Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!
చేదుగా ఉండే మందు రోగాన్ని త్వరగా నయం చేస్తుంది అనే నానుడి మనందరికీ తెలిసిందే. ఈ మాటకు అక్షరాలా సరిపోయే అద్భుతమైన ఆయుర్వేద మూలిక క నేలవేము. ఆయుర్వేదంలో దీనిని కింగ్ ఆఫ్ బిట్టర్స్ అని కూడా అంటారు. ఇది అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క. దీనికున్న తీవ్రమైన చేదు లక్షణం కారణంగా ఆయుర్వేదంలో దీనిని చేదుకు రారాజుఅని కూడా పిలుస్తారు.

సుమారు 5,000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మన ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్య విధానం.. వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలను సమతుల్యం చేస్తూ మనస్సు, శరీరం, ఆత్మల కలయికతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ అద్భుత వైద్య విధానంలో కాలేయ పనితీరును మెరుగుపరచడానికి, శరీరానికి జీవశక్తిని అందించడానికి నేల వేము ఆకులు, కాండాలను శతాబ్దాలుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
నేల వేము అందించే అద్భుత ప్రయోజనాలు
సంపూర్ణ ఆరోగ్యం: నేల వేము చూర్ణాన్ని క్రమం తప్పకుండా సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చు.
విషపదార్థాల తొలగింపు: మన శరీరంలో పేరుకుపోయిన హానికరమైన విషపదార్థాలను సహజసిద్ధంగా బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
దోష నివారణ: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, శరీరంలో వేడికి కారణమయ్యే పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేయడంలో నేల వేము అత్యంత ప్రభావవంతమైనది.
రోగనిరోధక శక్తి: కాలేయ సమస్యల ట్రీట్మెంట్ లోనే కాకుండా, జీర్ణశక్తిని, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి మనిషిని చురుకుగా ఉంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.
లివర్ డీటాక్సిఫికేషన్ కు బ్రహ్మాస్త్రం
నేటి ఆధునిక జీవనశైలి, కలుషిత ఆహారపు అలవాట్ల వల్ల కాలేయంలో మలినాలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. మీ దైనందిన ఆహారంలో నేల వేమును చేర్చుకోవడం ద్వారా కాలేయాన్ని పూర్తిగా శుభ్రపరచుకోవచ్చు. ఇది కాలేయంలోని విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపి, కాలేయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. భవిష్యత్తులో కాలేయ వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఆయుర్వేదంలో ఉన్న అత్యుత్తమ డీటాక్స్ మూలికలలో ఇది మొదటి వరుసలో ఉంటుంది.
జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యానికి దివ్యౌషధం
శరీరంలో కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే జీర్ణ వ్యవస్థ సజావుగా సాగుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి నిత్యం వేధించే సమస్యలను ఇది సహజంగానే తగ్గిస్తుంది.ః
పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
రసాయనాలతో కూడిన జీర్ణకోశ మందులకు ఇది సురక్షితమైన సహజ ప్రత్యామ్నాయంగా పనిచేసి, కాలేయ, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
నేల వేము వల్ల కలిగే దుష్ప్రభావాలు
ఎంతటి దివ్యౌషధమైనా మోతాదు మించితే అనర్థమే. నేల వేము అతిగా వాడినా, లేదా మీ శరీర తత్వానికి సరిపడకపోయినా ఈ క్రింది దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మోతాదు మించితే జీర్ణం సరిగ్గా అవ్వక విరేచనాలు కలగవచ్చు.
చిగుళ్ల నుండి అసాధారణ రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.
కడుపులో నొప్పి, గుండెల్లో మంట రావచ్చు.
రక్తపోటు లేదా రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోవచ్చు.
కొందరిలో వికారం లేదా వాంతులు అయ్యే అవకాశం ఉంది.
ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత మూలికను వాడే ముందు, తప్పనిసరిగా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి, తగిన మోతాదులో మాత్రమే వాడి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
