Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
షుగర్ ఉన్నవాళ్లు తినడానికి బెస్ట్ ఫ్రూట్ ఇదే..బీపీ, కొలెస్ట్రాల్ సమస్య కూడా ఫసక్!
మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు జనాలకు కొత్త కొత్త రోగాలను తెచ్చిపెడుతున్నాయి. ఏదైనా తింటే ఒక రోగం, ఏదీ తినకుంటే మరో రోగం అన్నట్లు పరిస్థితులు మారిపోతున్నాయి. మనదేశంలో విపరీతంగా మందులు వేసి పండించిన ఆహారాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఆల్రెడీ మందులు వేసి పండించినవాటిల్లో కూడా మళ్లీ కల్తీ చేస్తుండటంతో రోజురోజుకి కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు షుగర్ వ్యాధి అంటే ఏదో పెద్ద వయస్సు వారికే వచ్చేది అని భావించేవాళ్లు. అయితే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా మనదేశంలో షుగర్ వ్యాధి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆహార అలవాట్లు అని చెప్పవచ్చు.
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో షుగర్ పేషెంట్లు ఉన్నారు. అందుకే మనదేశం వరల్డ్ డయాబెటిస్ రాజధానిగా ఘనత సాధించింది. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చింది అంటే ఇక దాన్ని పూర్తిగా 100శాతం నయం చేసే మెడిసిన్ అయితే మార్కెట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్, ఆహార అలవాట్లలో మార్పు వంటి పద్ధతుల ద్వారా కేవలం షుగర్ లెవల్స్ ను కంట్రోల్ మాత్రమే చేయవచ్చు. అయితే షుగర్ వచ్చినవాళ్లకు ఏది తినాలి? ఏది తినకూడదు? అనే విషయంలో కూడా అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. షుగర్ పేషెంట్లు ఏది పడితే అది తింటే యమలోకానికి ఎంట్రీ టిక్కెట్ కొన్నట్లే అవుతుంది. తినే ప్రతిదీ జాగ్రత్తగా చూసుకొని తినాలి. పండ్లు మన ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే షుగర్ పెషెంట్లు తినడానికి ఉత్తమమైన ఫ్రూట్ ఏది? నిపుణులు ఏ పండును షుగర్ పేషెంట్లు తినడానికి ఉత్తమమైనదిగా సూచిస్తున్నారో,ఎందుకో ఇక్కడ చూడండి.

ఆ పండు ఇదే
షుగర్ పేషెంట్లు తినడానికి బెస్ట్ ఫ్రూట్ లో ముందువరుసలో దానిమ్మ ఉంటుంది. దానిమ్మ తియ్యగా ఉంటుంది కాదా మరి షుగర్ పేషెంట్లు తినవచ్చా అని డౌట్ చాలామందికి కలగడం సహజమే. వాస్తవానికి దానిమ్మ తియ్యగానే ఉంటుంది. కానీ ఇందులో నేచురల్ స్వీట్నెస్ తో పాటుగా ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కవగా ఉంటుంది కాబట్టి ఇది షుగర్ లెవల్స్ ని తర్వగా పెంచదు. దానిమ్మ గ్లైసెమిక్ ఇండెక్స్(GI) కేవలం 40-50 వరకే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దానిమ్మను తినడం వల్ల కొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
దానిమ్మలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుంది. చెడు కొలెస్ట్రాల్(LDL)తగ్గుతుంది..యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ ని కూడా నివారించుకోవచ్చు. బ్లడ్ ప్లో అంటే రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. బ్లడ్ క్లాట్ అవ్వకుండా అంటే రక్తం గట్టకట్టడం వంటివి లేకుండా నేచురల్ బ్లడ్ తిన్నర్ గా కూడా పనిచేస్తుంది. అంటే జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అయితే దానియ్మ తినేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూడండి
దానిమ్మ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-దానిమ్మను కేవలం ఒక స్నాక్ గా మాత్రమే తీసుకోవాలి.
-బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో కలిపి దీన్ని తినవద్దు.
-1 కప్పు అంటే 100 గ్రామ్స్ దానిమ్మలో 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ వరకు మనం లిమిట్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications