Latest Updates
-
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే..
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.!
ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నుంచి నీరు రావడం సహజం. కానీ వాటిని తినకుండా ఉండలేం. ఉల్లిపాయలు కోసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఈ సారి నుంచి ఇలా కళ్లలో నీరు రాకుండా ఇతర కూరగాయల మాదిరిగా సులభంగా కోయాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.

మన కిచెన్‌లో ఉల్లిపాయ లేకుండా ఈ కూర ఉండదు. వంటకాలలో ఉల్లిపాయ రుచి, ప్రాముఖ్యత వేరే. బిర్యానీ, సలాడ్‌లోనూ ఉల్లిపాయ ముందుంటుంది. పోషకాలు పుష్కలంగా ఉల్లిపాయను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, ఫొలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ క్రమంలో సమతుల్య ఆహారంలో భాగంగా ఉన్న ఉల్లిపాయను కోసేముందు కళ్లలో నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.
ఉల్లిపాయను కోస్తుంటే కళ్ల నీళ్లు ఎందుకు వస్తాయి..
ఆనియన్ కోసేటప్పుడు వాటి పొరల్లోని కణాలు విచ్ఛిన్నమవుతాయి. తద్వారా పొరల నుంచి ప్రత్యేకమైన వాయువు విడుదల అవుతుంది. ఇది నేరుగా కంటి ఉపరితలంపై తేమతో కలిసి కొద్దిగా చిరాకును కలిగిస్తుంది. ఈ క్రమంలో కళ్లు తమను తాము రక్షించుకునే క్రమంలో కన్నీళ్లను ఉత్పత్తి చేసి బయటకు విడుదల చేస్తాయి. ఇది శరీరంలో జరిగే సాధారణ రియాక్షన్ మాత్రమే. దీని వల్ల కళ్లకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ సమస్యను సులభంగా నివారించుకోవచ్చు.

ఈ టిప్స్ పాటించండి..
ఉల్లిపాయను కోసే ముందు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే వాటి నుంచి గ్యాస్ విడుదల కాకుండా చూడాలి. అందుకోసం వంట చేసే 20 నిమిషాల ముందు వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. దీని ద్వారా వాయువు విడుదల కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయ కోసేటప్పుడు పదునైన కత్తిని వాడటం బెటర్. మొద్దుబారిన కత్తిని ఉపయోగించినట్లయితే ఉల్లిపాయ కణాలు దెబ్బతిని గ్యాస్ ఇంకా ఎక్కువ విడుదల అవుతుంది. దీని ద్వారా కన్నీళ్లు ఎక్కువ అవుతాయి.
ఉల్లిపాయలను కోసేముందు గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా కణాల నుంచి విడుదలయ్యే గ్యాస్ గాలి ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కిచెన్‌లో ఎగ్జాస్ట్, చిమ్నీ ఉన్నట్లయితే వాటిని ఆన్‌లో ఉంచడం ద్వారా ఉల్లిపాయ నుంచి వచ్చే గ్యాస్ ప్రభావం తగ్గుతుంది. ఇక ఉల్లిపాయ వేరు భాగాన్ని చివరిలో కోయాలి. ఎందుకంటే ఈ భాగంలోనే అత్యధిక వాయువును విడుదల చేసే మూలకాలు ఉండటం ద్వారా కన్నీళ్లు అధికమవుతాయి. ఉల్లిపాయను కోసేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవడం ద్వారా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి చిన్న జాగ్రత్తల ద్వారా కళ్లనీళ్లు రాకుండా కాపాడుకోవచ్చు.
ఈ పొరపాట్లు చేయవద్దు
ఉల్లిపాయ కోసేటప్పుడు మొద్దుబారిన కత్తి లేదా, సరిగ్గా పదును పెట్టని కత్తిని ఉపయోగించడం ద్వారా ఎక్కువ వాయువు విడుదలవుతుంది. మూసి ఉన్న గదిలో ఉల్లిపాయలు కోయకండి, గాలి ప్రసరణ లేని చోట వీటిని కోయకండి. ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్లలో నీళ్లు వస్తునన్నప్పుడు పదే పదే కళ్లు రుద్దుకోవద్దు. దీని ద్వారా కళ్లకి చిరాకు పెరిగి మరింత బాధిస్తుంది.
ఉల్లిపాయలు కోయడం పూర్తయిన తర్వాత చేతులకు రసం అంటుకున్నట్లయితే వెంటనే చేతులను కడుక్కోవాలి. ఆ చేతులతో కళ్లను తాకడం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కూరలో అవసరమైన మేరకు మాత్రమే ఉల్లిపాయలు కోసుకోవాలి. మిగిలిన ఉల్లిపాయను మరుసటి రోజుకి వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
