డైట్‌ బాగానే ఉన్నా బాడీలో కొవ్వు పెరుగుతుందా.. మీరు చేసే తప్పులు ఇవే.!

ఆరోగ్యంగా ఉండటం కోసం చాలా మంది డైట్‌ పాటిస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గడం కోసం టిఫిన్‌, మీల్స్‌ డిన్నర్‌ ఇలా మూడు పూటలా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే బరువు తగ్గుతాం అనుకుంటారు. కానీ అది సరైంది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఏం తీసుకుంటున్నా.. ఏ సమయంలో తింటున్నాం అనేది చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.

reasons why body fat increases despite following a diet tips for good health

కంప్యూటర్‌ యుగంలో గంటల తరబడి కూర్చొని పనిచేయడం, లేట్‌ నైట్‌ జాబ్‌లు, సరైన నిద్ర లేకపోవడం, రాత్రంతా మేల్కొని ఉండటం ఇలా చాలా కారణాల వల్ల శరీర ఆకృతి, ఆరోగ్యంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా బరువు పెరగడం, బాడీలో పలు చోట్ల కొలెస్ట్రాల్‌ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే ఫ్యాట్‌ తగ్గించుకునేందుకు చాలా మంది డైట్‌ పాటిస్తుంటారు. కొందరు ఒకటే పూట తింటూ మరో పూట పస్తులుండటం, మరికొందరు మూడు పూటలా చాలా తక్కువ మొత్తంలో భోజనం చేయడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ సరైన ఆహారం తీసుకోరు. ఫలితంగా బరువు తగ్గుతాం అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు అని.. ఇలా చేయడం ద్వారా బాడీలో ఫ్యాట్‌ పెరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్యాట్‌ పెరగడానికి కారణాలివే

ప్రతిరోజూ ఖచ్చితంగా టిఫిన్‌ ఉండాల్సిందే. డైట్‌ పాటించేవారు బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గా తీసుకుంటూ ఉంటారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పదార్థాలు ఉంటే ఫ్యాట్‌ పెరగడం ఖాయమని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. టిఫిన్‌లో ఇడ్లీతో పాటు కొబ్బరి లేదా పల్లీ చట్నీ తీసుకోవడం వల్ల బాడీలో కొవ్వు పెరుగుతుంది. పండ్లు, తేనెను కలిపి స్మూతీలా చేసుకుని తినడం, దోసెలపై నూనె ఎక్కువగా వేసుకుని తినడం ద్వారా ఒంట్లో కొవ్వు అమాంతం పెరిగిపోతుంది.

బరువు తగ్గాలనుకునేవారు రాత్రి పూట అన్నం తినడం మానేయాలని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు. లేట్‌ నైట్‌ జాబ్‌లు చేసేవారికి ఎక్కువగా రాత్రి సమయంలో స్నాక్స్‌ తినే అలవాటు ఉంటుంది. వీటిలో కార్బొహైడ్రేట్లు, కేలరీలు అధికంగా ఉన్న కారణంగా కొవ్వు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. బరువు తగ్గాలని వీటిని తక్కువ మొత్తంలో తీసుకున్నా ఫలితం ఉండదని సూచిస్తున్నారు.

కొవ్వు కరగాలంటే ఏం తినాలి

న్యూట్రిషనిస్టుల సలహా ప్రకారం బాడీలో ఫ్యాట్‌ బర్న్‌ అవ్వాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. మీ డైట్‌లో ముఖ్యంగా పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌లో ఎప్పుడైనా సరే మీ భోజనంలో మిల్లెట్స్‌, ఓట్స్‌, బ్రౌన్‌ రైస్‌ను తక్కువ మోతాదులో ప్రతి రోజూ తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఫైబర్‌ ఉన్న కూరగాయలు ఉత్తమం. ఫైబర్‌ ఎక్కువగా ఉంటే జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

డైట్‌లో ఇవి తప్పనిసరి

రోజూ తక్కువ మొత్తంలో డ్రై ఫ్రూట్స్, నట్స్‌ తీసుకోవాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్‌, విటమిన్లు కొవ్వు రాకుండా కాపాడతాయి. ఒమెగా- 3 కోసం చేపలు తరచుగా తీసుకోవాలి. ఫ్యాట్‌ కంటెంట్‌ తక్కువగా ఉండేలా పెరుగు, మజ్జిగ భోజనంలో ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం చేస్తున్నారా

వీటితో పాటు 8 గంటల సరైన నిద్ర తప్పనిసరి. ప్రతిరోజూ నడక, వ్యాయామం, ఎక్సర్‌సైజులు, యోగా మీ దినచర్యలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడం ద్వారా బాడీలో కేలరీలు అధికంగా ఖర్చయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఫ్యాట్‌ కరిగిపోవడమే కాకుండా మళ్లీ పెరగకుండా కాపాడుతుంది. ఇలా డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, June 10, 2026, 9:14 [IST]
Desktop Bottom Promotion