Latest Updates
-
విలేజ్ స్టైల్ రవ్వ ఇడ్లీ: ఒక్కసారి ఇలా చేస్తే.. హోటల్ రుచిని మించిపోతుంది, ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
శరీరంతో చేసిన ద్రోహం కంటే మనసు పరాయిదైపోవడం ఎందుకు ఎక్కువగా గుండె పగులుస్తుంది -
నోరూరించే మధురై మటన్ పొడిమాస్.. ఇలా చేస్తే వదలకుండా తింటారు! -
World No Tobacco Day: సిగరెట్ వదిలేసిన 20 నిమిషాల్లోనే అద్భుతం.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
రాహు కేతు దోషంతో సమస్యలేనా? జ్యోతిష్య శాస్త్రం చెప్పే శక్తివంతమైన పరిహారాలు ఇవే! -
ఒక్క ముద్దతో వేరే లోకానికి.. అద్భుతమైన రుచితో నోరూరించే మ్యాంగో పులావ్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ పనీర్ బటర్ మసాలా: ఒక్కసారి ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ అడుగుతారు! -
మే 31: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది.. కెరీర్, ఆర్థికంగా తిరుగులేని విజయాలు మీ సొంతం! -
దోశ, చపాతీలోకి అదిరిపోయే స్పైసీ పచ్చళ్లు.. ఇలా చేశారంటే ఆ టేస్టే వేరు.! -
పౌర్ణమి వేళ అరుదైన సిద్ధ యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధనయోగం పక్కా!
పవర్ ఫుల్ సీక్రెట్ చెప్పిన సమంత..ఇలా చేస్తే 21 రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గొచ్చు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రాణాంతక మయోసైటిస్ వ్యాధి బారిన పడిన తర్వాత ఆరోగ్యంపై మరింత సీరియస్ గా దృష్టి సారించింది. కేవలం తాను ఫిట్ గా ఉండటమే కాకుండా, తనలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో ఫిట్‌నెస్ పై స్వయంగా అవగాహన కల్పిస్తోంది.
తాజాగా సమంత, తాను ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండటానికి, చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరవడానికి ప్రతిరోజూ ఉదయం పాటించే ఎనిమిది పనులను అభిమానులతో పంచుకుంది. తన పవర్ మార్నింగ్ రొటీన్ ను వివరిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేసింది. సమంత చెప్పిన ఆ 8 ఆరోగ్య సూత్రాలు ఏంటో ఇక్కడ చూడండి.

డిజిటల్ డిటాక్స్
ఉదయం నిద్రలేవగానే చాలామంది చేసే మొదటి పని ఫోన్ చూడటం. కానీ నిద్రలేచిన మొదటి గంట సేపు మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా, వార్తలు వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. దీనివల్ల ఉదయం పూట మెదడుపై అనవసరమైన ఒత్తిడి పడదు.
శ్వాసపై ధ్యాస
నిద్రలేచిన తర్వాత ఫోన్ పక్కనపెట్టి, కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ చిన్నపాటి ధ్యానం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. అంతేకాదు శరీరంలోని అదనపు కొవ్వును వేగంగా కరిగించడానికి ఈ ప్రక్రియ అద్భుతంగా సహాయపడుతుంది.
లేత సూర్యరశ్మి
ఉదయం నిద్రలేచిన 10 నిమిషాలలోపు ఆరుబయటకు వెళ్లి, మీ ముఖానికి లేత సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. దీనివల్ల శరీరానికి విటమిన్ D అందడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
హెల్తీ మార్నింగ్ డ్రింక్
ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, చిటికెడు పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, అలాగే కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలుపుకుని తాగాలి. ఇది శరీరంలోని ఎసిడిటీని తగ్గించి, మలినాలను బయటకు పంపుతుంది.
ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్
రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేలా, ప్రోటీన్, ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉండే అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇది జంక్ ఫుడ్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. అసలు జంక్ ఫుడ్ దరిదాపుల్లోకి వెళ్లొద్దని సామ్ గట్టిగా చెబుతోంది.
ఉదయం 11 లోపే వ్యాయామం
ఫిట్ నెస్ కాపాడుకోవడంలో వర్కవుట్స్ పాత్ర అత్యంత కీలకం. ఉదయం 11 గంటల లోపు మీ వ్యాయామాలను పూర్తి చేయాలి. సమంత అయితే తన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ రెండు గంటలు జిమ్ లో చెమట చిందిస్తుంది.
పరగడుపున కాఫీ,టీ వద్దు
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కెఫిన్ (కాఫీ, టీ) తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి వాటిని అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే తాగాలి.
రోజువారీ ప్రణాళిక
ఆ రోజు మీరు పూర్తి చేయాల్సిన పనులు ఏమిటి? అన్నది ముందుగానే ఆలోచించుకుని ఒక కాగితంపై రాసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మెదడు ఇతర అనవసరమైన విషయాల వైపు మళ్లకుండా ఉంటుంది. మీలో ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది.
21 రోజుల ఛాలెంజ్
మనం ఏదైనా ఒక పనిని 21 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే అది మనకు అలవాటుగా మారిపోతుంది. అందుకే ఈ ఎనిమిది పద్ధతులను కనీసం 21 రోజుల పాటు విడవకుండా పాటించాలని సమంత సలహా ఇస్తోంది. ఇలా చేయడం వల్ల సులువుగా బరువు తగ్గడమే కాకుండా, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ముఖంపై చర్మం సహజమైన కాంతిని సంతరించుకుంటుందని సామ్ చెబుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications