Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కిలో రూ.20 వేలు దాటిన బాదంపప్పు ధర..అంత స్పెషాలిటీ ఏంటో తెలుసా!
బాదంపప్పు తింటే ఆరోగ్యానికి బోలెడు మేలు జరుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే. డ్రై ఫ్రూట్స్ లో దీనిని రారాజుగా చెబుతారు. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాల గని అయిన బాదంను రోజూ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా శరీరం, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే బాదంపప్పు రేటు కూడా క్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటికే సామాన్యుడు బాదంపప్పు కొనుగోలు చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే బాదంపప్పు రేటు ఇప్పుడు కిలో రూ.20 వేలు ఉంటే? ఊహిస్తేనే వామ్మో అనుకుంటున్నారా? నిజంగానే బాదంపప్పు కిలో రేటు రూ.20వేలకు చేరింది. మార్కెట్ లో మనం చూసే బాదంలన్నీ ఒకే రకం కావని మీకు తెలుసా? వాటిలో ఎన్నో రకాలున్నాయి. వీనా మమ్రా గిరి బాదంపప్పు 1 కేజీ ధర ఆన్ లైన్ లో రూ.20,150 గా ఉంది. అత్యంత ఖరీదైన, పోషకాలలో మేటి అయిన మమ్రా బాదం ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ చూడండి.

ఏమిటీ మమ్రా బాదం ప్రత్యేకత
మమ్రా బాదంపప్పుని రాయల్ బాదం అని కూడా పిలుస్తారు. ఇవి ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలైన ఇరాన్, అప్ఘాఘనిస్తాన్, కశ్మీర్ ప్రాంతాలలో సేంద్రీయ పద్ధతుల్లో పండుతాయి. ఇవి చూడటానికి చిన్నగా, పడవ ఆకారంలో, కొద్దిగా ముడతలు పడి ఉంటాయి. వీటి సాగు చాలా పరిమితంగా ఉండటం, ఎక్కువగా చేతితోనే ప్రాసెస్ చేయడం వల్ల ఇవి అత్యంత సహజంగా, నాణ్యంగా ఉంటాయి.
మమ్రా వర్సెస్ కాలిఫోర్నియా బాదం..తేడాలు ఇవే
మార్కెట్ లో మనకు ఎక్కువగా కనిపించేవి కాలిఫోర్నియా బాదం. ఈ రెండింటి మధ్య రుచి, పోషకాలు, ధరలో చాలా తేడాలున్నాయి.
రుచి, నూనె శాతం: మమ్రా బాదంలో నూనె శాతం (ఆరోగ్యకరమైన కొవ్వులు) కాలిఫోర్నియా బాదం కంటే దాదాపు 50శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇవి మంచి సువాసనతో, క్రీమీగా, విలక్షణమైన రుచిని కలిగి ఉంటాయి. కాలిఫోర్నియా బాదంలు నూనె శాతం తక్కువగా ఉండటం వల్ల కొంచెం పొడిగా, కరకరలాడుతూ ఉంటాయి.
పోషక విలువలు: అధిక నూనె శాతం కారణంగా మమ్రా బాదంలో పోషక సాంద్రత చాలా ఎక్కువ. ముఖ్యంగా ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, మెగ్నీషియం వంటివి సాధారణ బాదం కంటే అధికంగా లభిస్తాయి. అందుకే శీతాకాలంలో శరీరానికి శక్తినివ్వడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
ప్రాసెసింగ్ విధానం: కాలిఫోర్నియా బాదం ఉత్పత్తి ప్రపంచ డిమాండ్ ను తీర్చడానికి పెద్ద ఎత్తున యంత్రాల ద్వారా జరుగుతుంది. కానీ మమ్రా బాదంను చాలా జాగ్రత్తగా చేతితో ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల వాటి సహజ రుచి, పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి.
ధరలో ఎంత తేడా?
కాలిఫోర్నియా బాదం కిలో రూ.800 నుండి రూ.1,200 మధ్య లభిస్తుంది. మమ్రా బాదం ధర కిలోకు రూ.2,500 నుండి రూ.4,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని అత్యంత నాణ్యమైన ప్రీమియం రకాల ధర ఆన్‌లైన్‌లో ఊహించనంత ఎక్కువగా కూడా ఉంటుంది. పరిమిత సాగు, సేంద్రీయ విధానాలు, అధిక పోషక విలువలే ఈ ధరలకు ప్రధాన కారణం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
