Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
వర్షాకాలంలో పాదాల పగుళ్లతో అవస్థలు.. ఇలా చేస్తే మృదువుగా మారిపోవాల్సిందే.!
వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో కాస్త ఎక్కువసేపు నీళ్లలో పనిచేస్తే చాలు కాళ్ల పగుళ్లు మొదలవుతాయి. పాదాలకి, వేళ్ల మధ్య చర్మం నానిపోయి సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఫలితంగా మంటను పుట్టిస్తాయి. దీంతో కాలు కిందపెట్టాలన్నా ఒక్కోసారి వీలు కాని పరిస్థితి. ఈ క్రమంలో ఈ సీజన్‌లో పాదాల సంరక్షణకి జాగ్రత్తలు తీసుకోవాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు.

వర్షంలో తడిస్తే ఇలా చేయండి
చర్మం ఎంత మృదువుగా ఉంటుందో, పాదాలు కూడా అంతే సాఫ్ట్‌గా ఉండటం అవసరం. వర్షాకాలంలో పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. వర్షాలకు రోడ్లపై, ఇంటి బయట బురద నీరు, తేమ కారణంగా కాళ్లకి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఫలితంగా గోళ్లు నలుపుగా మారతాయి. పాదాల వద్ద దురద, చిరాకు ఎక్కువవుతుంది. అందుకే వర్షంలో తడిసినట్లయితే ఇంటికి వచ్చిన వెంటనే పాదాలను గోరు వెచ్చని నీటితో కడగాలి. యాంటీసెప్టిక్ సబ్బు లేదంటే లిక్విడ్ వాష్‌తో పాదాలను శుభ్రం చేసుకోవాలి.
తడి ఉంచొద్దు
వర్షాకాలంలో స్నానం చేసినా లేదంటే కాళ్లు, చేతులు కడుక్కున్నా ఆరడానికి సమయం పడుతుంది. అందుకే కాలి వేళ్ల మధ్య భాగంలో తడి అనేది లేకుండా టవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. తేమ ద్వారా ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు యాంటీ ఫంగల్ లేదా టాల్కమ్ పౌడర్‌ను చల్లుకుంటే సువాసనతో పాటు తాజాగా ఉంటుంది.
గోళ్లను కత్తిరించుకోవాలి
మాన్‌సూన్‌లో బురద కారణంగా కాలి గోళ్లలో మురికి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పెరిగిన కాలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
పాదాల పగుళ్లకి ఇంటి చిట్కాలు
నీళ్లలో ఎక్కువ సేపు నానడం ద్వారా పాదాలు పగిలినట్లయితే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంటి దగ్గరే సంరక్షణ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా అర బకెట్ గోరువెచ్చని నీటిలో సగం కప్పు వెనిగర్ వేసి కలపాలి. పాదాలను అందులో పావు గంటపాటు ఉంచినట్లయితే బ్యాక్టీరియా నశించిపోతుంది.

ఈ కాలంలో పాదాలు పైభాగం, అడుగు భాగంలో మృతకణాలు ఎక్కువగా చేరతాయి. ఇందుకోసం వారానికి రెండు సార్లు ఫుట్ స్క్రబ్‌తో సున్నతంగా మసాజ్ చేసుకున్నట్లయితే డెత్ సెల్స్ నశించిపోతాయి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు గాఢత తక్కువగా ఉన్న ఫుట్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్‌తో మసాజ్ చేసుకోవడం ద్వారా అలసట తగ్గి నిద్ర బాగా పడుతుంది. దీంతో కాళ్ల నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో పాదాల సంరక్షణకి ఎలాంటి చెప్పులు ధరిస్తున్నామనేది ముఖ్యం. రబ్బర్, ప్లాస్టిక్ వంటి వాటర్‌ప్రూఫ్స్ వంటి చెప్పులను వాడటం ఉత్తమం. ఈ కాలంలో సాక్స్‌కి దూరంగా ఉండాలి. ఒకవేళ తప్పనిసరి అయితే తడిసిన సాక్స్‌ని వేసుకోకూడదు. శుభ్రమైన పొడి సాక్సులను ధరించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
