Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.!
వర్షాకాలం ఆరంభమైందంటే చాలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నామనే సంతోషంతో పాటు సీజనల్ వ్యాధుల భయం మొదలవుతుంది. ముఖ్యంగా స్కూళ్లు కూడా ఈ సీజన్‌లోనే ఓపెన్ కావడంతో పిల్లలకు వైరల్ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణకి సంబంధించి వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలం వచ్చిందంటే తల్లిదండ్రులను ఆందోళనకి గురిచేసే విషయం పిల్లల ఆరోగ్యం గురించే. ముక్కు కారడం, జ్వరం రావడం, వాంతులు, విరేచనాలు, ఇన్‌ఫెక్షన్ కారణంగా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ కాలంలో పీడియాట్రిషన్ క్లినిక్‌లలో చిల్డ్రన్ కేసులు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా పదేళ్ల లోపు వయసు పిల్లలు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పెద్దలతో పోలిస్తే పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా వారు వైరల్ ఫీవర్లకి ఎక్కువగా గురవుతారు.
ఇప్పటికే స్కూళ్లు ఓపెన్ అయి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. క్లాస్‌రూంల్లో పిల్లలు పక్కపక్కనే కూర్చుంటారు. అయితే కొన్ని పాఠశాలల్లో తరగతి గదుల్లో గాలి, వెలుతురు సరిగా ఉండదు. ఇంకా వర్షం కారణంగా తడిసిన బట్టలతో పిల్లలు పక్కపక్కనే కూర్చుంటారు. ఇంకా బాత్‌రూమ్‌ల్లో, వాటర్ ట్యాప్‌ల దగ్గర బ్యాక్టీరియా కారణంగా త్వరగానే పిల్లల శరీరంలోకి క్రిములు చేరతాయి. ఈ క్రమంలో ఒకరికి ఫీవర్ వచ్చినా.. అది త్వరగా మిగతా పిల్లలకూ సోకుతుంది. ఇన్ని ప్రమాదాల మధ్య మీ పిల్లలను స్కూల్‌కు పంపే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పిల్లలు స్కూల్‌కి వెళ్లాక బ్రేక్ సమయంలో చిరు తిళ్లకు అలవాటు పడుతుంటారు. బేకరీల్లో, కిరాణా షాపుల్లో జంక్ ఫుడ్‌ని తినేందుకు ఆసక్తి చూపుతారు. అయితే వర్షాల కారణంగా వీటిపై ఈగలు, దోమలు వాలే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫుడ్ తిన్నట్లయితే పిల్లల కడుపు ఇన్‌ఫెక్షన్‌కి గురై వాంతులు, విరేచనాలు అవుతాయి. అందుకే పిల్లలు స్కూల్‌లో చిరుతిళ్లకు అలవాటు పడకుండా వారికి ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసి పంపించడం ఉత్తమం.
వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతాయి. స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్‌లో, కుండీల్లో, మురుగు కాలువల్లో నీరు నిలిచి దోమలు వ్యాప్తికి దోహదం చేస్తాయి. పిల్లలు ఆడుకునే సమయంలో వీటి బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ కాలంలో పిల్లలు బయట ఆడుకోకుండా చూసుకోవాలి. ఇన్‌డోర్ గేమ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి.
వర్షాలకి పిల్లల యూనిఫాం తడవడం, తడి సాక్సులు, బూట్ల కారణంగా ఫంగస్ తేలికగా విజృంభిస్తుంది. దీనివల్ల దురుద, దద్దుర్లు ఎక్కువవుతాయి. వర్షంలో తడిసినట్లయితే తేమ ఎక్కువై, గాలి ప్రసరణ సరిగా ఉండదు. దీని వల్ల ఇతరుల నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలో పిల్లలను ఎక్కువగా బయట తిరగనీయకూడదు. వర్షంలో తడిసి వచ్చిన వెంటనే వేడి నీళ్లతో స్నానం చేయించాలి. తడిసిన యూనిఫాం, బూట్లు, సాక్సులు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.
ఇక, తినే భోజనం ద్వారానూ పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే భోజనం చేసే ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కునేలా పిల్లలకు అలవాటు చేయాలి. టాయిలెట్ వెళ్లి వచ్చిన తర్వాత, బయట ఆడుకున్న తర్వాత సబ్బు లేదా లిక్విడ్‌తో చేతులు కడుక్కునే అలవాటును వారికి నేర్పించాలి.

మలేరియా, డెంగ్యూ వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లో దోమల నివారణ మందులు ప్యాచెస్, స్పేలు, వలలు వంటి వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉంచాలి. పచ్చి ఆహారానికి బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉన్నందున వాటిని తిననివ్వకూడదు. పిల్లలకు ఈ కాలంలో వ్యాధులతో పోరాడేందుకు రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యం. విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, జామకాయలు, నిమ్మరసం తరచుగా పిల్లలకు ఇవ్వాలి. గింజలు, విత్తనాలు, ఆకుకూరలు, పప్పులు భోజనంలో చేర్చడం ద్వారా జింక్, ఐరన్ లభించి రక్తహీనతకి గురికాకుండా ఉంటారు. ఎప్పుడూ వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి.
స్కూల్‌కి వెళ్లేటప్పుడు పిల్లల బ్యాగ్‌లో కాచి చల్లార్చిన నీటిని స్టీల్ బాటిల్‌లో నింపి ఇవ్వాలి. దీంతో స్కూల్‌లో నీరు ఒకవేళ కలుషితమైనా వాటిని తాగకుండా ఉంటారు. లేదంటే ఫిల్టర్ నీటిని ఇవ్వాలి. వారి బ్యాగ్‌లో ఎప్పుడూ గొడుగు ఉండేలా చూసుకోవాలి. ఏ మాత్రం జ్వరంగా అనిపించినా వెంటనే ఆరోజు స్కూల్ మాన్పించి ఆస్పత్రికి తీసుకెళ్లండి. ఇక, ఈ సీజన్‌లో పిల్లల స్కూల్ బ్యాగులో ఎల్లప్పుడూ డాక్టర్లు సూచించిన సిరప్‌లు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల క్లాస్ మధ్యలో వారికి ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే మెడిసిన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications