Latest Updates
-
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.!
అబ్బాయిలూ ముఖం జిడ్డుగా మారుతోందా.. మాన్‌సూన్‌లో ఈ స్కిన్ కేర్ టిప్స్ తప్పనిసరి.!
సాధారణంగానే అబ్బాయిల ముఖం కొంచెం రఫ్‌గా ఉంటుందనేది వాస్తవం. ముఖ్యంగా టీనేజ్ వయసు దాటాక గడ్డం, షేవింగ్ కారణంగా గరుకుగా మారుతుంటుంది. ఇక జిడ్డు చర్మం ఉన్న యువకులు ఫేస్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆయిల్ ఫేస్ విషయంలో ముఖ సౌందర్యానికి టిప్స్ పాటించాల్సి ఉంటుంది.

అబ్బాయిల ముఖం జిడ్డుగా ఉంటే మొటిమలు, నల్ల మచ్చలు వంటివి రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. దీంతో ముఖంపై చిరాకు, దురద వంటివాటితో విసుగు పుడుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గాలిలో ఉన్న దుమ్ము, సూక్ష్మ ధూళి కణాలు ముఖంపై రంధ్రాల్లో చేరి చిరాకును కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో ముఖ సంరక్షణ కోసం కీలక జాగ్రత్తలు తీసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తుననారు.
జిడ్డు చర్మం ఉన్నవారు ఫేస్ వాష్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు రోజుకు రెండు సార్లు మాత్రమే ముఖం కడుక్కోవాలి. ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై సహజ నూనెలు తొలగిపోయి పొడిబారుతుంది. అందుకే సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్‌లు వాడటం ద్వారా ఈ సమస్య ఉండదు. ఇవి జిడ్డును సమర్థవంతంగా తొలగిస్తాయి.
ఏ సీజన్ అయినా జిడ్డు ముఖం ఉన్నవారు మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి. దీని ద్వారా చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతుంది. ఆయిల్ ఫ్రీ లేదా నాన్- కొమెడోజెనిక్ జెల్ బేస్ మాయిశ్చరైజర్లు వాడటం ఉత్తమం. ఫలితంగా ముఖంపై సహజ నూనెలు కోల్పోకుండా జిడ్డును తొలగిస్తుంది.
సమ్మర్ వెళ్లిపోతుంది కదా అని అబ్బాయిలు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వదిలేయొద్దు. వర్షాకాలంలోనూ యూవీ కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. కనీసం ఎస్‌పీఎఫ్ 30 జెల్-బేస్డ్ లేదా వాటర్-బేస్డ్ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలని డెర్మటాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు.

జిడ్డు ముఖం ఉన్నవారు ఆఫీసులో లేదా ఫీల్డ్ వర్క్‌లో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు బ్లాటింగ్ పేపర్స్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. దీంతో జిడ్డు సులువుగా పోతుంది. వారంలో ఒకటి, రెండు సార్లు ఫేస్ స్క్రబ్ చేసుకోవచ్చు. దీంతో చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి, మృతకణాలు సులభంగా తొలగిపోతాయి. ఇంకా వేపుళ్లు, ఆయిల్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
