Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
మీ జుట్టు బాగా రాలిపోతుందా? ఈ గ్రీన్ ట్యాబ్లెట్ వేసుకుంటే డబుల్ వేగంతో కొత్త వెంట్రుకలు!
ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. కొంతమందికి చిన్నతనంలోనే బట్టతల వచ్చేస్తోంది. జుట్టు రాలడాన్ని ఆపేందుకు కొందరు ఖరీదైన షాంపూలు,అనేక రకాల ఆయిల్స్, ఇతర ప్రొడక్టులను వాడుతూ ఉంటారు. అయితే ఏం చేసినా, ఎన్ని ప్రొడక్టులు వాడినా ఫలితం ఉండట్లేదా? అయితే గ్రీన్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ ట్యాబ్లెట్ జుట్టు మూలాల్ని బలోపేతం చేస్తుందని, కొత్త జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుందని నిపుణులు చెబతున్నారు.
గ్రీన్ ట్యాబెట్ ఎక్కడ దొరుకుతుంది?
మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చే గ్రీన్ ట్యాబ్లెట్ మన వంటింట్లోనే ఉంటుంది. అవును,నిజమే.. వంటగదిలోని కొన్ని పదార్థాలను ఉపయోగించి గ్రీన్ ట్యాబ్లెట్ తయారుచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్యాబ్లెట్ తయారుచేయడం కోసం ఉసిరి పొడి, కరివేపాకు, కలబంద జెల్ అవసరమవుతుంది.

గ్రీన్ ట్యాబ్లెట్ ఎలా తయారుచేస్తారు
జుట్టు రాలడాన్ని ఆపే గ్రీన్ ట్యాబెట్ ని ఇంట్లోనే తయారుచేయడం కోసం ముందుగా కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాక వాటిని రుబ్బి పొడి చెయ్యాలి. తర్వాత ఓ గిన్నెల్ 1 టీస్పూన్ ఉసిరి నొడి, 1 టీస్పూన్ కరివేపాకు పొడి, 1 టీస్పూన్ ఆమ్లా పొడి, 1 టీస్పూన్ కలబంద జెల్ కలపాలి. తర్వాత దీన్ని మందపాటి పేస్ట్ లా చేసి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లా తయారుచేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్స్ ని 2-3 రోజులు ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత గాలి చొరబడని కంటైనర్ లో స్టోర్ చేయాలి.
ఎలా వాడాలి
రోజూ పొద్దున్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్రీన్ ట్యాబ్లెట్ ను గోరువెచ్చని నీటితో వేసుకోవాలి. ఇది శరీరంలోని అంతర్గత వ్యవస్థను ఉత్తేజపర్చి జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా ఈ గ్రీన్ ట్యాబ్లెట్ ను రాత్రిసమయంలో జుట్టుకు లేపనంగా కూడా ఉపయోగించవచ్చు. ఒక ట్యాబ్లెట్ ను నీటిలో మెత్తగా నానబెట్టి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు సున్నితంగా మర్దన చేసి తెల్లరిన తర్వాత తల స్నాం చేయాలి. మూడు వారాలు ఇలా చేస్తే ఫలితం ఉంటుందట.
Disclaimer: ఇంటర్నెట్ లో లభించిన ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనికి బాధ్యత వహించదు. దీనిని పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
