Latest Updates
-
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.! -
శుక్ర-శని సమసప్తక యోగం.. ఆగస్టు 1 నుండి ఈ రాశులకు ఊహించని కష్టాలు! -
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి! -
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? -
మిక్సీ, స్టవ్ తో పనేలేదు.. 5 నిమిషాల్లో అద్భుతమైన రాజస్థానీ స్పెషల్ డుంగ్రీ చట్నీ ఎలా చేసుకోవాలంటే..
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.!
నేటి కాలంలో చిన్న వయసులోనే మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. ఇందుకు కారణం అండాశయాల్లో అండాల ఉత్పత్తి తక్కువగా ఉండటమే అని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు. దీనికి వివిధ రకాల ఆరోగ్య సంబంధిత కారణాలు ఉండొచ్చని.. లో ఒవేరియన్ రిజర్వ్(తక్కువ అండాశయ నిల్వ)గా పేర్కొంటున్నారు. అసలు మహిళల్లో ఎందుకు ఈ సమస్య ఏర్పడుతోంది. పరిష్కారానికి నిపుణులు ఏం చెబుతున్నారు ఇక్కడ చూద్దాం..

దేశంలో నేడు చాలా మంది మహిళలు చిన్న వయసులోనే ఇన్‌ఫెర్టిలిటీతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించింది. మహిళల సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పునరుత్పత్తి వ్యవస్థలో కీలకమైన అండాశయాల్లో అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోవడం కారణంగా ఈ సమస్య వాటిల్లుతోంది. ఇందుకు కారణాలను గైనకాలజిస్టు నిపుణులు విశ్లేషించారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన జీవనశైలి లేకపోవడం, ఒత్తిడి, ఆహారంలో మార్పులు, కెరీర్ ప్లాన్‌లో భాగంగా పిల్లలను కనడంలో ఆలస్యం చేయడం, లేటు వయసులో వివాహాలు మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతున్నాయి.
పోటీ ప్రపంచంలో పురుషులతో పాటు సమానంగా మహిళలూ వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద చదువులు, వృత్తిలో ఎదుగుదల ఇలా పలు కారణాలతో మహిళలు గర్భధారణ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. ఇది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారినా మున్ముందు పిల్లలు కనే ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మహిళలు ఫెర్టిలిటీకి సంబంధించి ప్రధాన పాత్ర పోషిస్తున్న అండాశయ నిల్వ గురించి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా మహిళ వయసును బట్టి అండాశయ నిల్వ అనేది ఆధారపడి ఉంటుందని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు. వయసుకి అనుగుణంగా అండాల సంఖ్య తగ్గితే అది గర్భం దాల్చడంలో సమస్యలకి దారితీయకపోయినా.. అవకాశాలను తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి మహిళ పుట్టగానే శరీరంలో అండాల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుందని.. క్రమంగా వారు పెరిగేకొద్దీ వాటి సంఖ్య తగ్గుతూ వస్తుందని తెలిపారు.
ఈ క్రమంలో మహిళల వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య తగ్గడంతో పాటు నాణ్యత కూడా పడిపోతుంది. ముఖ్యంగా మహిళలకు 30 ఏళ్లు దాటగానే గర్భం ధరించే సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుంది. వీటికి తోడు జన్యుపరమైన కారణాలు, సర్జరీలు, అనారోగ్యం, కీమోథెరపీ వంటివి కూడా అండాల నిల్వ సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని గైనకాలజిస్టు నిపుణులు తెలిపారు.
అండాశయాల్లో అండాల నిల్వ గురించి AMH(యాంటీ ముల్లేరియన్ హార్మోన్) స్థాయిలు తెలియజేస్తాయి. అయితే వయసు 30 రాకముందే ఆ స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో ఏఎమ్‌హెచ్ లెవెల్స్ తగ్గిపోతే అది రుతుస్రావంపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా గర్భం ధరించే అవకాశాలను తగ్గించేస్తుంది.

మహిళలూ.. మీరు పెళ్లయి ఏళ్లు దాటినా సంతానం కాక ఇబ్బంది పడుతున్నట్లయితే అండాశయ నిల్వ గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఏఎమ్‌హెచ్ టెస్టు ద్వారా అండాల నిల్వను తెలుసుకోవచ్చు. ఇందుకోసం రక్త పరీక్ష లేదా అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా నిర్ధారణకు వస్తారు. కొందరికి అండాల నిల్వ తక్కువగా ఉన్నా గర్భం దాల్చుతారు. కానీ కొందరిలో ఇందుకోసం సంతానోత్పత్తి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీ వయసును బట్టి పిల్లలను కనే విషయంలో మీరు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. వైద్య రంగంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ద్వారా అండాలను భద్రపరుచుకునే సామర్థ్యమూ ఉంది. తద్వారా మీరు ప్లాన్ చేసుకున్న వయసులోనే పిల్లలను కనే అవకాశాలు ఉంటాయి. సమతుల్య పోషకాహారం, వ్యాయామం, పుష్కలంగా నీరు తాగడం, సరైన జీవనశైలి ద్వారా అండాల నిల్వ, నాణ్యతను కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications