Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వర్షాకాలంలోనూ మీ ముఖం మెరిసిపోవాలంటే ఈ ఇంటి చిట్కాలు బెస్ట్.!
మండే వేసవి నుంచి చిరుజల్లులు, చల్లటి గాలులతో వర్షాకాలం ఉపశమనం కలిగిస్తుంది. అయితే అప్పటివరకూ గాలిలో ఉన్న దుమ్ము అంతా వర్షంలో కలిసి ముఖంపై, చర్మంపై చేరి చిరాకు పెడుతుంటాయి. ఫలితంగా చర్మ సమస్యలు తలెత్తడం, ముఖం నిగారింపును కోల్పోతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా బ్యూటీపార్లర్‌కి వెళ్లే పని లేకుండా సహజ నిగారింపును సొంతం చేసుకోవచ్చు.

వర్షాకాలం చర్మ సౌందర్యానికి పలు సవాళ్లు ఎదుర్కొనేలా చేస్తుంది. గాలిలో పెరిగిన తేమ, ఉష్ణోగ్రతల్లో మార్పులు, తరచుగా భారీ వర్షాలతో చర్మ సున్నితత్వం దెబ్బ తింటుంది. ఫలితంగా మొటిమలు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, ముఖం జిడ్డు బారడం లేదా పొడిబారడం వంటి వాటితో బాధపడుతుంటారు. ఈ క్రమంలో రెయినీ సీజన్‌లో చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఏ సీజన్‌లో అయినా చర్మ సంరక్షణ ముఖ్యం. అయితే వర్షాకాలంలో మరింత కేరింగ్ తీసుకోవాలి. గాలిలో తేమ కారణంగా చర్మంపై మురికి, కాలుష్య కారకాలు ఎక్కువగా వచ్చి చేరతాయి. ఫలితంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలకి దారితీస్తుంది. ఇందుకోసం సౌమ్యంగా ఉండే క్లెన్సర్లను ఉపయోగించి చర్మంపై మురికిని తొలగించుకోవాలి. స్కిన్‌పై న్యాచురల్ ఆయిల్స్ కోల్పోకుండా సున్నితంగా వాటితో శుభ్రం చేసుకోవాలి. అయితే అతి శుభ్రం కూడా ప్రమాదకరం. తరచుగా ముఖం కడుక్కుంటే చర్మంపై అవసరమైన తేమ తొలగిపోయి, చిరాకు ఏర్పడుతుంది.
ఎక్స్‌ఫోలియేషన్
ఓట్‌మీల్ లేదా ఫ్రూట్ ఎంజైమ్‌లతో తయారు చేసిన తేలికపాటి ఎక్స్‌ఫోలియంట్‌లను వాడటం ద్వారా ముఖంపై మృతకణాలను తొలగిస్తుంది. అయితే ఈ ప్రక్రియను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చేసుకోవాలి. అతిగా చేసుకోవడం ద్వారా చర్మం సున్నితంగా మారుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది.
హైడ్రేషన్
వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో దాహం ఎక్కువగా వేయదని కొందరు నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది ప్రమాదకరం. ఏకాలంలో అయినా చర్మాన్ని హైడ్రేడెట్‌గా ఉంచుకోవడం ముఖ్యం. నీరు ఎక్కువగా తాగడం ద్వారా శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. చర్మం లోపలి నుంచి తేమగా మారి బయటి నుంచి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
వర్షాకాలంలో ముఖ సంరక్షణ కోసం తేలికపాటి మాయిశ్చరైజర్లు వాడటం ఉత్తమం. నీరు శాతం ఎక్కువగా ఉండే మాయిశ్చరైజర్లు వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. యాసిడ్, గ్లిజరిన్ ఎక్కువగా ఉండే వాటిని వాడొద్దని సూచిస్తున్నారు. హైడ్రేటింగ్ సీరమ్‌లు, విటమిన్ సి సీరమ్‌లు వాడటం ద్వారా చర్మం నిగారింపు పెరిగి ముఖంపై కాలుష్య కారకాలు పడకుండా అడ్డుకుంటుంది.

వర్షాకాలంలోనూ హానికరమైన యూవీ కిరణాలు చర్మానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. అందుకే సీజన్ ఏదానా సన్‌స్ర్కీన్ లోషన్స్ ఉపయోగించడం ముఖ్యం. ఈ కాలంలో కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను ఉత్తమం. బయటకు వెళ్లినప్పుడు కనీసం రెండు గంటలకి ఒకసారైనా దీనిని అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా ఆయిల్ లేని నాన్- కొమెడోజెనిక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం ఉత్తమం.
వర్షంలో తడిచినప్పుడు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వీటిని నివారించడానికి ఇంటికి రాగానే తప్పనిసరిగా స్నానం చేయాలి. యాంటీ ఫంగల్ పౌడర్‌ను ఉపయోగించడం ఉత్తమం. ఈ కాలంలో తేలికపాటి మేకప్ వేసుకోవడం చర్మానికి మంచిదని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. వాటర్ ప్రూఫ్ మేకప్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
వర్షాకాలంలో సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా కీలకం. పుష్కలంగా నీరు తాగుతూ హెర్బల్ టీలు, తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సీజనల్ వ్యాధుల ప్రమాదం దృష్ట్యా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు, గింజలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. పెరుగు, పులియబెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో పరిశుభ్రంగా ఉండటం ముఖ్యం. టవల్స్, బెడ్‌షీట్లు, దుప్పట్లు తరచుగా మారుస్తూ ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
