Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
పాడైపోయిన శరీర అవయవాలకు మళ్ళీ కొత్త జీవం పోస్తుంది..పిచ్చిమొక్క అని పీకేస్తే పెద్ద లాసే!
మన ఇంటి చుట్టుపక్కల లేదా పొలాల గట్ల మీద, రోడ్ల పక్కన వర్షాకాలంలో విరివిగా పెరిగే మొక్కల్లో తెల్ల గలిజేరు ఒకటి. చాలామంది దీనిని చూసి ఏదో పిచ్చి మొక్క అనుకుని పీకి పారేస్తుంటారు లేదా అసలు పట్టించుకోరు. కానీ దీని అసలు విలువ తెలిస్తే మాత్రం బంగారంలా దాచుకుంటారు.
తెల్ల గలిజేరుని ఆయుర్వేదంలో పునర్నవ అని పిలుస్తారు. అంటే పాడైపోయిన శరీర అవయవాలకు మళ్ళీ కొత్త జీవం పోసేది అని అర్థం. ఇది సాక్షాత్తూ ప్రకృతి ప్రసాదించిన సంజీవనిగా మన పెద్దలు చెబుతుంటారు. గలిజేరు ఉండగా గంజి ఎందుకు అని మన పెద్దలు ఓ సామెతను కూడా అంటుండేవాళ్లు. గొప్ప ఔషధ గుణాలున్న గలిజేరు ఆకు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో ఇక్కడ చూడండి.

కిడ్నీలకు రక్షక కవచం
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్ల వల్ల చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వారికి గలిజేరు ఒక దివ్యౌషధం. ఇది అద్భుతమైన డైయూరిటిక్ (మూత్రవిసర్జనకారి)గా పనిచేస్తుంది.
కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో, కిడ్నీ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో రక్తంలోని క్రియాటినిన్ లెవల్స్ ను నియంత్రించడంలో గలిజేరు అమోఘంగా పనిచేస్తుంది. డయాలసిస్ స్టేజ్ కు వెళ్తున్న వాళ్లకి కూడా గొప్ప ఉపశమనాన్ని అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
లివర్ సమస్యలకు చెక్
మద్యపానం వల్ల గానీ, ఇతర కారణాల వల్ల గానీ పాడైన లివర్ (కాలేయం) కణాలను తిరిగి ఉత్తేజితం చేసే శక్తి గలిజేరుకు ఉంది. కామెర్లు వచ్చినప్పుడు గలిజేరు కషాయం లేదా కూర తింటే లివర్ పనితీరు మెరుగుపడి త్వరగా కోలుకుంటారు. శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వాపులు,నొప్పులకు రిలీఫ్
కొంతమందికి శరీరంలో నీరు చేరి కాళ్ళు, చేతులు ఉబ్బినట్లు ఉంటాయి. గలిజేరు ఆకు కూరను తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
తద్వారా వాపులు, నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.
కంటి చూపు, రక్తం
గలిజేరులో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే రేచీకటి, కంటి చూపు మందగించడం వంటి సమస్యలకు గలిజేరు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఎలా వాడాలి?
-గలిజేరు ఆకు రుచిలో దాదాపు పాలకూర, తోటకూర మాదిరిగానే ఉంటుంది. దీనిని పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి వేపుడు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా తెల్ల గలిజేరు వంటలకు చాలా శ్రేష్ఠం.
-ఆకుకూరగా తినలేని వారు.. గలిజేరు ఆకులు లేదా వేర్లను శుభ్రం చేసి, నీటిలో మరిగించి కషాయంలా కాచుకుని తాగవచ్చు. ఉదయం పరగడుపున ఈ కషాయం తాగడం వల్ల కిడ్నీలు శుభ్రపడతాయి.
-అయితే గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
