Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
వారందరూ డేంజర్ లో..డాక్టర్ చెప్పిన లివర్ క్యాన్సర్ రహస్యాలు
కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియకు, శక్తి నిల్వ చేయడానికి, విషపదార్థాలను తొలగించడానికి,ప్రోటీన్లను తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇటీవల చాలామంది లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడటం,దీని కారణంగా మరణించిన కేసులను కూడా తరచుగా మనం చూస్తుంటాం. అయితే ఈ లివర్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ లో మెడికల్ ఆంకాలజీ అండ్ బోన్ మారో ట్రాన్స్ ఫ్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ క్రిష్ణారెడ్డి ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు.
కాలేయ వ్యాధులు ఎక్కువగా ఉన్నవారిలో అత్యంత తరచుగా వచ్చే హెపటోసెల్యులర్ కార్సినోమా (HCC) అనే లివర్ క్యాన్సర్ రకం గురించి డాక్టర్ క్రిష్ణారెడ్డి కొన్ని విషయాలను మాట్లాడారు. హెపటోసెల్యులర్ కార్సినోమా అనేది ఈ కాలేయ కణాల నియంత్రణ కోల్పోయి, అసాధారణంగా పెరిగినప్పుడు సంభవిస్తుంది. కాలేయ సిర్రోసిస్ లేదా దీర్ఘకాలిక హెపటైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాలేయం దెబ్బతిన్నప్పుడు, దాని కణాలు మరమ్మత్తు చేసుకునే ప్రక్రియలో తప్పులు జరిగి క్యాన్సర్ గా మారవచ్చు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిదానంగా ఎదుగుతుంది.

ఆరంభ దశల్లో ఈ క్యాన్సర్ అసలు కనిపించదు లేదా చాలామటుకు పట్టించుకోలేని చిన్న లక్షణాలే కనిపిస్తాయి. అందుకే చాలామంది రోగులు తమకు ఏమీ సమస్య లేదనుకుంటూ ఉంటారు.. కానీ అప్పటికే క్యాన్సర్ ఎదిగిపోతుందని డాక్టర్ క్రిష్ణారెడ్డి చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 50 శాతం కన్నా ఎక్కువ మంది రోగులు క్యాన్సర్ పూర్తిగా సోకాక లేదా యాదృచ్ఛికంగా చేసే పరీక్షలలోనే గుర్తిస్తున్నారు. దాంతో పూర్తిగా నయం చేసే ట్రీట్మెంట్ల అవకాశాలు తగ్గిపోతుంటాయని ఆయన సూచించారు.
ముఖ్యమైన ప్రమాద సూచకాలు ఏమిటంటే
- దీర్ఘకాలిక హెపటైటిస్ బి లేదా సి వైరస్ సోకినవారు
- లివర్ కణజాలం గాయపడటం, గట్టిపడటం ఉన్నవారు. ఈ కండిషన్ వల్ల HCC వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ
-ఊబకాయం, మధుమేహం వల్ల వచ్చే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా లివర్ క్యాన్సర్ కి బలమైన కారకాల్లో ఒకటి.
-సంవత్సరాల తరబడి ఎక్కువ మద్యం సేవించే అలవాటూ ప్రధాన కారణమే.
-నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెబుతున్నదేమిటంటే..ప్రపంచవ్యాప్తంగా లివర్ క్యాన్సర్స్ కి ముఖ్యమైన కారణం వైరల్ హెపటైటిస్ అని.
సాధారణంగా ఈ పరిస్థితులు రోగిలో ఏ లక్షణాలూ లేకుండానే సంవత్సరాల తరబడి ఉండవచ్చు. అవే చివరికి హెపటోసెల్యులర్ కార్సినోమాకి దారితీయగలవు.
ఇంకో విషయం..గుడ్ న్యూస్
శాస్త్రీయంగా రుజువైన విషయం ఏంటంటే.. లివర్ క్యాన్సర్ ని ముందే గుర్తించగలగడం సాధ్యమేనని డాక్టర్ క్రిష్ణారెడ్డి చెప్పారు. ప్రస్తుతం లివర్ క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రమాదంలో (హై-రిస్క్ లో) ఉన్నవారు ప్రతి ఆరునెలలకోసారి లివర్ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. దీని వెంటనే ఆల్ఫా ఫెటోప్రోటీన్ అనే రక్తపరీక్ష కూడా చేయించాలి.
ఈ స్క్రీనింగ్ వల్ల
- క్యాన్సర్ తొందరగా కనిపిస్తుంది
- ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ మొదలుపెట్టొచ్చు
- దీర్ఘకాలం జీవించడానికి అవకాశాలు పెరుగుతాయి.
ఆంకాలజీ నిపుణులు చెబుతున్నదేమిటంటే.. అల్ట్రాసౌండ్ పద్ధతి చాలావరకు లివర్ క్యాన్సర్ ని లక్షణాలు కనిపించే ముందే గుర్తించగలదు, అందుకే లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు తప్పకుండా తమ డాక్టర్ ను స్క్రీనింగ్ అవసరమా కాదా అని అడగాలి అని డాక్టర్ క్రిష్ణారెడ్డి తెలిపారు.

ఇంత జాగ్రత్త ఎందుకు అవసరం?
ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నక్యాన్సర్ గడ్డలు చికిత్స చేయగలిగేవే. అందులో ప్రధానమైనవి ఇక్కడ చూడండి.
- సర్జరీ
- లివర్ మీదున్న క్యాన్సర్ గడ్డలను కరిగించటం లేదా తీసివేయటం.
- కొన్నిసార్లు లివర్ ట్రాన్స్ ఫ్లాంట్
-జాండీస్, పొత్తికడుపు నొప్పి, అలసట లాంటి లక్షణాలు మొదలయ్యాయంటే.. అప్పటికి వ్యాధి చాలా ముదిరినట్టుగా అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉండిపోతాయి.
క్లుప్తంగా చెప్పాలంటే
- ప్రాథమిక దశలోనే ట్యూమర్స్ లేదా గడ్డలు కనిపెడితే ట్రీట్మెంట్ తో కోలుకునేలా చేయవచ్చు
- బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
- గడచిపోతే, వెనక్కి రాదు.
కాబట్టి సాధ్యమైనంత తొందరగా గుర్తించడం చాలా ముఖ్యమైనది. ఈ నిశ్శబ్ద వ్యాధిని ఎదుర్కోవడానికి, అవగాహన, రొటీన్ స్క్రీనింగ్.. ఇవి రెండే మార్గాలని డాక్టర్ క్రిష్ణారెడ్డి తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications