Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Jaundice In Toddler: శిశువుల్లో కామెర్లు ఎందుకొస్తాయి? తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
శిశువుల్లో కామెర్లు చాలా సాధారణం. దాదాపుగా ప్రతి బిడ్డా పుట్టిన తర్వాత కామెర్ల సమస్య ఎదుర్కొంటుంది. కాబట్టి కామెర్లు వచ్చాయని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అసలు పసికందులకు కామెర్లు ఎందుకొస్తాయంటే..
తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువుకు ఎక్కువ రక్త కణాలు అవసరం అవుతాయి. పుట్టిన తర్వాత పసికందుకు వాటి అవసరం ఉండదు. ఆ కణాలు శిథిలం కావడం వల్ల వచ్చే ద్రవ పదార్థం ఇది. కామెర్లు వచ్చిన ప్రతి శిశువుకు చికిత్స అవసరం లేదు. అయితే కామెర్లు ఎక్కువగా ఉంటే మాత్రం.. ఫొటోథెరపీ చేయాల్సి ఉంటుంది.

పసిపిల్లల్లో కామెర్లు రావడానికి కారణాలు:
- ఎర్ర రక్తకణాల విచ్ఛిన్నం, ఇన్ఫెక్షన్, రక్తహీనత లేదా సికిల్ సెల్ వ్యాధితో కామెర్లు రావొచ్చు.
- హెపటైటిస్ లేదా సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యలు
- పిత్తాశయం సమస్యలు, పిత్తాశయ రాళ్లు లేదా కోలిసైస్టిటిస్
- కాలేయం నుంచి ప్రేగులకు బిలిరుబిన్ ను తీసుకెళ్లే గొట్టమైన పిత్త వాహికలో బ్లాకేజెస్ ఏర్పడినప్పుడు
పసిపిల్లల్లో కామెర్లు లక్షణాలు:
- జ్వరం
- వాంతులు
- అతిసారం
- ఆకలి లేకపోవడం
- డార్క్ యూరిన్
- లేత రంగులో మలం
పసిబిడ్డల్లో కామెర్లకు చికిత్స:
పసిపిల్లల్లో కామెర్లకు అసలు కారణం ఏంటో తెలుసుకున్నాక దానికి తగ్గ చికిత్స అందిస్తారు. చాలా సందర్భాల్లో పసికందుల్లో కనిపించే కామెర్లు ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే వాటికవే తగ్గిపోతాయి. కామెర్లు తీవ్రంగా ఉన్నా.. తీవ్రమైన వైద్య పరిస్థితి వల్ల సంభవించినా చికిత్స అవసరం అవుతుంది.
పసిపిల్లలకు కామెర్లు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- పసిపిల్లలలకు తరచుగా ఆహారం ఇవ్వాలి. తరచుగా ఆహారం తీసుకోవడం వల్ల మలం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరం నుంచి బిలిరుబిన్ ను తొలగించడానికి సహాయపడుతుంది.
- పుష్కలంగా ద్రవాలు తాగించాలి. అవి శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంచుతాయి.
వయస్సుతో పాటు బరువు పెరిగే బిడ్డల విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదు. ఇక తల్లి ఆహారానికి ఎలాంటి పరిమితులూ లేవు. సమతుల పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. రోజుకు రెండు మూడు లీటర్ల ద్రవ పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లిపాలు తాగే బిడ్డలను జాండిస్ ఏమీ చేయలేవు. అందులో పోషకాలు కామెర్లు సమర్థవంతంగా నివారిస్తాయి. అలాగే నెలలు నిండకుండానే పుట్టినవారు, బరువు తక్కువగా ఉన్నవారు, మధుమేహం ఉన్న తల్లులకు జన్మించిన బిడ్డలను కామెర్లు వచ్చే ఆస్కారం ఎక్కువ. పసికందుల మూత్ర, మల విసర్జన సరిగ్గా జరగకపోయినా.. మలం నలుపు రంగు నుంచి క్రమంగా పసుపు రంగులోకి మారకపోయినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
