Latest Updates
-
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు..
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి?
ఈ ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ఫిట్ గా ఉండటం అనేది ఒక సవాలుగా మారింది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ కరువవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. జిమ్ కి వెళ్లి బరువులు ఎత్తే సమయం లేదా ఆసక్తి లేని వారికి, ఆరోగ్య నిపుణులు సూచించే అత్యుత్తమ, సులభమైన మార్గం నడక.
రోజూ 10000 అడుగులు నడవడం అనే ఫిట్‌నెస్ లక్ష్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. స్మార్ట్ వాచ్ లు, మొబైల్ యాప్స్ వచ్చాక ఈ ట్రెండ్ మరింత పెరిగింది. అయితే,నిజంగా పది వేల అడుగులు నడిస్తే ఏమవుతుంది? దానికి ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి? దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.

10 వేల అడుగులు అంటే ఎన్ని కిలోమీటర్లు?
పది వేల అడుగులు అనగానే అదో పెద్ద సంఖ్యలా అనిపించవచ్చు. కానీ ఒక సగటు వ్యక్తి 10 వేల అడుగులు పూర్తి చేయడానికి సుమారు 7-8 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అయితే ఈ దూరం అందరికీ ఒకేలా ఉండదు. వారి ఎత్తు, అడుగుల పొడవుపై ఇది ఆధారపడి ఉంటుంది. మీరు సాధారణ వేగంతో ఎలాంటి విరామం లేకుండా నడిస్తే, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దాదాపు గంట నుండి గంటన్నర టైం పడుతుంది.
ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి?
బరువు తగ్గాలనుకునే వారికి క్యాలరీల లెక్కలు చాలా ముఖ్యం. రోజూ పది వేల అడుగులు నడవడం వల్ల సగటున 300- 500 కేలరీలు బర్న్ అవుతాయి. మీ శరీర బరువు, వయస్సు,మీరు నడిచే వేగాన్ని బట్టి ఈ క్యాలరీల ఖర్చులో మార్పులు ఉంటాయి. కాస్త వేగంగా, చెమట పట్టేలా నడిస్తే మరింత ఎక్కువ కేలరీలు కరిగే అవకాశం ఉంది.
నిత్యం 10 వేల అడుగులు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు
సులువుగా బరువు నియంత్రణ: ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడవడం వల్ల అదనపు కొవ్వు కరిగిపోతుందని.. రోజూ ఖర్చయ్యే 300-500 కేలరీలు మీ శరీర బరువును అదుపులో ఉంచడానికి, ఊబకాయం దరిచేరకుండా చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
పదిలమైన గుండె ఆరోగ్యం: నడక అనేది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. రోజూ నడవడం వల్ల గుండె కండరాలు బలపడతాయి. అధిక రక్తపోటు (బీపీ), చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పట్టి గుండెపోటు వంటి ప్రమాదాల ముప్పు తప్పుతుందని వైద్య నిపుణులు తెలిపారు.

మానసిక ప్రశాంతత గ్యారెంటీ: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఆరుబయట నడవడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు అనే ఫీల్-గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఆధునిక జీవితంలో మనల్ని వేధిస్తున్న ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేసి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని తెలిపారు.
దృఢమైన ఎముకలు, కండరాలు: వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులను నడకతో జయించవచ్చు. క్రమం తప్పని నడక వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. కీళ్ల కదలికలు మెరుగై, ఆస్టియోపోరోసిస్ (ఎముకలు పెళుసుబారడం) వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. కండరాలు దృఢంగా మారతాయి.
దీర్ఘకాలిక వ్యాధులకు చెక్: నిత్యం నడిచే అలవాటు ఉన్నవారికి టైప్-2 మధుమేహం వచ్చే ముప్పు తక్కువ. అంతేకాదు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 6శాతం, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు ముప్పు ఏకంగా 38 శాతం మేర తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, రాత్రిపూట గాఢమైన నిద్ర పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications