Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
వర్షాకాలంలో గర్భిణీలకు ఇన్‌ఫెక్షన్ ప్రమాదాలు.. వీటి పట్ల అలర్ట్ తప్పనిసరి.!
వర్షాకాలంలో పిల్లల తర్వాత గర్భిణీలకు ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రుతుపవనాలు వేడి తాపం నుంచి ఉపశమనం కలిగించినా.. గాలిలో తేమ, నీటి నిల్వ, వాతావరణ మార్పుల కారణంగా గర్భిణీల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళల్లో శారీరకంగా, హార్మోన్ల పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే సీజన్ ఏదైనా వారి ఆరోగ్యం పట్ల కుటుంబీకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా గర్భిణీలు అధిక జాగ్రత్తతో పాటు పరిశుభ్రత వహించాలి. ఆహారం, తాగునీరు, పారిశుద్ధ్య, పరిసరాలు.. వారి ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
గర్భం దాల్చగానే తల్లి ఆరోగ్యం పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపిస్తుంది. వారు తినే ఆహారం, పాటించే శుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది. చిన్నపాటి అజాగ్రత్త కూడా చేయకూడదు. అయితే ప్రతి మహిళ గర్భం, ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో అదనపు జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా వారికి ఈ కాలంలో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ఏ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం ఉంది. దాని నుంచి వారిని ఎలా కాపాడుకోవాలి. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఇక్కడ చూద్దాం.
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కాలంలో దాహం ఎక్కువగా ఉండని కారణంగా నీరు ఎక్కువగా తాగరు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఫలితంగా మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపు ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. ఇక ఈ కాలంలో నీటి నిల్వ కారణంగా దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకా అధిక తేమ కారణంగా గర్భిణీలు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడవచ్చు. జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్ వంటి ఇన్‌ఫెక్షన్లు సోకవచ్చు.

ఈ కాలంలో ఇలాంటి పలు రకాల ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. అయితే అందరు గర్భిణీలకు ఇది వర్తించదు. పరిశుభ్రత పాటించడం, సురక్షితమైన ఆహారం, శుభ్రమైన నీరు తీసుకోవడం, సకాలంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా గర్భిణీలు వర్షాకాలంలో అధిక జ్వరంతో బాధపడటం, తరచుగా మూత్రవిసర్జనలో మంట రావడం, కడుపు, నడుము భాగంలో తీవ్రమైన నొప్పి ఏర్పడటం, వాంతులు, విరేచనాలు, యోని నుంచి అసాధారణ స్రావాలు, తీవ్రమైన దురద, నీరసంగా ఉండటం, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. తల్లీబిడ్డ ఇద్దరి భద్రతకు సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స చాలా అవసరమని గుర్తించాలి.
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటానికి గర్భిణీలు ఎల్లప్పుడూ తాజాగా, మంచిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగాలి. స్ట్రీట్ ఫుడ్, కడగని, కోసిన పండ్లను తినడం మానుకోవాలి. ఈ కాలంలో చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచుకోవడం ద్వారా దోమల బారి నుంచి కాపాడుకోవచ్చు. వైద్యులు సూచించిన దోమల నివారణ చర్యలను పాటించాలి. అయినా ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే సొంత చికిత్స కాకుండా వైద్యుడిని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
