అంతేకాకుడా మానసికంగా ఒత్తిడిని జయించి ప్రశాంతతను అందిస్తుంది. ఈ మూడూ సరిగ్గా ఉంటే పొగాకుపై ఆసక్తి తగ్గి ధూమపానం వ్యసనం బారి నుంచి బయటపడవచ్చు.
అయితే ధూమపానం, పొగాకు ఉత్పత్తులు నమలడం మానేయాలని కంకణం కట్టుకున్న కొందరు.. ఒకేసారి మానేస్తే ఒత్తిడి పెరుగుతుందని, మానసికంగా ఇబ్బందులకు గురవుతారని భావిస్తారు. కానీ ఇది తప్పు. స్మోకింగ్ మానేయాలనుకుంటే ఆ వ్యసనానికి ఒక్కసారిగా పూర్తిగా వీడ్కోలు పలకాలని సూచిస్తున్నారు. క్రమక్రమంగా సిగరెట్లు తాగడం మానేస్తూ పోవాలని భావించడం సరైన పద్ధతి కాదు.
రోజులో 10, 20 సిగరెట్లు ఎన్ని తాగినా.. వాటిని ఒకేసారి సున్నాకి తగ్గించడం ద్వారా వ్యసనం నుంచి త్వరగా బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా సిగరెట్ తాగాలనిపించిన ప్రతిసారీ ఐదు నిమిషాల పాటు యోగా లేదంటే మెడిటేషన్ చేయడం ద్వారా మెల్లగా ఆ ఆలోచనల నుంచి బయటపడవచ్చు.

ప్రతిరోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేయడం నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. ఒక్కసారి పొగాకు మానేయడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రపరచడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా సిగరెట్ తాగాలనే కోరికను నియంత్రిస్తుంది. లోతైన శ్వాస తీసుకుంటూ వదలడం ఇలా ఐదు నిమిషాల పాటు చేయడం ద్వారా శరీరం, మనస్సు ఉత్తేజంగా ఉంటుంది.
యోగాసనాల ద్వారా ఛాతీ, ఊపిరిత్తులు విస్తరించి ఆ భాగాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా అందుతుంది. అలసట తగ్గి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఊపిరిత్తుల సామర్థ్యం పెరిగి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మెదడుకి రక్త ప్రసరణ మెరుగై పొగాకు తీసుకోవాలనే ఆలోచనల నుంచి మిమ్మల్ని నియంత్రిస్తుంది. యోగాతో పాటు సమతుల్య ఆహారం తీసుకుంటూ పుష్కలంగా నీరు తాగడం ద్వారా నికోటిన్ కోరికలు తగ్గిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications