Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి..
నవ్వితే ముత్యాల్లా రాలే దంతాలు కావాలని ఎవరికి ఉండదు? ఇందుకోసం మార్కెట్లో దొరికే వేల రూపాయల ఖరీదైన టూత్ పేస్ట్ లు, రసాయనాలతో కూడిన వైటెనింగ్ ట్రీట్ మెంట్స్‌పై మనం ఆధారపడుతుంటాం. కానీ,ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సహజ వస్తువులతోనే మన పూర్వీకులు తమ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకునేవారు.
ఒకప్పుడు బొగ్గు, ఉప్పు, పసుపు, వేప పుల్లలతో పళ్లు తోముకునే వారిని చూసి నవ్విన వారే.. నేడు తమ పేస్ట్ లో ఉప్పు ఉందా? బొగ్గు ఉందా? లవంగాలు ఉన్నాయా? అని వెతుక్కుంటున్నారు. అయితే దంతాల ఆరోగ్యానికి సంబంధించి మనకు తెలియని మరో అద్భుతమైన ఆయుర్వేద రహస్యం ఉంది. అదే తేనెతో పళ్లు తోముకోవడం.

ఆయుర్వేదం ఏం చెబుతోంది?
సాధారణంగా తేనె అనగానే మనకు తీపి మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. స్వచ్ఛమైన తేనెకు దంతాలను సహజంగా తెల్లగా మార్చే అద్భుతమైన శక్తి ఉంది. ఆయుర్వేదంలో తేనెకు ఉష్ణ (వేడి), కఫాన్ని హరించే(కఫ దోషాన్ని తగ్గించే) గుణాలు ఉన్నట్లు చెప్పబడింది. ఈ ప్రత్యేక లక్షణాల వల్లే తేనెతో పళ్ళను మర్దనా చేసినప్పుడు, దంతాల సందుల్లో ఏళ్లుగా పేరుకుపోయిన పసుపుపచ్చని గార, మురికి, జిగట పొర (ప్లేక్) పూర్తిగా కరిగిపోయి తొలగిపోతాయి.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు
తేనెలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. దీనితో పళ్లు తోముకోవడం వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. తేనెతో చిగుళ్లను మృదువుగా మసాజ్ చేయడం వల్ల చిగుళ్ల నొప్పులు, వాపులు తగ్గి అవి దృఢంగా మారుతాయి. అంతేకాకుండా, దంతాలు లోపలి నుండి శుభ్రపడి తమ సహజమైన తెలుపు రంగును తిరిగి పొందుతాయి.
కల్తీ తేనెతో అసలుకే మోసం
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. మీరు దంతాలకు ఉపయోగించే తేనె నూటికి నూరు శాతం స్వచ్ఛమైనది, అసలైనది అయి ఉండాలి. మార్కెట్లో దొరికే కల్తీ తేనె, చక్కెర పాకం లేదా రసాయనాలు కలిపిన నకిలీ తేనెను వాడితే అసలుకే మోసం వస్తుంది. ఆ నకిలీ తేనెలోని చక్కెర వల్ల దంతాలు శుభ్రపడకపోగా.. పుచ్చు పళ్లు, కావిటీస్ వంటి దంత సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
ఎలా ఉపయోగించాలి?
తేనెను టూత్ బ్రష్‌పై వేసుకుని తోమకూడదు. ముందుగా మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత శుభ్రమైన చూపుడు వేలిపై కేవలం 2 లేదా 3 చుక్కల స్వచ్ఛమైన తేనెను తీసుకోండి. ఆ వేలితో మీ దంతాలు, చిగుళ్లపై కనీసం రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. అనంతరం గోరువెచ్చని నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించి ఉమ్మెయ్యాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
