Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
Saif ali khan: స్టార్ హీరోపై కత్తులతో దాడి.. ఈ ఫుడ్స్ తిన్నందుకే ఆయన ఇంకా బతికున్నాడట!
బాలీవుడ్ స్టార్ హీరో నేషనల్ అవార్డు గ్రహీత అయిన సైఫ్ అలీ ఖాన్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది. అర్థరాత్రి అతని ఇంట్లోకి చొరబడి అతనిపై కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాధారణంగా బలమైన కత్తిపోట్లకు ఎవరైనా చనిపోతారు. కానీ సైఫ్ అలీఖాన్ ఇంకా బలంగా ఉన్నారంటే దానికి కారణం ఆయన మెయింటైన్ చేసిన డైట్ అని చెప్పుకోవచ్చు.
ప్రతిరోజూ ఆయన తినే ఆహార పదార్థాలే ఆయనను రక్షించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కత్తిపోట్లను సైతం తట్టుకునేలా సైఫ్ అలీఖాన్ మెయింటైన్ చేసిన డైట్ ఏంటి? ఏ విధంగా వాటిని తీసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సైఫ్ అలీఖాన్ డైట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఫిట్‌నెస్, అందమైన శరీరానికి సుప్రసిద్ధి. దీనిని పొందేందుకు ఆయన కఠినమైన ఆహార నియమాలను పాటిస్తుంటారు. అవి ఏంటంటే..
సైఫ్ తన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెరలను చాలా తక్కువగా తీసుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అస్సలు తీరుకోరు కూడా. బియ్యం, రొట్టె వంటి ఆహారాలను తక్కువగా తీసుకుంటారు.
ప్రోటీన్లు ఎక్కువగా..
సైఫ్ అలీఖాన్ బలంగా ఉండడానికి, కండరాలు బిగుతుగా ఉండడానికి ఎక్కువగా ప్రోటీన్లు తీసుకుంటారు. మాంసం, చేపలు, గుడ్లు వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటారు. ఇవి కండరాల నిర్మాణానికి సహాయపడతాయి.
హెల్తీ ఫ్యాట్
సాధారణంగా జంక్ ఫుడ్ తింటే చెడు కొవ్వు అనేది బాగా పేరుకుపోతుంది. అయితే సైఫ్ అలీఖాన్ కేవలం ఆరోగ్యకరమైన కొవ్వులను మాత్రమే తీసుకుంటారు. ఆలివ్ ఆయిల్, అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం ఆయన ఆహారంలో ముఖ్యమైన భాగం.
పండ్లు, కూరగాయలు
సైఫ్ అలీఖాన్ ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటారు. ఆయన ఆహారంలో ఎక్కువగా ఇవే ఉంటాయి. ఇవి ఆయన శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు విటమిన్స్, ఖనిజాలను అందిస్తాయి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
ఉపవాసం ఉండడం వలన ఎన్నో లాభాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం అప్పుడప్పుడు ఉపవాసం ఉంటారు. అలాగే కొన్నిసార్లు సైఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే పద్ధతిని అనుసరిస్తారు. ఈ పద్ధతిలో, ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆహారం తీసుకుంటారు. అలాగే రోజంతా నీరు ఎక్కువగా తీసుకోవడానికి పరాయత్నిస్తారు. తద్వారా చర్మం ఆరోగ్యంగా, కాంతి వంతంగా ఉంటుంది.
సైఫ్ అలీఖాన్ ఏం ఏం తింటారంటే?
ఉదయం: ఒట్స్, స్కిమ్డ్ మిల్క్, తాజా పండ్లు
మధ్యాహ్నం: గ్రిల్డ్ చికెన్ లేదా సలాడ్
రాత్రి: తేలికపాటి భోజనం, ఉదాహరణకు దాల్, రోటి, సబ్జీ
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications