Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
రోజూ ఉదయం 3, 4 గంటలకు మెలకువ వస్తోందా? భగవంతుడు ఏదో చెప్పాలని చూస్తున్నట్లేనా?
కొందరు రాత్రి ఏ సమయంలో పడుకున్నా.. తెల్లవారుజామున 3, 4 గంటల సమయంలో ఎవరో తట్టి లేపినట్టు నిద్ర నుంచి మేల్కొంటారు. అకస్మాత్తుగా ఎందుకు మేల్కువ వచ్చిందో కూడా అర్థం కాకుండా.. అలా కొద్ది సేపు అటు, ఇటు దొర్లుతారు. అలా కాసేపటి తర్వాత తిరిగి నిద్రలోకి జారుకుంటారు. అర్ధరాత్రి కంటే కూడా తెల్లవారుజాము సమయంలో గాఢమైన నిద్ర వస్తుంది. ఇలాంటి సమయంలో నిద్ర నుంచి మేల్కొనడం అంటే నిద్రకు భంగం వాటిల్లినట్లే.
సాధారణంగా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు 3 నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తంగా పేర్కొంటారు. ఈ సమయాన్ని దైవిక శక్తికి సంకేతంగా చూస్తారు. ఈ సమయంలో ఏదైనా పనిని ఏకాగ్రతతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. విద్యార్థులు కూడా ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి చదువుకుంటే.. చదివింది చక్కగా గుర్తుండిపోతుందని చెబుతుంటారు. అలాంటి సమయంలో నిద్ర నుంచి మేల్కొనడం దేనికి సంకేతమో తెలుసా?

తెల్లవారుజామున 3 గంటల నుంచి 4.30 గంటల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు. దీనినే బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. ఈ సమయంలో రోజూ మేల్కొనడం అంటే.. దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని అంటున్నారు నిపుణులు.రోజూ ఈ సమయంలో మేల్కొనడం అంటే.. దాని వెనక దైవిక శక్తి ఉందని అర్థం. ఆ సమయంలో మిమ్మల్ని మేల్కొలపాలని అనుకుని నిద్రనుంచి మేల్కొపినట్లు అర్థం చేసుకోవాలట. మరి అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసా..
బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తే ఏం చేయాలి?
రాత్రి సమయంలోని మూడో భాగాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. వైదిక గ్రంథాల ప్రకారం నిద్ర నుంచి మేల్కొనడానికి ఇదే సరైన సమయం. వేద కాలం నుంచి బ్రహ్మ ముహూర్తాన్ని అమృత సమయంగా పరిగణిస్తారు. అమృత సమయంలో సానుకూల ప్రకంపనలు ఆకాశంలో చాలా వేగంగా ప్రవహిస్తాయి. ఈ సమయంలో ప్రతికూల శక్తులు సుషుప్తావస్థలో ఉంటాయి. దీని మూలంగా సానుకూల ప్రకంపనలు చైతన్యంగా మారుతాయి.
ఈ సమయంలో మేల్కొనడం వెనక ఉన్న కారణాన్ని అర్థం చేసుకుని.. ఆ సమయంలో ఇష్ట దైవాన్ని పూజించాలని పండితులు సూచిస్తున్నారు. 3 గంటల నుంచి 5 గంటల లోపు మెలకువ వస్తే.. ఇష్ట దైవాన్ని కాసేపు స్మరించుకోవాలని, లేదా మంత్రాన్ని జపించాలి అని పండితులు సూచిస్తున్నారు.
బ్రహ్మ ముహూర్తంలో సానుకూల శక్తుల ప్రకంపనలు అంటే భగవంతుని దివ్య శక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఆ సమయంలో భగవంతుని నామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో మెలకువ వస్తే దైవాన్ని ప్రార్థించాలి. ఈ సమయంలోనే నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే మరింత మంచిది అని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
