ఖరీదైన సీరమ్‌లు వద్దు.. ఈ ఒక్క కూరగాయతో మెరిసే ముఖం మీ సొంతం.!

నేటి ఆధునిక యుగంలో చర్మ సంరక్షణ పద్ధతులు మారిపోతున్నాయి. మార్కెట్‌లో రకరకాల ఉత్పత్తులు, సీరమ్‌లు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా ఎన్ని రకాల మార్పులు వచ్చినా.. సహజంగా లభించే అందానికి ఏదీ సాటి రాదు. అందుకే ఇంట్లోనే దొరికే పదార్థాలతో ముఖాన్ని కాంతివంతంగా చేసుకునే పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యానికి మేలు చేసే అతి చవకైన కూరగాయ ద్వారా అద్భుతమైన సీరమ్‌ను తయారుచేసుకోవచ్చని తెలుసా.?

stop expensive serums try this okra hydration drink for glowing skin

కాంతివంతమైన, ప్రకాశవంతమైన ముఖం కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌ అందుబాటులో ఉన్నా.. ఇంట్లో దొరికే శనగపిండి, పెరుగు, మెంతులు, బియ్యపు పిండి, కలబందతో ఫేస్‌ప్యాక్‌తో ఎన్నో రకాల బ్యూటీ ప్రయోజనాలను చూశాం. కానీ ఒక రకం కూరగాయతో అంతే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. దానితో సీరమ్‌ను తయారుచేసుకుని ముఖానికి కావాల్సిన హైడ్రేషన్‌ను సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లో వందలు, వేలు ఖర్చు చేసి బ్యూటీ ప్రొడక్ట్స్‌ కొనే బదులు కేవలం రూ. 30తో సహజ నిగారింపును సాధించవచ్చు.

బెండకాయ తింటే బ్రెయిన్‌ బాగా షార్ప్‌గా పనిచేస్తుందని చిన్నప్పటి నుంచే బెండకాయ తినడం అలవాటు చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఇందులో సహజమైన జెల్‌, ఫైబర్‌, నీరు పుష్కలంగా ఉండటంతో కావాల్సిన శరీరానికి తేమను, మెరుపును అందిస్తుంది. అంతేకాకుండా ఇందులోని హయలురోనిక్ సీరమ్ చర్మం పై పొరలో తేమను నిలుపుకోవడానికి దోహదపడుతుంది.

అందుకే ఈ సారి బెండకాయను కేవలం వంటలకే పరిమితం కాకుండా బ్యూటీ ప్రొడక్ట్‌గా కూడా ఉపయోగించండి. త్వరలోనే మీ ముఖం అద్భుతమైన నిగారింపును సొంతం చేసుకుంటుంది. బెండకాయలోని సీరమ్ చర్మాన్ని బయటి నుంచి హైడ్రేడెట్‌గా ఉంచగా.. బెండకాయ శరీరం లోపలి నుంచి డీహైడ్రేషన్‌కి గురి కాకుండా కాపాడుతుంది. ఈ క్రమంలో బెండకాయతో హైడ్రేషన్‌ డ్రింక్‌ తయారుచేసుకుని ప్రయత్నించండి..

stop expensive serums try this okra hydration drink for glowing skin

బెండకాయతో హైడ్రేషన్ డ్రింక్‌ తయారీ విధానం

బెండకాయతో హైడ్రేషన్‌ డ్రింక్ కోసం ముందుగా నాలుగు బెండకాయలను శుభ్రంగా కడిగి తుడిచి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. తర్వాత ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే బ్రష్‌ చేసుకుని పరగడుపున ఈ నీటిని తాగాలి.

బెండకాయ హైడ్రేషన్‌ డ్రింక్‌ తాగడం వల్ల చర్మ నిగారింపునకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో జిగురు లాంటి జెల్, నీరు ముఖాన్ని, శరీరాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి. బెండకాయలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో దోహదపడతాయి. అంతేకాకుండా ఇది చర్మ ఆరోగ్యానికి, జీర్ణాశయ వ్యవస్థకు మేలు చేస్తుంది. బెండకాయలోని విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడటానికి దోహదపడుతుంది.

వారానికి ఒక సారి బెండకాయ హైడ్రేషన్‌ డ్రింక్‌ తాగడం ద్వారా మాత్రమే చర్మానికి తేమ అంది, కాంతివంతంగా మారదు. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మంచి నిద్ర, జీవనశైలి ద్వారా ఆ ప్రభావం మీ ముఖం తాజాగా ఉండేందుకు దోహదపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion