Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
బొప్పాయి ఆకుల్లో ఉన్న ఈ అద్భుత శక్తులు మీకు తెలుసా?..చెట్టుకు దండేసి మొక్కుతారు!
ఇప్పటికీ మనదేశంలో పల్లెటూర్లలో ఇంటి చుట్టుపక్కల, నెయ్యి దిబ్బల దగ్గర కనబడే బొప్పాయి చెట్లను మనం చాలా లైట్ తీసుకుంది. ఆ చెట్టుకు కాయలు కాసి రాలిపోయినా కూడా వాటిని పట్టించుకోం. అయితే బొప్పాయి చెట్టు అందించే ప్రయోజనాలు తెలిస్తే ఆ చెట్లుకు దండం పెట్టి పూజలు చేస్తారు. చేసినా తప్పు లేదు కూడా. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి బాగు చేసే పంజీవని లాంటిది. సాధారణంగా బొప్పాయి పండు తియ్యని రుచి, అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలిసిందే. కానీ ఆ పండును అందించే చెట్టు ఆకులలో దాగి ఉన్న అద్భుతాల గురించి మీకు తెలుసా?
బొప్పాయి పండు ఎంత మేలు చేస్తుందో దాని ఆకు అంతకుమించిన ఔషధాల గని అని చెప్పవచ్చు. ఇది అనేక వ్యాధులకు సహజసిద్ధమైన దివ్యౌషధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ వంటి భయంకరమైన వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఈ సమయంలో బొప్పాయి ఆకులు డెంగ్యూ సహా మరెన్నో ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారం చూపుతాయి. బొప్పాయి ఆకుల వల్ల కలిగే ఆ అద్భుత ప్రయోజనాలేంటో వివరంగా ఇక్కడ చూడండి.

డెంగ్యూ జ్వరంపై పోరాటం
డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. బొప్పాయి ఆకు రసం ఈ సమస్యకు ఒక ప్రసిద్ధ హోం రెమెడీ. ఈ ఆకులలో ఉండే పపైన్, చైమోపపైన్ వంటి శక్తివంతమైన ఎంజైమ్ లు రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్యను అద్భుతంగా పెంచుతాయి. అంతేకాకుండా డెంగ్యూ వల్ల కలిగే తీవ్రమైన బలహీనత, అలసటను తగ్గించి, శరీరానికి నూతనోత్తేజాన్ని అందిస్తుంది.
జీర్ణవ్యవస్థకు రక్షా కవచం
గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నోళ్లకి బొప్పాయి ఆకు బాగా పని చేస్తుంది. బొప్పాయి జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడి, పొట్టను తేలికగా ఉంచుతాయి.
కాలేయానికి,కామెర్లకు కూడా
మన శరీరంలోని మలినాలను బయటకు పంపే ముఖ్యమైన అవయవం కాలేయం. బొప్పాయి ఆకులు సహజసిద్ధమైన డిటాక్స్ ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించి, దాని పనితీరును మెరుగుపరుస్తాయి. కామెర్లు వంటి కాలేయ సంబంధిత వ్యాధుల నివారణలో కూడా ఇది సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తికి బూస్ట్
వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతుంటే దీనికి కారణం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థే. బొప్పాయి ఆకులలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పటిష్టం చేసి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తాయి.
మధుమేహానికి దివ్యౌషధం
మధుమేహం లేదా షుగర్ వ్యాధితో బాధపడేవారికి బొప్పాయి ఆకులు ఒక వరం లాంటివి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూస్తాయి.
సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది
బొప్పాయి ఆకులు కేవలం ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మేలు చేస్తాయి. దీని రసాన్ని తాగడం వల్ల లేదా ముఖానికి పూసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించి, చుండ్రు సమస్యను నివారిస్తుంది.

ఎలా తీసుకోవాలి
కొన్ని తాజా బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి కొద్దిగా నీరు చేర్చి రసం తీయాలి. ఈ రసాన్ని వడకట్టి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం ఉత్తమం. ఇది చాలా చేదుగా ఉంటుంది కాబట్టి, రుచి కోసం ఒక చెంచా తేనె కలుపుకోవచ్చు. లేదా ఆకులను నీటిలో మరిగించి కషాయంలా కూడా తాగవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications