Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్కార్న్తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.!
వయసుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు ఒక టీస్పూన్ సైలియం హస్క్ అదే ఇసబ్‌గోల్‌తో పరిష్కారముందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మలబద్ధకం సమస్య ఎలా తీరుతుంది.. ఈ సైలియం హస్క్‌ను ఎలా తీసుకోవాలి.. ఇక్కడ చూద్దాం..

ఆహారపు అలవాట్లలో మార్పులు, శరీరానికి తగిన మోతాదులో నీరు తీసుకోకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం ఇలా జీవనశైలిలో లోపాల కారణంగా మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం చాలా మంది మందులను ఆశ్రయిస్తున్నారు. అయితే మందులతో కాకుండా ఇంట్లోనే కొన్ని సహజ పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే జీర్ణవ్యవస్థ మెరుగై మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో సైలియం హస్క్ ఉత్తమంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
సరైన మోతాదు
మలబద్ధకం సమస్య ఉన్నవారు సైలియం హస్క్(ఇసబ్‌గోల్)ను రెగ్యులర్‌గా సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తద్వాన్ని మలాన్ని మృదువుగా చేసి పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి దీనిని ఎలా తీసుకోవాలో వారి సలహాల ద్వారా తెలుసుకుందాం..
మెరుగైన జీర్ణవ్యవస్థకి, జీర్ణక్రియ సులభంగా సాగేందుకు పీచుపదార్థం దోహదపడుతుంది. సైలియం హస్క్‌లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. దీనిని తీసుకున్నప్పుడు నీటిని పీల్చుకున్నప్పుడు జెల్ లాంటి పదార్థంగా మారి మలాన్ని మృదువుగా మారుస్తుంది. దీంతో సులభంగా మల విసర్జన జరుగుతుంది. అందుకే కాన్‌స్టిపిటేషన్ సమస్య ఉన్నవారు సైలియంను పరిమిత పరిమాణంలో పుష్కలంగా నీటితో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలా తీసుకోవాలి
ఉదయాన్నే పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు టీస్పూన్ సైలియం హస్క్‌ను గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. రాత్రి సమయంలో గోరువెచ్చని పాలతో తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. తర్వాత ఒక గ్లాసు నార్మల్ వాటర్ తీసుకోవాలి. ఫలితంగా సైలియం హస్క్‌లోని ఫైబర్ కడుపులో సమర్థవంతంగా పనిచేసి పొట్టను శుభ్రపరుస్తుంది. మొదటిసారి ప్రయత్నిస్తున్నవారు వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
సైలియం హస్క్ ఒక్కటే పరిష్కారం కాదు
అయితే మలబద్ధకం సమస్యతో ఎక్కువ రోజుల పాటు బాధపడేవారు కేవలం సైలియం హస్క్ మీదనే ఆధారపడటం సరికాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రోజు 3 లీటర్ల నీరు తాగడం, భోజనంలో తాజా పండ్లు తీసుకోవాలి. ఆకుకూరలను సమృద్ధిగా తీసుకోవాలి. తృణధాన్యాలు, పప్పులను చేర్చుకోవడం ద్వారా వాటిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థకి దోహదపడుతుంది. వీటితో పాటు ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడక, వ్యాయామం చేయడం ద్వారా పేగు ఆరోగ్యం బాగుపడుతుంది. దీంతో జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గి మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.
సలహా తప్పనిసరి
కాగా, దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్య, రక్తపు విరేచనాలతో బాధపడటం, కడుపు నొప్పి తీవ్రంగా ఉండటం, ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి సమస్యలు వేధిస్తున్నట్లయితే తప్పనిసరిగా వైద్య నిపుణుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి చికిత్సలు, సోషల్ మీడియా సలహాలపై ఆధారపడొద్దు. రోజూ మందులు వాడేవారు, పేగు సంబంధిత సమస్యలు, అన్నం మింగడంలో ఇబ్బంది పడేవారు సైలియం హస్క్‌ను తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మలబద్ధకం సమస్య ఉన్నవారికి సైలియం హస్క్ ఒక్కటే పరిష్కారం కాదని.. సమతుల్య ఆహారం, పుష్కలంగా నీరు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. దీర్ఘకాలికంగా సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి సైలియం హస్క్‌ను తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications